హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Ukraine War: అప్పటిలోగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసిపోతోందా ?

Russia Ukraine War: అప్పటిలోగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసిపోతోందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్2పై సైనిక చర్యను ప్రారంభించినప్పుడు ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో 10 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ చెబుతోంది.

  రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దగ్గరపడుతోంది. యుక్రెయిన్‌లోని అనేక నగరాలు యుద్ధంలో ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు తమ దేశాన్ని విడిచిపెట్టి శరణార్థులుగా బతకవలసి వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. అవి అంత సానుకూలంగా సాగడం లేదు. పరిష్కారం దిశగా వెళుతున్నట్టు కనిపించడం లేదు. దీంతో అందరి మదిలో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న మెదులుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అయితే దీనికి ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ ఓ సంకేతం ఇచ్చారు. దీని ప్రకారం మే 9 నాటికి రష్యా యుద్ధాన్ని ముగించవచ్చన్నది దాని సారాంశం.

  ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నుండి వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం మే 9 నాటికి యుద్ధం ముగియాలని రష్యా దళాలకు చెబుతున్నట్లు కైవ్ ఇండిపెండెంట్ ట్వీట్ చేసింది. అదే సమయంలో ఉక్రెయిన్ అంబుడ్స్‌మన్ లియుడ్మిలా డెనిసోవా రష్యా 4,02,000 ఉక్రేనియన్లను తీసుకువెళ్లిందని పేర్కొన్నారు.

  అంతకుముందు గురువారం యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా తలెత్తిన మానవతా సంక్షోభ పరిస్థితికి సంబంధించి నాటో అత్యవసర సమావేశంలో ఒక తీర్మానాన్ని తీసుకువచ్చారు. ఈ తీర్మానం 140 ఓట్లతో ఆమోదం పొందింది. అదే సమయంలో దీనికి 38 దేశాలు గైర్హాజరయ్యాయి. ఐదు సభ్య దేశాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

  Srilanka Crisis: కిలో చికెన్ 1200.. బియ్యం 500.. చక్కెర 300.. బాబోయ్.. ఏంటా రేట్లు..?

  భారత్ కు చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి.. అజిత్ ధోవల్, జైశంకర్ లతో భేటీ.. కారణం ఏంటంటే..

  రాయిటర్స్ నివేదిక ప్రకారం ఒలెక్సీ ఈ వ్యాఖ్యలు చేశారు. మే ప్రారంభంలో ఈ యుద్ధం ఆగిపోతుందని తాను భావిస్తున్నానని.. దీనిపై శాంతి ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను ఈ మాట చెబుతున్నానని పేర్కొన్నారు. మే నాటికి యుద్ధం ఆగిపోతుందని భావిస్తున్నానని.. అప్పటికి రష్యా అవసరమైన అన్ని వనరులు అడుగంటిపోతాయని ఆయన అన్నారు. తాము రహదారిలో ఒక చీలిక వద్ద నిలబడి ఉన్నామని.. అక్కడ శాంతి ఒప్పందం త్వరగా కుదుర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ తరువాత సైన్యం వెనక్కి తగ్గుతుందని లేకపోతే అంతా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఒక్కసారి శాంతి ఒప్పందం కుదిరినా.. వచ్చే ఏడాది పాటు చిన్నపాటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

  రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్2పై సైనిక చర్యను ప్రారంభించినప్పుడు ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో 10 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ చెబుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Russia-Ukraine War

  ఉత్తమ కథలు