ఐరాసలో షాక్... సడెన్ ఎంట్రీ ఇచ్చిన ట్రంప్... ఇదీ కారణం

NewYork : సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ ప్రోగ్రాంలో పాల్గొనాలన్నా 2 నెలలకు ముందే షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. మరి ఐరాస వాతావరణ సదస్సులో ట్రంప్ చెప్పాపెట్టకుండా ఎందుకు వచ్చారు? అసలేం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 11:57 AM IST
ఐరాసలో షాక్... సడెన్ ఎంట్రీ ఇచ్చిన ట్రంప్... ఇదీ కారణం
డొనాల్డ్ ట్రంప్ (Credit - Twitter - CNN Politics)
  • Share this:
UN Climate Summit : హోస్టన్‌లో హౌడీ మోదీ సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లారు. ప్రధాని మోదీ కూడా... న్యూయార్క్ వెళ్లి... అక్కడి ఐక్యరాజ్యసమితి (ఐరాస) వాతావరణ సదస్సులో పాల్గొన్నారు. అదే ఐక్యరాజ్యసమితిలో... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ కోసం ట్రంప్... ఐరాసకు వెళ్లారు. వాళ్ల మధ్య భేటీ జరగడం, ఉగ్రవాదం, కాశ్మీర్ వంటి అంశాలపై చర్చించుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు. ఈ భేటీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరిగిందే. ఐతే... ఇదే ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న వాతావరణ సదస్సుకి ట్రంప్ వెళ్లడమే అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే... ఆయన అలా వెళ్తారని ముందుగా షెడ్యూల్ ఫిక్స్ చేసి లేదు. అసలు ఆ సమావేశానికి వెళ్లే హక్కు కూడా ట్రంప్‌కి లేదు. అలాంటిది ట్రంప్ మాత్రం సడెన్ ఎంట్రీ ఇచ్చారు.

వాతావరణ సమస్యలపై జరిగిన శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు ట్రంప్. మాటలు కట్టిపెట్టి... చేతల్లో చేసి చూపాలనీ, భారత్ కూడా ప్లాస్టిక్‌ను నిషేధించి... చేతల్లో చేసి చూపిస్తుందని ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు పిలుపిచ్చారు. ఇవన్నీ విన్న ట్రంప్... ఆ తర్వాత జర్మనీ ఛాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ ప్రసంగాన్ని కూడా ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత సైలెంట్‌గా వెళ్లిపోయారు.

నిజానికి వాతావరణ సమస్యలకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య ప్యారిస్ ఒప్పందం ఒకటుంది. అందులో నిబంధనల్ని అన్ని దేశాలూ పాటించాల్సిందే. అవి అర్థం పర్థం లేకుండా ఉన్నాయంటూ... 2017లో ఇదే ట్రంప్... ప్యారిస్ ఒప్పందం నుంచీ అమెరికా వైదొలగుతోందని ప్రకటించారు. అప్పట్లో అమెరికా నిర్ణయాన్ని భారత్ తప్పుపట్టింది. అత్యంత ఎక్కువ కాలుష్యానికి కారణమవుతున్న అమెరికాయే ఇలా చేస్తే ఎలా అని ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అలాంటి ట్రంప్... వాతావరణ సదస్సుకి హాజరయ్యే అర్హత కోల్పోయినట్లే. కానీ... ఆయన... సడెన్ ఎంట్రీ ఇచ్చి... ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇందుకు కారణం మోదీయేనని తెలుస్తోంది. హౌడీ మోదీ సభలో ఆసక్తికరంగా మాట్లాడిన మోదీ... వాతావరణ సదస్సులో ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితోనే ట్రంప్... ఆ సదస్సుకి వెళ్లినట్లు తెలుస్తోంది.

మళ్లీ కాశ్మీర్ అంశంపై చర్చ : కాశ్మీర్ విషయంలో ఏ దేశ మధ్యవర్తిత్వమూ అవసరం లేదని ఇండియా చాలాసార్లు చెప్పింది. ఆగస్టులో జరిగిన జీ7 సదస్సులో కూడా ఇదే విషయాన్ని మోదీ... ట్రంప్‌కి స్పష్టం చేశారు. కానీ... ట్రంప్ మాత్రం అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తానని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీలో అన్నారు. రెండు దేశాలూ ఒప్పుకుంటేనే మధ్యవర్తిత్వం చేస్తానన్నారు. తనకు బాగా మధ్యవర్తిత్వం చెయ్యడం వచ్చని తనను తానే మెచ్చుకున్నారు.

 

ఇవి కూడా చదవండి :

ఒబామాకి కాదు నాకు ఇవ్వాలి... నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కామెంట్Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండి

Peanut Butter Fruit : ఈ ఫ్రూట్ విశేషాలు తెలుసా మీకు?
First published: September 24, 2019, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading