Home /News /international /

WHY NASA SCIENTISTS EAT PEANUT DURING MISSION SCIENTISTS PEANUT HISTORY HERE IS INTERESTING STORY SK

NASA: నాసాలోనూ మూఢనమ్మకాలా? మిషన్‌కు ముందు సైంటిస్టులు పల్లీలు ఎందుకు తింటారో తెలుసా?

వేరుశెనగ కాయలతో నాసా శాస్త్రవేత్తలు

వేరుశెనగ కాయలతో నాసా శాస్త్రవేత్తలు

NASA: నాసా ఏదైనా మిషన్‌ను ప్రారంభించినా, అంతరిక్ష రంగానికి సంబంధించిన నిర్దిష్ట చర్యలు తీసుకున్నా.. అంతకంటే ముందు శాస్త్రవేత్తలు తప్పనిసరిగా వేరుశెనగ తింటారు. వారు దానిని ఒక ఆచారంగా భావిస్తారు.

    ఒకప్పుడు యావత్ ప్రపంచమంతా మూఢనమ్మకాలను (Superstitious Beliefs)   విశ్వసించేది. సైన్స్ గురించి తెలియని రోజుల్లో అంధ విశ్వాసాలే రాజ్యమేలాయి. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ.. అలాంటివన్నీ మరుగున పడుతూ వచ్చాయి. శాస్త్రవేత్తలు ఎన్నో అపరిష్కృత రహస్యాన్ని చేధించారు. కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపించారు. మీరు నమ్మేది నిజం కాదని.. దానివెనక ఉన్న అసలు రహస్యం ఇది అంటూ అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు ఎప్పుడూ తార్కిక, శాస్త్రీయమైన పనులనే చేస్తారు. కానీ శాస్త్రవేత్తలు కూడా సెంటిమెంట్‌లను ఫాలో అవ్వడం మీరెప్పుడైనా చూశారా? మనదేశంలో ఏదైనా రాకెట్ ప్రయోగం చేపట్టే ముందు ఇస్రో శాస్త్రవేత్తలు (Isro Scientists)  శ్రీహరికోటలోని స్థానిక అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తారు. ఇక్కడ మాత్రమే కాదు.. అమెరికా (Amercia)లో కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను శాస్త్రవేత్తలు ఫాలో అవుతారు. నాసా శాస్త్రవేత్తలు కూడా వేరుశెనగలను తినే వింత ఆచారాన్ని పాటిస్తారు.

    గొంగళి పురుగులతో రుచికరమైన చాక్లెట్స్, బిస్కెట్స్.. మీరు కూడా ఇష్టంగా తింటారు

    టుడే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం... నాసా (Nasa) ఏదైనా మిషన్‌ను ప్రారంభించినా, అంతరిక్ష రంగానికి సంబంధించిన నిర్దిష్ట చర్యలు తీసుకున్నా.. అంతకంటే ముందు శాస్త్రవేత్తలు తప్పనిసరిగా వేరుశెనగ తింటారు. వారు దానిని ఒక ఆచారంగా భావిస్తారు. ఐతే దీని వెనక సైన్స్ ఏమీ లేదు. కేవలం మూఢనమ్మకం మాత్రమే..! నాసా శాస్త్రవేత్తల ప్రకారం... ఏదైనా క్లిష్టమైన మిషన్‌ను ప్రారంభించే సమయంలో వేరుశెనగలను తింటే.. ఆ మిషన్ విజయవంతమవుతుంది. అందుకే రాకెట్ ప్రయోగం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా.. సైంటిస్టులు పల్లీలు తింటారు.

    OMG : షాకింగ్..దోమ కుట్టడం వల్ల ట్రైనీ పైలట్ మృతి





    ఓ నివేదిక ప్రకారం.. నాసా మిషన్‌కు ముందు వేరుశెనగలు తినే ఆచారం 1960లలో మొదలైంది. ఆ సమయంలో రేంజర్-7 అనే విమానం ప్రయోగం ఆరుసార్లు విఫలమైంది. రేంజర్-7 ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లోకి ఎగరలేకపోయింది. దీంతో టీమ్ అంతా నిరాశ చెందారు. ఏడోసారి విమానాన్ని విమానానికి సిద్ధం చేసినప్పుడు.. అందరూ చాలా ఆందోళన చెందారు. అప్పుడెవరో అందరికి తినడానికి వేరుశెనగలు ఇచ్చి... వీటిని తింటే టెన్షన్ తగ్గుతుందని చెప్పారు. ఆ తర్వాత రేంజర్ ఎయిర్ క్రాఫ్ట్ విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. అప్పటి నుంచీ NASA శాస్త్రవేత్తలు వేరుశెనగను కూడా తమ మిషన్‌లో ముఖ్యమైన సభ్యునిగా పరిగణించారు. అలా ఏదైనా కష్టతరమైన మిషన్ చేపట్టినప్పుడు.. నాసా శాస్త్రవేత్తలు వేరుశెనగ తినడం ప్రారంభించారు. పల్లీలు తింటే అంతా సవ్యంగా జరుగుతుందని విశ్వసిస్తారు.



    NASA సోలార్ సిస్టమ్ ఎక్స్‌ప్లోరేషన్ వెబ్‌సైట్ ప్రకారం.. ఆ రోజు నాసా టీమ్ సభ్యులకు వేరుశెనగలు పంచిన వ్యక్తి పేరు డిక్ వాలెస్. వేరుశెనగలు తింటే కొంత సమయానికి అక్కడున్న వారందరి ఆందోళన తగ్గుతుందని భావించాను. అలా చేశాను. అనుకున్నట్లుగానే అందరిలోనూ టెన్షన్ పోయింది. మిషన్ సక్సెస్ అయిందని డిక్ వాలెస్ వెబ్‌సైట్‌తో నాటి అనుభవాలను పంచుకున్నారు. అప్పటి నుంచి పల్లీలను లక్కీగా భావిస్తున్నారు. నాసా మిషన్ ఉన్నప్పుడల్లా.. వేరుశెనగ బాక్స్‌లు మిషన్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుంటాయని ఆయన వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amercia, International news, NASA, Us news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు