ట్రంప్-కిమ్ భేటీకి గూర్ఖాల సెక్యూరిటీ..!

అమెరికా-నార్త్ కొరియా సదస్సు నేపథ్యంలో ఇప్పటి నుంచే భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. సమ్మిట్ జరిగే ప్రాంతతో  పాటు  ప్రధాన రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు,  హోటల్స్ దగ్గర డ్రై రన్ నిర్వహిస్తున్నారు. అంతమి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా..గూర్ఖాలనే కీలక స్థానం.

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 2:49 PM IST
ట్రంప్-కిమ్ భేటీకి గూర్ఖాల సెక్యూరిటీ..!
జూన్ 1న ఐఐఎస్‌ఎస్ షాాంగ్రి లా సదస్సు సందర్భంగా గూర్ఖాల పహార (Photo: Reuters)
  • News18
  • Last Updated: June 6, 2018, 2:49 PM IST
  • Share this:
ఎన్నో ట్విస్టుల మధ్య ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ జరగబోతోంది. ఈ నెల 12న ఉదయం 9 గంటలకు సమావేశం జరగనుంది. ఒకరేమో అగ్రరాజ్యపు అధిపతి..మరొకరేమో అణుబాంబులతో ఆటాడుకునే దేశాధినేత.. ! మరి వీరిద్దరు సమావేశం కాబోతున్నారంటే యావత్ ప్రపంచం సింగపూర్ భేటీపైనే చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అరుదైన కీలక భేటీకి అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది సింగపూర్ ప్రభుత్వం.

అమెరికా-నార్త్ కొరియా సదస్సు నేపథ్యంలో ఇప్పటి నుంచే భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. సమ్మిట్ జరిగే ప్రాంతతో  పాటు  ప్రధాన రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు,  హోటల్స్ దగ్గర డ్రై రన్ నిర్వహిస్తున్నారు.  సదస్సు  కోసం అమెరికా, నార్త్ కొరియా అధికారులు కోసం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అంటే మొత్తం మూడు దేశాల సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అంత మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా .. వారిలో కొందరు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారెవరో కాదు..గూర్ఖాలు..!

సింగపూర్‌లో గూర్ఖాల సంఖ్య చాలా తక్కువ. కానీ  అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు జరిగేటప్పుటు వీళ్ల సెక్యూరిటీ విధులు తప్పనిసరి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్‌లో పర్యటించారు. షాంగ్రి లా హోటల్‌లో జరిగిన ఓ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ జిమ్ మాటిస్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఆ సమావేశానికి సైతం గూర్ఖాలు సెక్యూరిటీ కల్పించారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యోధుల్లో గూర్ఖాలు ఒకరు. నేపాల్‌లో ఎక్కువగా ఉండే గూర్ఖాలను తమ సైన్యంలో నియమించుకుంటోంది సింగపూర్. ప్రస్తుతం వీళ్లు బెల్జియం మేడ్ FN SCAR రైఫిల్స్ తో   పిస్టల్స్‌తో సింగపూర్‌లో పహారా  కాస్తున్నారు. ఎన్ని అధునాతన ఆయుధాలు ఉన్నా ..వారి సంప్రదాయ మారణాయుధం లేనిదే వాళ్లు బయటకు వెళ్లరు. అదే ఖుక్రీ..!

ప్రస్తుతం సింగపూర్ ఆర్మీలో 1800 గూర్ఖాలు పనిచేస్తున్నారు.  సింగపూర్ మాత్రమే కాదు. చాలా దేశాలు తమ సైన్యంలోకి గూర్ఖాలను రిక్రూట్ చేసుకుంటున్నాయి. 19వ శతాబ్దంలో జరిగిన ఆంగ్లో-నేపాలీస్ యుద్ధంలో గూర్ఖాలు వీరోచితంగా పోరాడారు.  వాళ్ల అసాధారణ పోరాట పటిమను చూసి బ్రిటిష్ కల్నల్.. వారిని తమ సైన్యంలో చేర్చుకున్నారు. గూర్ఖాలు బ్రిటన్‌తో పాటు సింగపూర్, ఇండియన్ ఆర్మీల్లోనూ పనిచేస్తున్నారు. అంతటి శక్తివంతమైన యోధలు కాబట్టే..ట్రంప్-కిమ్ భేటీకి కూడా వీళ్లు భద్రత కల్పిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 5:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading