Home /News /international /

WITH ZERO NOTICE UK FERRY COMPANY LAYS OFF HUNDREDS OF WORKERS OVER ZOOM CALL PVN

Lays Off : 3 నిమిషాల జూమ్ కాల్..800మంది ఉద్యోగాలు అవుట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Company Lays Off 800 Employees : గతేడాది డిసెంబర్‌ లో అమెరికాకు చెందిన Better.com అనే కంపెనీ సీఈవో విశాల్‌ గార్గ్‌ ఓ జూమ్‌ కాల్‌ లో 900 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. మానవత్వం లేకుండా ఇలా ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేసినందుకు చాలా మంది సీనియర్ ఇండస్ట్రీలిస్టులు కూడా అప్పుడు గర్గ్‌‌ ను విమర్శించారు

ఇంకా చదవండి ...
U.K. Ferry Company Lays Off 800 Workers : గతేడాది డిసెంబర్‌ లో అమెరికాకు చెందిన Better.com అనే కంపెనీ సీఈవో విశాల్‌ గార్గ్‌ ఓ జూమ్‌ కాల్‌ లో 900 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. మానవత్వం లేకుండా ఇలా ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేసినందుకు చాలా మంది సీనియర్ ఇండస్ట్రీలిస్టులు కూడా అప్పుడు గర్గ్‌‌ ను విమర్శించారు . జూమ్‌ కాల్‌లో 900 మందిని తొలగించిన విషయాన్ని ఇంకా మరవక ముందే.. మరో కంపెనీ కూడా తమ ఉద్యోగులపై ఇలాగే నిర్దయగా వ్యవహరించింది. మూడు నిమిషాల జూమ్‌ కాల్‌ 800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది బ్రిటీష్ షిప్పింగ్ కంపెనీ పీ అండ్ ఓ. అంతమందిని ఒకేసారి ఉద్యోగంలో నుంచి తీసేయడం చర్చనీయాంశం అయింది.

పీ అండ్ ఓ బ్రిటీష్ షిప్పింగ్ కంపెనీ యూకే, ఐర్లాండ్, యూరప్ దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ సీఈవో జానెట్ బెల్. అయితే కోవిడ్ లాక్‌డౌన్ తో ఈ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. 1100 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఆదాయం రాలేదు. దీంతో ఈ సంస్థ యూకే ప్రభుత్వం నుంచి 10 మిలియన్లను అప్పుగా తీసుకుంది. అయితే ఈ రెండేళ్లలో కంపెనీ లాభాల్లో రాకపోగా తీవ్రంగా నష్టపోయింది. ఏకంగా 200 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో కంపెనీలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏ సంస్థ అయినా ఓ ఉద్యోగిని తొలగించాలంటే చట్టం ప్రకారం కొన్ని నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పీ అండ్ వో సంస్థ మాత్రం ఉద్యోగులకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. మీ సేవలు చాలు వెంటనే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాం అని 3 నిమిషాల జూమ్‌ కాల్‌ లో 800 మంది ఉద్యోగులకు చెప్పేసింది. వీరు నోటీస్ పీరియడ్‌‌లో పనిచేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. తక్షణమే తామ నిర్ణయం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.

ALSO READ Cooking oil crisis : వంట నూనె కోసం క్యూలో నిలబడి ఇద్దరు మృతి

"కంపెనీకి నష్టాలు రావడంతో మీ ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు మీకు తెలియజేయడానికి నేను చింతిస్తున్నాను. మిమ్మల్ని జాబ్ నుంచి తొలగిస్తున్నాం. మీ ఉద్యోగానికి ఈరోజు చివరి రోజు” అని పీ అండ్ ఓ చీఫ్‌‌ జూమ్‌‌ కాల్‌‌ లో పేర్కొన్నారు. కొన్ని రోజుల పాటు తమ సంస్థ సేవలు నిలిపేస్తున్నట్లు కూడా పీ&వో తెలిపింది. ఊహించని పరిణామంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టారు.

ప్రస్తుతం ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలొస్తున్నాయి. బ్రిటన్‌ పార్లమెంట్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. అక్కడి మంత్రులకు ఇప్పుడా సంస్థ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. ఉద్యోగుల పట్ల మర్యాదగా మెలగాల్సినవసరం ఉందని, కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Britain, Employees, Zoom

తదుపరి వార్తలు