మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట విషాదం.. తండ్రి కన్నుమూత

విలియమ్ హెచ్. గేట్స్

కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేసిన తర్వాత.. ప్రిస్టన్ గేట్స్, ఎలిస్ లా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఫౌండేషన్ ది బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.

  • Share this:
    మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి విలియం హెన్రీ గేట్స్ II (94) సోమవారం కన్నుమూశారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ 94 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. వాషింగ్టన్ స్టేట్ హుడ్ కెనాల్‌లోని తన బీచ్ హోమ్‌లో హెన్నీ గేట్స్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. తన తండ్రి మరణం ఎంతగానో బాధిస్తోందని బిల్ గేట్స్ అన్నారు. '' మా నాన్నే నిజమైన బిల్ గేట్స్. నేను ఆయనను ప్రతిరోజూ కోల్పోతాను. బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించడంలో నాన్న పాత్ర చాలా కీలకం.''అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.


    విలియం హెన్రీ గేట్స్‌ IIని బిల్ గేట్స్ సీనియర్‌గా కూడా పిలుస్తారు. సీనియర్ గేట్స్ నవంబర్ 30, 1925న వాషింగ్టన్‌లోని బ్రెమెర్టన్‌లో జన్మించారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నారు. అనంతరం ఆర్మీలో చేరి దేశానికి సేవలందించారు. ఆ తర్వాత ఆర్మీ నుంచి బయటకు వచ్చి 1950లో లా డిగ్రీ చదివారు. కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేసిన తర్వాత.. ప్రిస్టన్ గేట్స్, ఎలిస్ లా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఫౌండేషన్ ది బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. సీనియర్ గేట్స్‌కు కుమారుడు బిల్ గేట్స్, కూతుళ్లు క్రిస్టియానా బ్లేక్, ఎలిజబెత్ మెక్‌ఫీ ఉన్నారు. ఎనిమింది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: