బ్రిటన్ టూరిస్టులకు షాక్ ఇచ్చిన థామస్ కుక్... మెక్సికోలో నిలిచిన ఫ్లైట్ సర్వీసులు

Thomas Cook Collapse : టూరిస్టులెవరూ ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదు. థామస్ కుక్ సడెన్ నిర్ణయంతో... దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు పర్యాటకులు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 2:30 PM IST
బ్రిటన్ టూరిస్టులకు షాక్ ఇచ్చిన థామస్ కుక్... మెక్సికోలో నిలిచిన ఫ్లైట్ సర్వీసులు
బ్రిటన్ టూరిస్టులకు షాక్ ఇచ్చిన థామస్ కుక్... మెక్సికోలో నిలిచిన ఫ్లైట్ సర్వీసులు
  • Share this:
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ థామస్‌ కుక్‌ దివాళా తీయడం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 178 సంవత్సరాలుగా పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న థామస్ కుక్ సంస్థ తన సేవలను ఒక్కసారిగా నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5 లక్షల మంది పర్యాటకుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ముఖ్యంగా మరే యూరోపియన్ దేశమూ పంపనంత ఎక్కువ మంది పర్యాటకుల్ని బ్రిటన్... మెక్సికోలోని కరీబియన్ దీవులు, వైట్ శాండ్ బీచ్‌లకు పంపింది. అమెరికా, కెనడా తర్వాత... అక్కడ ఎక్కువగా ఉన్నది బ్రిటన్ పర్యాటకులే. ఇప్పుడు వాళ్లంతా తిరిగి తమ దేశానికి ఎలా వెళ్లాలనేది అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. కరీబియన్ దీవుల్లోని కాన్కన్ ఎయిర్‌పోర్ట్ దగ్గర వందల మంది టూరిస్టులు ఇళ్లకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు.

టూరిజం రంగంలో విపరీతమైన పోటీతో థామస్ కుక్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. సంస్థ దివాళా తీయకుండా నిలిచేందుకు, బిల్లులు చెల్లించేందుకు సుమారు రూ.1500 కోట్లు అవసరం. ఆ మొత్తాన్ని సమీకరించడంలో థామస్‌ కుక్‌ విఫలమైంది. ఫలితంగా ఆ సంస్థ ద్వారా వివిధ రకాల ప్యాకేజీలను బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు.


రాత్రికి రాత్రి మూతపడిన థామస్ కుక్ వల్ల బ్రిటన్‌కి చెందిన 300 టూరిస్టులు తాము బ్రిటన్ ఎలా వెళ్లాలో అర్థం కాక... సాయం కోసం చూస్తున్నారు. నిజానికి వాళ్లు థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన రెండు విమానాల్లో వెళ్లాల్సి ఉంది. ఒక విమానం మాంచెస్టర్, మరొకటి లండెన్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రెండు విమానాలు సడెన్‌గా రద్దయ్యాయి. కొంతమంది మాంచెస్టర్‌కి వేరే ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు మెక్సికోలోని బ్రిటన్ రాయబార కార్యాలయం నుంచీ వెళ్లిన సిబ్బంది సాయం చేస్తున్నారు.

గతేడాది 5.90లక్షల మంది పర్యాటకులు మెక్సికో వెళ్లారు. వాళ్లలో 77 శాతం మంది కాన్సన్ వెళ్లారని మెక్సికో టూరిజం శాఖ తెలిపింది.
Published by: Krishna Kumar N
First published: September 24, 2019, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading