అయ్యబాబోయ్.. కేజీ టమాటా రూ.300.. ఎక్కడంటే..

పాకిస్తాన్‌లో కేజీ టమాట ధర రూ.300కు చేరుకుంది. అయితే, భారత్‌తో వ్యాపారాన్ని రద్దు చేయడంతో ఈ దుస్థితి వచ్చినట్టు ఆ దేశ మంత్రి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 4, 2019, 4:45 PM IST
అయ్యబాబోయ్.. కేజీ టమాటా రూ.300.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేజీ టమాటా ధర రూ.300. వామ్మో, ఇంత రేటు పెరిగిపోయిందా? అసలే ఉల్లి ధరలతో చస్తుంటే, ఇప్పుడు టమాటా ధరలు కూడా ఇలాగే పెరిగిపోతే ఎలా? అని సందేహిస్తున్నారా?. అయితే, ఇంకా మన దగ్గర అంత రేటు పెరగలేదు. పాకిస్తాన్‌లో మాత్రం కిలో టమాటా రూ.300కు పెరిగింది. అయితే, ఇంత ధరలు పెరగడానికి కారణం భారత్‌తో వ్యాపారాన్ని రద్దు చేయడమేనని పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన ఆర్థిక బృందం సభ్యులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆ దేశ ఆర్థిక వ్యవహారాల మంత్రి హమద్ అజర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో వ్యాపారాలను సస్పెండ్ చేయడమే దేశంలో రేట్లు పెరగడానికి, ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం, కొందరు మధ్యవర్తులు కూడా దీనికి కారణమే.’ అని మంత్రి చెప్పినట్టు డాన్ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది.

ధరలు పెరుగుతుండడంతో, ప్రజలకు తక్కువ రేట్లకే సరుకులు, కూరగాయలు విక్రయించేలా ‘సస్తా బజార్’ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు మంత్రి తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్.. భారత్‌తో వ్యాపార సంబంధాలకు బ్రేక్ వేసింది. దీంతో భారత్ నుంచి పాకిస్తాన్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు