WOMAN COMPLAINS OF DOCTOR KISSING HER DURING DENTAL TREATMENT PVN
Woman : ట్రీట్మెంట్ సమయంలో మహిళకు డాక్టర్ ముద్దులు..పెట్టా కానీ తప్పేముందన్న డాక్టర్!
ప్రతీకాత్మక చిత్రం
Woman Complains Of Doctor Kissing : దంత చికిత్స (Dental Treatment)సమయంలో రోగిని ముద్దుపెట్టుకున్న(Kiss) కేసులో ఒక వైద్యుడు(Doctor) నిర్దోషిగా విడుదలయ్యాడు.
Woman Complains Of Doctor Kissing : దంత చికిత్స (Dental Treatment)సమయంలో రోగిని ముద్దుపెట్టుకున్న(Kiss) కేసులో ఒక వైద్యుడు(Doctor) నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ ఘటన బహ్రెయిన్‌లో చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ... పేషెంట్ ని ఓదార్చడానికి ఆమె తలపై ముద్దు పెట్టుకున్నాడన్న డాక్టర్ వాదనను కోర్టు అంగీకరించింది. గత నెలలో బహ్రెయిన్(Bahrain)లోని దక్షిణ గవర్నరేట్‌లో 53 ఏళ్ల మహిళ దంత చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లింది. అయితే ట్రీట్మెంట్ సమయంలో 45 ఏళ్ల డాక్టర్..తన నుదిటిపై మూడుసార్లు ముద్దు పెట్టాడని మహిళ ఆరోపించింది. డాక్టర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆ తర్వాత తన బుగ్గలపై కూడా డాక్టర్ ముద్దుపెట్టాడని ఆమె మాట మార్చింది.
అయితే క్లినిక్ లో ట్రీట్మెంట్ సమయంలో అల్లరిచేస్తున్న ఆమెను ఓదార్చేందుకే తాను ఆమె నుదిటిపై ముద్దు పెట్టానని అంతేకాకుండా చూసేందుకు ఆమె తన తల్లికన్నా వృద్ధురాలిగా కనిపిస్తోందని డాక్టర్ తెలిపాడు. ఆ మహిళ తప్పుగా ఊహించుకొని తనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ తెలిపారు. అంతేకాకుండా దంత చికిత్స పూర్తయినతర్వాత..ఆమె ఆశించిన విధంగా ట్రీట్మెంట్ జరగలేదని డాక్టర్ తెలిపారు.
ఈ కేసులో డాక్టర్..పేషెంట్ ని లైంగికంగా వేధించాడనడానికి ఎలాంటి ఆధారాల్లేవని,కాబట్టి డాక్టర్ ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. డాక్టర్ తన తలపై ముద్దు పెట్టుకున్నాడని మహిళ మొదట్లో చెప్పింది, అయితే అతను తన చెంపపై ముద్దు పెట్టుకున్నాడని ఆమె తర్వాత మాట మార్చింది. డాక్టర్ తరపు న్యాయవాది కోర్టులో..ఆ మహిళ స్టేట్మెంట్లు విరుద్ధంగా ఉన్నందున వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పారు. వాదనలు విన్న కోర్టు డాక్టర్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
మరోవైపు,ముంబైలోని హైవేపై ఒక యువతి (Girl drink) తప్పతాగి రోడ్డుమీదకు వచ్చింది. అక్కడ వచ్చిపోయే వాహానాలను ఆపుతూ.. నానా రచ్చ చేసింది. దీంతో అక్కడి వారు ఆమెను వారించడానికి చూశారు. కానీ ఆమె తాగిన మైకంలో (Alcohol addict) అందరిని తిడుతూ, హంగామా చేసింది. అయితే, ఒక పోలీసు అధికారి ఆ మార్గం గుండా వెళ్తున్నారు. వెంటనే తన వాహానాన్ని ఆపి యువతికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ యువతి మరింత రెచ్చిపోయింది. ఏకంగా పోలీసు అధికారి కాలర్ పట్టుకుంది. ఆ తర్వాత.. మద్యం మత్తులు ఇష్టమోచ్చినట్టు బూతులు తిడుతూ.. తన్నడానికి ప్రయత్నించింది. అంతటితో ఆగకుండా.. పోలీసు అధికారి ధరించిన మాస్క్ ను కూడా తీసిపాడేసింది. విధుల్లో ఉన్న అధికారిపై అగౌరవంగా ప్రవర్తించింది. స్థానికులు ఆమెకు ఎంత చెప్పిన ఆమె వినించుకొవడం లేదు. ఈక్రమంలో.. అక్కడ ఉన్నవారు.. యువతి ప్రవర్తిస్తున్న తీరును తమసెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video)తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.