హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

సైబీరియాలో చైనా పైచేయి సాధించాలని చూస్తోందా? రష్యాతో చైనా యుద్ధం తప్పదా..?

సైబీరియాలో చైనా పైచేయి సాధించాలని చూస్తోందా? రష్యాతో చైనా యుద్ధం తప్పదా..?

సైబీరియా ల్యాండ్స్ విషయంలో భవిష్యత్‌లో చైనా, రష్యాకు యుద్ధం తప్పదా..?

సైబీరియా ల్యాండ్స్ విషయంలో భవిష్యత్‌లో చైనా, రష్యాకు యుద్ధం తప్పదా..?

రష్యా, చైనా యుద్ధమేంటీ..? అసలు ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాకు (Russia) అన్ని రకాలుగా అండగా ఉన్న చైనా (China).. ఇలాంటి పని ఎందుకు చేస్తుంది..? ఇలాంటి ఎన్నో సందేహాలు మీ మెదడును తొలిచేస్తున్నాయా..? అయితే ఇది చదవండి అన్నింటికీ సమాధానం దొరుకుతుంది.

ఇంకా చదవండి ...

రష్యా, చైనా యుద్ధమేంటీ..? అసలు ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాకు అన్ని రకాలుగా అండగా ఉన్న చైనా.. ఇలాంటి పని ఎందుకు చేస్తుంది..? ఇలాంటి ఎన్నో సందేహాలు మీ మెదడును తొలిచేస్తున్నాయా..? అయితే ఇది చదవండి అన్నింటికీ సమాధానం దొరుకుతుంది.

రష్యాకు దక్షిణ, ఆగ్నేయంగా ఉన్న ప్రాంతాన్ని సైబీరియా అని పిలుస్తాం. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పటి నుంచి నిరుపయోగంగా ఉన్న మిలియన్ ఎకరాల సైబీరియా బీడు వ్యవసాయ భూములపై చైనా కన్ను పడింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంధనం, రోడ్డు/రైలు నిర్మాణం, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన ప్రభావాన్ని విస్తరించాలని చైనా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోడ్లు, రైలు నెట్‌వర్క్‌లను కూడా చైనా నిర్మిస్తుండటంతో.. ఏం చేయాలో రష్యాకు మింగుడు పడటం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: మెటావర్స్‌లో స్టాండప్ కామెడీ.. తెలంగాణకే ఆ అరుదైన ఘనత.. ఇక కథ వేరుంటదీ..!


సైబీరియాను చైనా ఆక్రమిస్తోందా?

సైబీరియా, రష్యన్ ఫార్ ఈస్ట్‌లో ప్రవేశించడానికి చైనా అర్హత పొందిందని రష్యన్ కాలమిస్ట్ మార్గరీటా నికిఫోంటావా పేర్కొన్నారు. సైబీరియా, ఫార్ ఈస్ట్‌లో పెద్ద ఎత్తున భూమిని చైనాకు లీజుకు ఇచ్చేందుకు రష్యా అంగీకరించింది. అయితే, ఈ భూమిని ఎప్పటికి తిరిగి ఇవ్వాలనే అంశంపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు.

వాస్తవానికి చైనీయులు భూములను విడిచిపెట్టడానికి నిరాకరిస్తే.. మాస్కో వెనక్కి తగ్గడం లేదా ప్రాంతీయ యుద్ధంలోని దిగడం తప్పదని డెజాన్ షిరా, అసోసియేట్స్ వ్యవస్థాపకుడు క్రిస్ డెవాన్ షైర్ ఎల్లిస్ చెబుతున్నారు. అయితే, ఈ పరిస్థితి రావడానికి మరో యాభై ఏళ్లు పట్టొచ్చని, కానీ సమయం త్వరగా గడిచిపోతుందని ఎప్పుడైనా ఈ పరిస్థితి తథ్యం అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యన్ ఫార్ ఈస్ట్‌లో చైనీస్ మేనేజ్‌మెంట్ కింద ఉన్న భూభాగాలను చూపించడానికి మ్యాప్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో చైనా వలస కార్మికుల ప్రవాహంపై సైబీరియన్ ప్రాంతీయవాది యారోస్లావ్ జోలోటరియోవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సైబీరియన్ సంస్థలలో పెట్టుబడులపై ఎక్కువ ఆసక్తి చూపుతోందన్న మాస్కో వాదనను చైనా తోసిపుచ్చింది.

సైబీరియాపై చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది?

సైబీరియా సహజ వనరులను పొందడానికి సురక్షితమైన మార్గం, చైనా ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ ప్రాంతం అత్యంత అనుకూలం. సైబీరియా సహజ వనరుల కోసమే ఆ ప్రాంతంపై చైనా ఆసక్తి చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యాతో పొత్తు ద్వారా లేదా బలవంతంగా దానిలోని భాగాలను లాక్కోవడం ద్వారా చైనా తన లక్ష్యాలను చేరుకోగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనా-రష్యన్ సంబంధాలు మనం చూస్తే.. చైనాకు మిత్రదేశం కంటే విరోధి దేశంగానే రష్యా చాలా వరకు ఉంది. 1858-1860లో ఐగున్, బీజింగ్ ఒప్పందాల ప్రకారం చైనా నుంచి "ఔటర్ మంచూరియా"లో దాదాపు ఒక మిలియన్ చదరపు మైళ్లను రష్యా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ భూభాగానికి రష్యన్ ఫార్ ఈస్ట్ అని పేరు.. అక్కడ వ్లాడివోస్టాక్, ఖబరోవ్స్క్‌లను రష్యన్ వలసవాదులు స్థాపించారు. ప్రస్తుతానికి చైనా భూభాగాలను అధికారికంగా క్లెయిమ్ చేయడం లేదన్నది నిజమే కానీ ఈ విలీనాన్ని చైనా మరిచిపోలేదని నిపుణులు చెబుతున్నారు. సైబీరియా చైనాకు చెందినదని కొంతమంది చైనా ప్రచారకులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జరిగిన వ్లాడివోస్టాక్‌ను స్థాపించిన రష్యా 160వ వార్షికోత్సవ వేడుకలను ఓ చైనా ప్రభుత్వ మీడియా అధికారి విమర్శించారు.

రష్యా ఓటమికి చైనా కారణమవుతుందా?

రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అతిపెద్ద మిత్రదేశం చైనా స్వరం గణనీయంగా మారింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీ తీర్మానాలు రెండింటిలోనూ చైనా గైర్హాజరు కావడం.. రష్యాకు అనుకూలంగా చైనా ఓటు వేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రష్యా ఎగుమతి లావాదేవీలను ప్రాసెస్ చేయడంలో సహాయం చేయడానికి బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా నిరాకరించింది. సుదీర్ఘ యుద్ధం తర్వాత ఓటమి రష్యాను గణనీయంగా బలహీనపరుస్తుందని.. ఇదే జరిగితే చైనా-రష్యన్ కూటమిలో రష్యా ప్రాధాన్యం తగ్గనుందని విశ్లేషకులు చెబుతున్నారు.


ఇప్పటికే రష్యా ఆర్థిక వ్యవస్థపై యుద్ధం గణనీయమైన ప్రభావం చూపుతోంది. దీనికి తోడు పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆ దేశ పరిస్థితి మరింత దిగజారింది. పశ్చిమ దేశాలకు దూరమై, ఒంటరిగా ఉన్న బలహీన రష్యాకు చైనాతో పొత్తు పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని.. ఇది సైబీరియా సహజ వనరులను పొందడానికి చైనాకు నిబద్ధతతో, విధేయతతో కూడిన వ్యూహం అని విశ్లేషకులు చెబుతున్నారు.

First published:

Tags: China, Russia

ఉత్తమ కథలు