ఇండొనేసియాలో మళ్లీ భారీ భూకంపం వచ్చింది. ఐతే.. సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చెయ్యలేదు. శుక్రవారం రాత్రి సముద్రం లోపల ఈ భూకంపం వచ్చింది. ఆ దేశ వాయవ్య ప్రాంతంలోని బెంకులూకి 202 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 25 కిలోమీటర్ల లోతున భూమి కంపించినట్లు అమెరికా జియొలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.9గా నమోదైంది. సహజంగా తీవ్రత 7గా నమోదైన భూకంపాలను భారీ భూకంపాలుగా చెబుతారు. వీటివల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది.
ఈ భూకంపం సముద్రం లోపల రావడం వల్ల ఎవరూ చనిపోలేదని తెలిసింది. అలాగే భవనాలకు కూడా పెద్దగా నష్టం జరగకపోవడం మంచి పరిణామం. ఒకసారి భూకంపం వచ్చాక.. మరోసారి 5.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు.
అక్కడే ఎందుకు:
ఒకప్పుడు జపాన్, ఇండొనేసియాలో తరచూ భూకంపాలు వచ్చేవి. జపాన్‌లో అవి తగ్గినా.. ఇండొనేసియాలో మాత్రం తరచూ వస్తూనే ఉన్నాయి. ఆ దేశ జనాభా 27 కోట్ల మందికి పైగా ఉన్నారు. భూకంపం వచ్చినప్పుడల్లా వారు ఉలిక్కి పడుతున్నారు. అక్కడే భూకంపాలు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ భూమిపై రింగ్ ఆఫ్ ఫైర్ (ring of fire) అనేది ఒకటి ఉంది. ఆ రింగ్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అదే రింగ్ లో ఇండొనేసియా కూడా ఉంది.
Major magnitude 6.6 #earthquake - Indian Ocean, 201 km southwest of Benkulu, Bengkulu, Indonesia, on Friday, Nov 18, 2022 at 8:37 pm (GMT +7) - share your experience - informationhttps://t.co/ZPzEz02uJY
— VolcanoDiscovery (@volcanodiscover) November 18, 2022
రెండో కారణంగా అగ్నిపర్వతాన్ని చెబుతారు. ఇండొనేసియా మొత్తం ఓ భారీ అగ్నిపర్వతంపై ఉంది. భూమిలోపల ఉన్న ఆ అగ్ని పర్వతం యాక్టివ్‌గా ఉంది. దాని నుంచి వచ్చే అతి తీవ్ర ఒత్తిడి వల్ల అక్కడి భూ పలకాలు కదులుతున్నాయి. ఫలితంగానే భూకంపాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అక్టోబర్‌లో ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒకరు చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. డజనుకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరిలో కూడా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో భూకంపం రాగా.. 25 మంది చనిపోయారు, 460 మందికి పైగా గాయపడ్డారు.
Horoscope Today : నవంబర్ 19 రాశిఫలాలు .. ఈ రాశుల వారికి శుభ ఘడియలు
ఇక 2004లో వచ్చినది అతి పెద్ద భూకంపం. దాని వల్ల భారీ సునామీ వచ్చి ఇండొనేసియాతోపాటూ.. భారత్, జపాన్ సహా డజను దేశాలకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 2,30,000 మందికి పైగా చనిపోయారు. ఇలా ఇండొనేసియా ఏళ్లుగా భూకంపాల ప్రభావిత దేశంగానే ఉంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earth quake, Earthquake, Indonesia