ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ...పంజా విసిరి..గోళ్లతో రక్కేసిన చిరుత

స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: March 11, 2019, 10:51 PM IST
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ...పంజా విసిరి..గోళ్లతో రక్కేసిన చిరుత
(Image: Twitter/CNN)
news18-telugu
Updated: March 11, 2019, 10:51 PM IST
యూత్‌లో సెల్ఫీ పిచ్చి బాగా ముదురుతోంది. ఏం చేసినా ఫొటో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది.  లైక్స్, కామెంట్స్ కోసం ఎప్పుడు పడితే అప్పుడు..ఇక్కడి పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక రన్నింగ్ ట్రైన్, ఎత్తైన కొండలు, జలపాతాలు వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఆరిజోనాలో ఓ యువతి ఇలాంటి రిస్కే చేసింది. జూలో చిరుతతో సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది.

లిచ్‌ఫీల్డ్ పార్క్‌లోని జూలో ఓ యువతి నల్ల చిరుతతో సెల్ఫీ దిగేందుకు సరదగా పడింది. ఐతే దూరం నుంచి ఫొటో తీసుకోకుండా...అతి దగ్గరగా వెళ్లి అక్కడున్న ఫెన్సింగ్ ఎక్కేసింది. కెమెరా ఓపెన్ చేసి పోజిచ్చే సమయంలో.. వెనకాల నుంచి చిరుత వచ్చి దాడిచేసింది. ఆమె చేతిపై పంజా విసిరి గోళ్లతో రక్కేయడంతో..ఏడుస్తూ కేకలు వేసింది. అక్కడే ఉన్న ఓ మహిళ.. చిరుత దృష్టిని మరల్చేందుకు సమయ స్ఫూర్తితో బోను లోపలికి బాటిల్ విసిరేసింది. ఏదో పడిదందని గుర్తించిన చిరుత..బాటిల్ దగ్గరకు వెళ్లింది. అప్పటికే అప్రమత్తమంగా ఉన్న ఇతర సందర్శకులు చాకచక్యంగా ఆ యువతిని వెనక్కి లాగేశారు. దాంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.










First published: March 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...