హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Julian Assange : జైలులోనే పెళ్లి -వికీలీక్స్‌ జూలియన్ అసాంజే‌కు కోర్టు అనుమతి -వధువు Stella Morris ఎవరంటే

Julian Assange : జైలులోనే పెళ్లి -వికీలీక్స్‌ జూలియన్ అసాంజే‌కు కోర్టు అనుమతి -వధువు Stella Morris ఎవరంటే

జైలులోనే అసాంజే పెళ్లి

జైలులోనే అసాంజే పెళ్లి

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే పెళ్లికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన తానుంటోన్న లండన్ జైలులోనే స్టెల్లా మోరిస్‌ను పెళ్లి చేసుకోనున్నారు. లండన్‌లో ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో వీరు కలిసుండగా, ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలున్నారు..

ఇంకా చదవండి ...

అతని పేరు వింటే దేశాధినేతలు వణికిపోయేవాళ్లు.. దేశాధినేతల చీకటి వ్యవహారాలను, అప్రజాస్వామిక నిర్ణయాలను, చట్టవ్యతిరేక కలాపాలను బహిర్గతం చేసిన వికిలీక్స్ అంటేనే రాజకీయ నాయకులకు దడపుట్టేది.. ప్రభుత్వ వ్యవస్థల్లోనే రహస్యంగా పనిచేస్తోన్న తన మనుషులతో సర్కారు వారి గుట్లును బయపెట్టేవాడు.. ఇదంతా గతం.. ప్రస్తుతం అతను లండన్ జైలులో ఉన్నాడు.. పొరపాటున బయటికొస్తే అరెస్టు చేయడానికి మరో అరడజను దేశాలు సిద్దంగా ఉన్నాయి.. ఇంతటి కష్టకాలంలోనూ పెళ్లికి సిద్ధమయ్యాడతను.. జైలులోనే పెళ్లికి కోర్టు కూడా అనుమతిచ్చింది.. అవును, మనం మాట్లాడుతున్నది వికిలీక్స్ అధినేత జూలియన్ అసాంజే గురించే..

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే పెళ్లికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన తానుంటోన్న లండన్ జైలులోనే స్టెల్లా మోరిస్‌ను పెళ్లి చేసుకోడానికి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం అసాంజే బెల్మార్ష్‌ జైలులో ఉన్నారు. కోర్టు అనుమతి రావడంతో ఆ జైలులోనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు..

జూలియన్ అసాంజే పెళ్లడబోయే స్టెల్లా మోరిస్ అతని సహచరిణే. 2015లోనే అసాంజే-స్టెల్లా నిశ్చితార్థం చేసుకోగా.. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు కుమారులున్నారు. ఈక్వెడాల్‌లో ఆశ్రయం పొందిన సమయంలో ఇద్దరు కొడుకులు జన్మించారు. బ్రిటన్‌ ప్రిజన్‌ సర్వీస్‌ అసాంజే పెళ్లి చేసుకునేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు అంగీకారం తెలిపింది.

సాధారణ ఖైదీల మాదిరిగానే జైలర్‌ అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటాడని ప్రభుత్వం పేర్కొన్నది. యూకే చట్టం ప్రకారం.. ఖైదీలు 1983 వివాహ చట్టం ప్రకారం జైలులో వివాహం చేసుకునేందుకు అనుమతి ఉన్నది. అయితే, ఇందుకయ్యే ఖర్చురును పెళ్లి చేసుకున్న వ్యక్తులే చెల్లించాల్సి ఉంటుంది.

వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే, స్టెల్లా మోరిస్‌ను తొలిసారి 2011 సంవత్సరంలో కలిశారు. లండన్‌లో ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో స్టెల్లా అక్కడికి వచ్చి వెళ్తుండే వారు. అలా మొదలైన పరిచయం ప్రేమగా, డేటింగ్ గా మారి, ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆరేళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత ఆ జంట ఇప్పుడు వివాహం చేసుకోనున్నారు..

Published by:Madhu Kota
First published:

Tags: London, Marriage, United Kingdom

ఉత్తమ కథలు