Home /News /international /

WILL NEW COVID 19 VARIANT IS THE REASON BEHIND CORONAVIRUS CASES INCREASING IN CHINA AND EUROPE AK

Corona New Variant: కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందా ?.. అక్కడ కేసులు పెరగడానికి కారణం ఏంటి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలో మరో కరోనా మహమ్మారి మరో వేవ్ మొదలైందా? చైనా, యూరప్‌లో వెలుగుచూస్తున్న పరిణామాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి.

  చైనాలో రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడి రెండు నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. కరోనా లాంటి లక్షణాలతో మరోసారి ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందని యూరోపియన్ దేశాల నుండి వార్తలు వస్తున్నాయి. బ్రిటన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ మరియు ఇటలీ వంటి దేశాలు గత వారంలో వెలుగుచూసిన కోవిడ్ -19 (Covid 19) కేసులు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యలో పెరుగుదల నమోదైంది. యూరోప్‌లో (Europe) కరోనా కొత్త వేవ్ మొదలైందని ఎరిక్ టోపోల్, MD, స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషనల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపకుడు ట్వీట్ చేశారు. కొత్త రోగుల డేటా ఈ దిశలోనే ఉందని అన్నారు. యూరప్‌లోని వివిధ దేశాలు సుమారు ఒక నెల తర్వాత నిబంధనలను సడలించాయి. ఇప్పుడు కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. అమెరికాలో(America) కూడా అదే జరిగింది. ఇప్పుడు మినహాయింపు ఇవ్వడంలో తొందరపాటు చర్యే అనే ప్రశ్న తలెత్తుతోంది.

  చైనాలో ఆదివారం 3,400 కరోనా కేసులు నమోదవడంతో పరిస్థితి భయానకంగా మారింది. దీంతో వైరస్‌ హాట్‌స్పాట్‌ల వద్ద లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాను విస్తరింపజేసిందనే ఆరోపణలు ఎదుర్కొన్న చైనా.. మళ్లీ కరోనాతో ఇబ్బందిపడుతోంది.

  చైనా షెన్‌జెన్ ప్రావిన్స్‌లోని 17 మిలియన్ల మందిని లాక్‌డౌన్‌లో నిర్బంధించింది. ఫిబ్రవరిలో జనాభాలో 87% మందికి మొదటి డోస్, రెండవ డోస్ 40% జనాభాకు ఇచ్చినట్లు ప్రకటించిన చైనా.. మొదటిసారిగా ఒక రోజులో 1,000 కంటే ఎక్కువ కేసులు వచ్చినట్టే పేర్కొంది.

  భారతదేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 2,503 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,15,877కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 36,168.

  దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలో మూడో వూవ్ కరోనా వైరస్ సంక్రమణ తగ్గిపోయింది, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త అధ్యయనం Omicron తర్వాత కొత్త వేరియంట్ ఉద్భవిస్తున్నట్లు వెల్లడించింది. ఇది డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌ల కలయిక అని సంస్థ పేర్కొంది. ఓమిక్రాన్, డెల్టా కలిసి కొత్త వైరస్‌ని తయారు చేస్తున్నాయని... ఈ కొత్త కాంబినేషన్ వైరస్ గురించి ఇప్పటికే భయం ఉందని అభిప్రాయపడింది. ఈ రెండూ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని సంస్థ ఈ అధ్యయనం తెలిపింది. ఓమిక్రాన్, డెల్టా రీకాంబినెంట్ వైరస్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. SARSCov2 Omicron, Delta రకాలు కలిసి వ్యాపించే అవకాశం ఉందని సంస్థ శాస్త్రవేత్త మరియా వాన్ కర్ఖోవ్ ట్వీట్ చేశారు.

  Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా.. క్షేమం కోరుతూ PM Modi ట్వీట్

  Lockdown In China : కరోనా విజృంభణ..చైనాలోని మరో నగరంలో లాక్ డౌన్

  అదే జీనోమ్, ప్రొఫైల్ వైరస్‌లు డెన్మార్క్, నెదర్లాండ్స్‌లో కూడా కనుగొనబడినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ అంశంపై ఇంకా విచారణ జరుగుతోందని అధ్యయనం తెలిపింది. కొత్త కలయికతో ఉన్న అన్ని వైరస్‌లు ఒకే మ్యుటేషన్ నుండి ఉద్భవించాయా లేదా అలాంటి రీకాంబినేషన్ కేసులు చాలా ఉన్నాయా అనేది పరిశోధించాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో చెప్పబడింది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Corona virus

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు