Home /News /international /

Winter Olympics 2022: క్రీడ‌ల‌పై కొత్త వేరియంట్ ప్ర‌భావం.. వింట‌ర్ ఒలంపిక్స్ నిర్వ‌హ‌ణ సాధ్య‌మేనా?

Winter Olympics 2022: క్రీడ‌ల‌పై కొత్త వేరియంట్ ప్ర‌భావం.. వింట‌ర్ ఒలంపిక్స్ నిర్వ‌హ‌ణ సాధ్య‌మేనా?

ఒలింపిక్స్ (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఒలింపిక్స్ (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Winter Olympics 2022: కొవిడ్ కొత్త వేరియం ట్ ‘ఒమిక్రాన్’తో ప్రపం చ దేశాలన్ని అప్రమత్తమైన విషయం తెలిసిం దే. ఇదే క్రమం లో ఈ వేరియం ట్ కారణం గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజిం గ్ వి టర్ ఒలింపిక్స్ నిర్వహణ సాధ్య‌మేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇంకా చదవండి ...
  కరోనా వైరస్ (Corona Virus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఇప్పటి దాకా ఒక్కరు కూడా చనిపోలేదని, కాబట్టి అదంత ప్రమాదకారి కాదని గడిచిన కొద్ది గంటలుగా విశ్లేషణలు, కామెంట్లు వెలువడుతున్నాయి. ఏ ఇద్దరు కలిసి, ఏ ఇంట్లో విన్నా ప్రస్తుతం ఒమిక్రాన్ గురించే చర్చ. సౌతాఫ్రికా (South Africa) లో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు వ్యాపించింది. వేగం గా వ్యా ప్తి చెం దుతున్న కొవిడ్ కొత్త వేరియం ట్ ‘ఒమిక్రాన్’తో ప్రపం చ దేశాలన్ని అప్రమత్తమైన విషయం తెలిసిం దే. ఇదే క్రమం లో ఈ వేరియం ట్ కారణం గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజిం గ్ వి టర్ ఒలింపిక్స్ నిర్వహణ సాధ్య‌మేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చైనా (China) విదేశాంగ మం త్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడుతూ ఒమిక్రాన్ కార‌ణంగా వింట‌ర్ ఒలంపిక్స్ నిర్వ‌హ‌ణలో ఇబ్బందులు ఎదుర్కొవ‌చ్చ‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

  ప్ర‌స్తుతం అన్ని వేరియంట్ల‌కంటే ఆరు రెట్టు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేప‌థ్యంలో ఒలంపిక్స్ నిర్వ‌హ‌ణ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకొన్నాయి. అయితే చైనాకు ఇటువంటి స‌వాళ్లు కొత్త‌కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఒలంపిక్స్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకొంటామ‌ని పేర్కొన్నారు.

  Sirivennela Seetharama Sastry: ప్ర‌తీ పాటలో ఓ చెమ‌క్కు.. "సిరివెన్నెల" ఆణిముత్యాలు ఎన్నో


  ఈ వేరియంట్ వల్ల దక్షిణాఫ్రికా ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా చాలా దేశాలు అక్కడికి వెళ్లడాన్ని నిషేధించాయి.

  ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు... ప్ర‌భావం
  - ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్ర‌త్యేకంగా లేవు.
  - డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొంద‌రిలో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు.
  - వేరియంట్ సోకిన‌వారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
  - గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్న‌ట్టు వైద్యులు గుర్తించారు.
  - ఓమిక్రాన్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ ప్రభావం లేదు.
  - ఓమిక్రాన్ రోగనిరోధక వ్యవస్థను దెబ్బ‌తీస్తుంది.
  - ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువ‌గా ఉంటాయి.
  - వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువ‌గా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.

  ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో యూకే ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ మళ్లీ ఆంక్షలు విధించారు. ప్ర‌జ‌లు కొత్త వేరియంట్ వ్యాప్తి త‌గ్గించుకోవ‌డానికి కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని మాస్కులు ధ‌రించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ప్ర‌భుత్వాలు అంద‌రికీ టీకాలు అందేలా చూడాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని జీనోమిక్స్ సర్వైలెన్స్ నెట్‌వర్క్(NGS-SA) చెప్పిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో కొద్ది రోజుల్లోనే కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యం అందుకోవచ్చు. కానీ, కొత్త వేరియెంట్ లక్షణాలు అంత త్వరగా బయటపడటం లేదు. బాగా ముదిరిని తర్వాత బయటపడితే.. వైద్యం కూడా కష్టమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Olympics, Omicron corona variant

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు