ట్రంప్ గెలుపు బాలీవుడ్ సినిమాలా ఉంటుందన్న జూనియర్ ట్రంప్

Donald Trump Impeachment : అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌పై అభిశంసన తీర్మానం కలకలం రేపుతోంది. ఇదో పెద్ద కుంభకోణం అని ట్రంప్ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: December 15, 2019, 7:46 AM IST
ట్రంప్ గెలుపు బాలీవుడ్ సినిమాలా ఉంటుందన్న జూనియర్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్
  • Share this:
Donald Trump Impeachment : ప్రపంచవ్యాప్తంగా రకరకాల వార్తలుండగా... అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన అంశం సడెన్‌గా తెరపైకి వచ్చింది. ఇప్పుడు అభిశంసన ఏంటి, అమెరికాలో ఏం జరుగుతోంది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇదే అంశంపై ట్రంప్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇది అన్యాయం అన్న ఆయన... దేశం కోసం ఎంతో చేసిన తనను అభిశంసించాలని చూస్తున్నారని ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. "ఇది అన్యాయం. కక్ష సాధింపు. ఇదో పెద్ద కుంభకోణం. వైట్ హౌస్ లోకి రాకముందే ఇది మొదలైంది" అని ఆయన ట్వీట్‌ చేశారు. ట్రంప్ ట్వీట్‌ని బట్టీ చూస్తే... ఆయన ఆందోళన చెందుతున్నట్లే కనిపిస్తోంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన అభిశంసన (పదవి నుంచీ తొలగించే ప్రక్రియ) అంశం ట్రంప్‌కి కొత్త తలనొప్పిగా మారింది.


జూనియర్ ట్రంప్ మాత్రం... ట్రంప్ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇండియా లాంటి మిత్రదేశాలతో కలిసి అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని కొనసాగిస్తుందన్న ఆయన... 2020లో ట్రంప్ మళ్లీ గెలుస్తారనీ... ఆ గెలుపు బాలీవుడ్ సినిమాలా ఉంటుందనీ, కాకపోతే... తక్కువ డాన్సులతో ఉంటుందని చమత్కరించారు. తన సోదరి ఇవాంకా ట్రంప్, సోదరుడు జారేద్ కుష్నర్ లాగా జూనియర్ ట్రంప్... తన తండ్రి పాలనాపరమైన అంశాల్లో ఎలాంటి పాత్రలూ పోషించట్లేదు. కానీ. ట్రంప్‌కి సంబంధించిన ర్యాలీలు, ఈవెంట్ల విషయాల్ని మాత్రం చూసుకుంటున్నారు. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తుపై ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.ట్రంప్‌పై అభిశంసన తీర్మానంలోని రెండు ఆర్టికల్స్‌కు ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఆ తీర్మానం ప్రతినిధుల సభ ముందుకు రానుంది. ఈ సభలో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి మెజారిటీ ఉంది. అందువల్ల అభిశంసన తీర్మానం విషయలో ప్రతిపక్షం గెలిచే అవకాశాలున్నాయి. ఇక్కడ గెలిస్తే నెక్ట్స్ ఆ తీర్మానం సెనేట్‌కు వెళుతుంది. అక్కడ అధికార రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉంది. అందువల్ల అక్కడ తాను గెలవగలనని ట్రంప్ భావిస్తున్నారు. 

Pics : కుందనపు బొమ్మ శ్రేయ ఘోషాల్... క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

 

నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు

ప్రపంచ సుందరిగా టోనీ ఆన్న్ సింగ్... భారత యువతికి మూడో స్థానం

IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్

ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?

Health : ఒరెగానో వాడుతున్నారా... కిచెన్‌లో ఇది ఉంటే ఆరోగ్యమే
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు