Home /News /international /

Biden Policies: బైడెన్ పరిపాలనా విధానాలు.. భారత టెక్కీలకు మంచివేనా?

Biden Policies: బైడెన్ పరిపాలనా విధానాలు.. భారత టెక్కీలకు మంచివేనా?

జో బైడెన్ (ఫైల్ ఫొటో)

జో బైడెన్ (ఫైల్ ఫొటో)

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. భారత టెక్కీలకు మాత్రం గుబులుగా ఉంటుంది. ఎందుకంటే వీరి భవిష్యత్తు అగ్రరాజ్యాధిపతిపై ఆధారపడి ఉంటుంది. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జోయ్ బైడెన్ కొద్ది రోజుల్లోనే...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. భారత టెక్కీలకు మాత్రం గుబులుగా ఉంటుంది. ఎందుకంటే వీరి భవిష్యత్తు అగ్రరాజ్యాధిపతిపై ఆధారపడి ఉంటుంది. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జోయ్ బైడెన్ కొద్ది రోజుల్లోనే టెక్నాలజీ సంస్థలను, భారతీయ ఐటీ నిపుణులను ఉత్సాపరిచారు. ఎందుకంటే ఆయన పాలన.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలను తారుమారు చేసింది. అయినప్పటికీ మన టెక్కీలకు అంత సులభతరమేం కాదు. ఎందుకంటే కొన్ని విధానాలు అనుసరిస్తే ఔట్ సోర్సిగ్ మేజర్ లు వారి ఖర్చులను పెంచుతాయి.

ఉపాధిత ఆధారిత వర్గం కింద ఇచ్చే గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్లను క్లియర్ చేసే ఇమ్రిగ్రేషన్ బిల్లుపై 2021 జనవరి 20న బైడెన్ మొదటి సంతకం చేశారు. గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తోన్న అమెరికాలోని 8 లక్షల మంది భారతీయులు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. హెచ్1-బీ వీసా కింద జీవిత భాగస్వాములను పనిచేయకుండా నిషేధించడానికి ఉద్దేశించిన ప్రతిపాదిన నియమాన్ని కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తొలగించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో భారతీయలకు 1.3 లక్షల హెచ్-1బీ వీసాలు జారీచేశారు. ప్రతి ఏడాది 85 వేల కొత్త హెచ్1-బీ వీసాలు అందజేస్తారు. అయితే వేతనానికి సంబంధించిన నియమం మాత్రం కొంచెం ఆందోళన కలిగించనుంది. ప్రస్తుతం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్1బీ ఉద్యోగులకు వేతనాలు పెంచే నిబంధనను సమీక్షిస్తోంది. 2021 డిసెంబరు 31 చివరి వరకు వేతనాల ఆధారంగా హెచ్1-బీ వీసా ఎంపికను వాయిదా వేసినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేసే అవకాశముంది.

ప్రసుతానికి కంపెనీలు ఈ నిబంధనతో సురక్షితంగా వ్యవహరిస్తున్నాయి. వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి స్థానిక నియమకాన్ని కొనసాగించే అవకాశముంది. అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీల కోసం ఇంటి నుంచి ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తుండటంతో వీసాలపై ఆధారపడటం కూడా సమీప కాలంలో తగ్గే అవకాశముంది. ఎందుకంటే ఎక్కువ కంపెనీలు పనిని ఆఫ్ షోర్ కు తరలిస్తాయి.
స్థానికత ద్వారా చాలా మంచి ప్రదర్శన ఇస్తున్నామని, అయితే అయితే మెరుగైన ప్రదర్శన కోసం ప్రజలు వివిధ వీసాల ద్వారా పనిచేస్తున్నారని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విస్తరిస్తున్న వ్యాపార నమూనా, భవిష్యత్తులో మల్టిపుల్ విధానాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. హెచ్1-బీ వేతన ఆధారిత ఆప్షన్ పై టీసీఎస్ సీఎఫ్ఓ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. "ఈ మార్పులు మనుగడ సాగిస్తాయో లేదో కూడా మాకు తెలుసు. అయితే జరిగిన కొన్ని మార్పులను వారు విజయవంతంగా చట్టబద్దంగా సవాలు చేశారు" అని చెప్పారు. సొంతంగా ఇతరులపై ఆధారపడటం కూడా గణనీయంగా తగ్గిందని, కాబట్టి ఇవి అంతరాయాలను సృష్టించినప్పటికీ వ్యాపార నమూనాలో భాగమని ఈ మార్పులు ఏ విధంగా జరిగినా నిర్వహించగలుగుతామని ఆయన అన్నారు.

అక్టోబరు 2020లో అమల్లోకి వచ్చిన హెచ్1-హబీ వేతన పెంపును అమలు చేయకుండా యూఎస్ కార్మిక శాఖను(DOL) మూడు యూఎస్ కోర్టులు నిరోధించాయి. నిబంధనలు పరిపాలనా విధానాలను ఉల్లంఘించాయనే కారణంతోనే ఈ పనిచేశాయి. 2021 జనవరి 12న 60 రోజుల కామెంట్ పీరియడ్ లో వేతన పెంపు కోసం తుది నియమాన్ని ప్రచురించింది. ఇది ప్రస్తుతం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలనలో ఉంది.

వేతన స్థాయిలకు పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రపంచంలోని కొన్ని వినూత్న సంస్థలతో పాటు అనేక ఆసుపత్రులు, హెల్త్ కేర్ ప్రొవైడర్లు, పరిశోధన సౌకర్యాలు, విశ్వవిద్యాలయాలు, ఇతర పిటీషనర్లను గణనీయంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కాం ఓ ప్రకటనలో తెలిపింది. ఏదేమైనా ఈ వేతనాలు పెంపు ఐటీ సంస్థలకు ఖర్చులను పెంచుతుందనేది నిష్ఠూర సత్యం. హెచ్1-బీ వేతనాల పెంపుపై 2020 నవంబరులో హెచ్ సీఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్ వివరించారు. తన కంపెనీ సిబ్బందిలో మూడింట రెండు వంతుల మంది స్థానికులను మిగిలిన వారిని హెచ్1-బీ కార్మికులుగా నియమించినప్పుడు వేతనాలు హెచ్1-బీ వీసా హోల్డర్లు పెరుగుతాయని తెలిపారు. ఈ సమానత్వం ఆస్థానంలో ఉంటుందని అంచనా.

ఇది వేతన ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఏ పద్దతులను అవలంభించాలో మనం చూడాలి అని విజయ్ కుమార్ తెలిపారు. ఖర్చు ప్రభావం ఉంటుందని, దీని రెండు మార్గాలు లేవని తెలిపారు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: America, H1B Visa, Information Technology, Joe Biden, Tech

తదుపరి వార్తలు