woman rights : భర్త తిన్న ప్లేటును భార్యనే.. ఎందుకు కడగాలి...? విసిరికొట్టిన భార్య.. కారణం ఇదేనంటుూ ఫైర్

woman rights : భర్త తిన్న ప్లేటును భార్యనే.. ఎందుకు కడగాలి...?

woman rights : తన భర్త తిన్న ప్లేటును తానే ఎందుకు కడగాలి అంటూ ఓ భార్య ప్రపంచ వ్యాప్త చర్చకు తెరలేపింది. భర్త తిన్న ప్లేటును తాను కడగనంటూ విసిరి పారేసింది. దీంతో మగవారు తిన్న ప్లేటును సైతం మహిళలు ఎందుకు కడగాలి అంటూ ప్రశ్నిస్తోంది.

 • Share this:
  అనాదిగా మహిళలపై (woman rights ) జరుగుతున్న వివక్షను మహిళలు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ వారికి కావాల్సిన హక్కులను సాధించుకుంటున్నారు. ఎన్నో వందల సంవత్సరాల పాటు మగవారి ఆధిపత్యం క్రింద నలిగిపోయిన వారు అనేక పోరాటాలు , ఆందోళనలు చేసి తమ హక్కులను సాధించుకుంటున్నారు. దీంతో వంటింటి నుండి అంతరిక్షం వరకు ప్రతి పనిలో నేనున్నాంటూ మహిళలు పోటిపడుతున్నారు. దీంతో అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. దీంతో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు,విధులతో అనేక దేశాలు వారిని ఆగ్రభాగంలో నిలబెడుతున్నాయి.

  అయితే మహిళలు ( woman )ఇంత సాధించినా.. కొన్ని రంగాలతోపాటు మరికొన్ని కుటుంబ సాంప్రదాయాల్లో మాత్రం మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది.. కొన్ని ఇంటిపనులు (house wife) మహిళలు మాత్రమే చేయాలనే కట్టుబాట్లు ఆయా దేశాల్లో కొనసాగుతున్నాయి. ఇండియా ( india )లాంటీ దేశాల్లో అయితే చాలా మంది మహిళలు భర్తుల చెప్పిందే వేదంగా భావించి పని చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ఇలా వారికి వ్యక్తిగత సేవలు చేయడం నుండి అనేక పనుల్లో వారే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పనులు మొత్తం సాధారణంగా మహిళలే చేస్తుంటారు. అయితే తాజాగా ఇలాంటి కుటుంబ బాధ్యతలపై చర్చ జరుగుతోంది. మగవాళ్లు తిన్న ప్లేటును మహిళలే ఎందుకు కడగాలి అనే కోణంలో పెద్ద చర్చకు తెరలేసింది.

  ఇది చదవండి : మావోయిస్టు అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మృతి


  ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో (online )చర్చకు దారి తీసిన ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. ఒక భర్త ( meals ) భోజనం చేసిన తర్వాత తాను తిన్న ప్లేటు, గ్లాసును భార్య కడిగేందుకు టేబుల్‌పైనే వదిలేశాడు. దీంతో చిరాకెత్తిన అతడి భార్య వాటిని ఇంటి బయటకు విసిరేసింది. దీంతో సిరామిక్‌ ప్లేటు, గాజు గ్లాసు పగిలిపోయాయి.

  అయితే ఎందుకు చేశాననే దానిపై ఆ మహిళ తన చర్యను సమర్ధించుకున్నది. తిన్న ప్లేటును మగవారు ఎందుకు కడుగరు? అని ఆమె ప్రశ్నించింది. వాడిన పాత్రలను వారు శుభ్రం చేయడంలో తప్పు ఏముంది అంటూ ప్రశ్నిస్తోంది..? ఈ నేపథ్యంలోనే భర్త తిన్న ప్లేటు, గ్లాసును ఇంటి బయటకు విసిరేసిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసింది. 'భార్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి' అని అందులో పేర్కొంది.

  ఇది చదవండి : సీఎం జగన్ సతీమణి భారతిపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు..


  కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చర్చకు దారితీసింది. తిన్న ప్లేటును భర్త కడుగకపోయినా, కనీసం సింక్‌లోనైనా వేయాలని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఆ మహిళ చర్యను తప్పుపట్టారు. ఒక్క ప్లేటే కావడంతో దానిని ఆమె కడిగి ఉండాల్సిందన్నారు. చాలా మంది పలురకాలుగా స్పందించారు. మొత్తం మీద మహిళకే ప్రత్యేక బాధ్యతలు అంటూ లేవనెత్తిన చర్చ పెద్ద దుమారాన్నే రేపంది. అయితే ఇలాంటీ అంశాలపై గతంలో అనేక చర్చలు జరిగినా.. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు మగవాళ్ల మధ్య బాధ్యతలు , హక్కులు మారే అంశాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published: