• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • WILL KIM JONG UN SISTER KIM YO JONG SISTER NEVER BE SEEN AGAIN WHAT HAPPENED TO HER AK GH

Kim Jong Un: ఆ నియంత సోదరి ఏమైనట్టు ? ఇక ఎప్పటికీ కనిపించదా ?

కిమ్ జొంగ్ ఉన్ (ఫైల్)

Kim Jong Un: సొంత సోదరిపట్ల అధినేత కిమ్ జోంగ్ ఉన్ పగబట్టారా? ప్రపంచ మీడియాలో ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

  • Share this:
ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జాంగ్ (Kim Yo Jong) పై ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. కిమ్ అనారోగ్యం నేపథ్యంలో సోదరి జాంగ్ కి వారసత్వంగా అధికార పగ్గాలు ఇచ్చారన్న వార్తలు షికార్లు చేయగా.. గత కొంతకాలంగా కిమ్ మాత్రం పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా కెమరాల్లో కనిపించేస్తున్నారు. కానీ ఉన్నట్టుండి ఆయన చెల్లి జాంగ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. అధికార కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని ఈమె.. ప్రస్తుతం ఎక్కడ ఉందనే విషయం కూడా ఆసక్తిగొలుపుతోంది. సాధారణ పరిపాలనలో ఆమె విధానాలు వైఫల్యం చెందాయని కిమ్ తన సోదరిపై చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆమె జాడ కూడా ప్రస్తుతం తెలియకుండా ఉందనే పుకార్లకు బలం చేకూరుతోంది. సోదరి జాంగ్ ను ఆయన పూర్తిగా పక్కనపెట్టారని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియాలోనూ, అంతర్జాతీయంగానూ ఆమె గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయిందని, ప్రజలు, అధికారులు, పార్టీలోనూ ఆమె మాటే ఎక్కువ చెల్లుబాటవుతోందని కిమ్ తీవ్ర అసహనంలో ఊగిపోతున్నారని తెలుస్తోంది.

పొలిట్ బ్యూరోలో ఆమె పేరే లేదు
2016 తరువాత 8 రోజులపాటు సాగిన పార్టీ సమావేశంలో చివరి రోజు 30 మంది సభ్యులతో కూడిన పాలిట్ బ్యూరోనూ ప్రకటించగా అందులో అధినేత కిమ్ జోంగ్ ఉన్ పేరున్నప్పటికీ సోదరికిమ్ యో జాంగ్ పేరు మాత్రం ఎక్కడా లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. కానీ పార్టీ సెంట్రల్ కమిటీలో మాత్రం ఆమె పేరు ఇంకా ఉండటం విశేషం. ఎందుకంటే పార్టీ సెంట్రల్ కమిటీని హై లెవెల్ బాడీగా పేర్కొంటారు.. ఇందులో ఇంకా ఈమెకు సభ్వత్వం ఉందంటే అతి త్వరలో మరో పవర్ఫుల్ పోస్టులో ఈమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారేమో అన్న అనుమానాలు ఆదేశ ప్రజల్లో ఉన్నాయి.

ఇక ఇటీవలే దక్షిణ కొరియాపై (South Korea) ఆమె చేసిన కీలకమైన ప్రకటనను ప్రచురించిన మీడియా ఆమెను పార్టీ వైస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా పేర్కొనటం విశేషం. ఇది కచ్ఛితంగా డిమోషన్ గా భావిస్తున్నారు ఆ దేశ ప్రజలు. గతంలో ఆమెకు ఫస్ట్ వైస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ర్యాంకు ఉండగా ఇప్పుడు దానికంటే దిగువ ర్యాంకుతో ఆమెను సంబోధించటమంటే ఇది కిమ్ ఆగ్రహానికి తొలి గుర్తుగా విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇక కరోనా (corona) కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఉత్తర కొరియాను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేలా ఉత్తర కొరియా యావత్తు అధినేత కిమ్ వెంట ఉండేలా పార్టీ పాలిట్ బ్యూరోలో సైతం మార్పులు చేర్పులు చేసినట్టు భావిస్తున్నారు.

దూకుడైన తీరును ప్రదర్శించే తన సోదరుడితో పోల్చితే ఈమెకు "పీస్ మెసేంజర్" అనే ఇమేజ్ కూడా అదనంగా ఉంది. పరిపాలనా వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఈమెకున్న ప్రతిభా పాటవాలు అమోఘం కావటంతో అతి తక్కువ కాలంలోనే ఆమె పేరు దేశ, విదేశాల్లో మారుమోగటాన్ని కిమ్ సహించలేకపోయారనే వాదన వినిపిస్తోంది. తమ దేశంలో నంబర్ 2 హోదాలో ఉన్న జాంగ్ ఉన్నట్టుండి ఇలా తెరవెనుకకు వెళ్లిపోవటం వెనుక పెద్ద కుట్ర ఉందని కిమ్ ప్రవర్తన తెలిసినవారంతా భావిస్తున్నారు. అయినవారి అంతుచూసిన కిమ్ ఇప్పుడు సోదరిని మట్టుబెడతారా అన్న వాదనలు మొదలయ్యాయి.

లీకులు చెప్పేది ఇదే..
దాయాది దేశం దక్షిణ కొరియాపై, ఇటు అమెరికాపై జాంగ్ వ్యవహరించిన ధోరణితో ఆమె కిమ్ కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఇంటా, బయటా తన సోదరి ఇమేజ్ ఈ రేంజ్ లో పెరగటాన్ని కిమ్ జీర్ణించుకోలేకపోయారనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకోవటంతో పాటు ఆమెకు ఇచ్చిన అధికారంలోనూ కోత పెట్టారన్నది తాజా లీకుల సారాశం. అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలు అయినప్పటికీ ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆమధ్య అసలు ఈమె కనిపించటం లేదనే వార్తలు గుప్పుమన్నాయి.
Published by:Kishore Akkaladevi
First published: