చైనాలో ఆ పంది రేటు లక్ష రూపాయలు... ఎందుకో తెలుసా...

China Pig Business : మన దేశంలో పందుల పెంపకాన్ని మనం లైట్ తీసుకుంటాం. చాలా సినిమాల్లో పందుల పెంపకం అన్నది ఓ కామెడీ సీన్. అలాంటి అంశాన్ని చైనా ఎందుకు సీరియస్‌గా తీసుకుంటోందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: October 7, 2019, 10:10 AM IST
చైనాలో ఆ పంది రేటు లక్ష రూపాయలు... ఎందుకో తెలుసా...
చైనాలో ఆ పంది రేటు లక్ష రూపాయలు... (credit - twitter - China Daily)
  • Share this:
China Pig Business : జనరల్‌గా పంది ఎంత సైజ్ ఉంటుంది. కుక్క కంటే కాస్త పెద్దగా... లావుగా ఉంటుంది. అదే చైనాలోని పందుల ఫారాల్లోకి వెళ్లి చూస్తే... అది పందా లేక ధ్రువపు ఎలుగుబంటా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే చైనా అంత పెద్ద సైజు పందుల్ని పెంచుతోంది. ఒక్కో పంది బరువూ 500 కేజీలు ఉంటుందంటే నమ్మగలరా. ఒక్కో పంది రేటూ రూ.లక్ష దాకా ఉంటోంది. పందుల పెంపకం ద్వారా చైనాలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు తెలుసా. అక్కడ అదో పెద్ద బిజినెస్ అయిపోయింది. చిత్రమేంటంటే... చైనాలో పెరుగుతున్న పందులు... చైనా ప్రజలకే సరిపోవట్లేదు. ఇటీవల అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో మాంసంతోపాటూ... పోర్క్ (పంది మాంసం) కూడా బాగా తింటున్నారు. దాంతో పందులకు కొరత వచ్చేసింది. ఇది గమనించిన అక్కడి ప్రభుత్వం... "బిగ్గర్ ఈజ్ బెటర్" (bigger is better) అనే నినాదాన్ని తీసుకొచ్చి... దేశవ్యాప్తంగా పందుల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా... బాగా కొవ్వు పట్టి... బలిసిన పందులు మార్కెట్లకు వస్తున్నాయి.

china,pig,la caja china,pig roast,caja china,china news,riding a pig,peppa pig,pig in china,pig riding,pigs,papa pig,pepa pig,pig peppa pig,riding a pig funny,how to pig,chinese lady riding pig,chinese woman riding pig,us china tariff,human faced pig,how to roast pig,china food,life of pig,mutant pig,roated pig,roast a pig,hilarious pig videos,hilarious pig riding,grilled pig,farmer riding pig,చైనా పందులు,చైనా పందుల పెంపకం,చైనా పిగ్,చైనా పంది మాంసం,పోర్క్,
చైనాలో ఆ పంది రేటు లక్ష రూపాయలు... (credit - twitter - China Daily)


ప్రస్తుతం చైనాలో పంది సగటు బరువు 175 నుంచీ 200 కేజీలు. ఇది వరకు ఈ సగటు 125 కేజీలుగా ఉండేది. ఇంకా ఇంకా పెద్ద పందుల్ని పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. చైనాలో పందుల పెంపకంలో గుర్తింపు పొందిన కంపెనీలన్నీ... పందుల సైజును 14 శాతం పెంచాలని డిసైడయ్యాయి. ఇదేమంత తేలిక కాదు. ఎందుకంటే... ఆ కంపెనీల్లో పందుల సైజు ఆల్రెడీ చాలా పెద్దగానే ఉంది.

చైనాలో పందుల్ని వధించే దుకాణాల్లో పంది సగటు బరువు ప్రస్తుతం 140 కేజీలుగా ఉంది. ఇదివరకు అది 110 కేజీలే. ఫలితంగా ప్రస్తుతం వ్యాపారుల లాభాలు 30 శాతం పెరిగాయి.

మనం కొండెక్కిన కోడి... ఆకాశాన్ని అంటుతున్న చికెన్ ధరలు అంటుంటాం కదా ప్రస్తుతం చైనాలో పంది మాంసం రేటు అలాగే ఉంది. హోల్ సేల్ ధరలు 70 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం కోటి టన్నుల పంది మాంసం కొరత ఉంది అక్కడ. ధరలు తగ్గాలంటే... ఉత్పత్తి పెరగాలి. అందుకే చైనా ప్రభుత్వం పందుల పెంపకం దార్లపై విపరీతంగా ఒత్తిడి తెస్తోంది. పందుల్ని భారీగా, పెద్ద సైజువి అయ్యేలా పెంచమంటోంది. అందుకే ఇప్పుడు అక్కడ పందిని చూస్తే... పోలార్ బేర్‌ని చూసినట్లే అనిపిస్తోంది చాలా మందికి.

 

ఇవి కూడా చదవండి :కేరళ క్రైమ్... కోడలి హత్యల కేసులో మరిన్ని కోణాలు... షాకవుతున్న పోలీసులు

Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే

పాలు కల్తీ చేసినందుకు 6 నెలల జైలు... 24 ఏళ్ల నాటి నేరానికి ఇప్పుడు శిక్ష

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
Published by: Krishna Kumar N
First published: October 7, 2019, 10:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading