WHY AMERICA TOOK BAN DECISION OF DOG INTO COUNTRY WHAT IS THE MAIN REASON BEHIND IT WHICH COUNTRIES DOGS COME TO US MAINLY NK GH
అమెరికా ప్రభుత్వ నిర్ణయం... విదేశీ కుక్కలకు నో ఎంట్రీ... ఎందుకలా?
అమెరికా ప్రభుత్వ నిర్ణయం... విదేశీ కుక్కలకు నో ఎంట్రీ... ఎందుకలా? (ప్రతీకాత్మక చిత్రం)
US bans dogs: అమెరికా ప్రభుత్వం కరోనాపై సంచలన నిర్ణయాలు చాలా తీసుకుంటోంది. అలాంటిది సడెన్గా కుక్కల ఎంట్రీపై నిషేధం విధించింది. అందరూ షాకవుతున్నారు. ఎందుకీ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం.
ఓవైపు కరోనా వైరస్మానవాళిని కుదిపేస్తుండగా... మరోవైపు కుక్కలకు వచ్చే రేబిస్ వ్యాధి ప్రమాదం కూడా పెరుగుతోంది. దాదాపు 100 దేశాల్లో రేబిస్ వ్యాధి సమస్య ఎక్కువగా ఉంది. అయితే, ఈ కుక్కల దిగుమతిపై అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి తీసుకొచ్చే కుక్కలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంపుడు కుక్కలు లేదా అమ్మకం, దత్తత ద్వారా దేశంలోకి తీసుకువచ్చే కుక్కలపై ఈ నిషేధం వర్తిస్తుందని ఆరోగ్య శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే, ఇప్పటికే దేశంలోకి తీసుకొచ్చిన కుక్కలకు రేబిస్వాక్సినేషన్ జరిగినట్లు తగిన రుజువులు చూపాల్సి ఉంటుందని తెలిపింది. పూర్తిగా వాక్సినేషన్చేయడానికి తగినంత వయసు లేనప్పటికీ, తప్పుడు ధ్రువపత్రాలు చూపించి వాటిని దేశంలోకి తీసుకొస్తున్నారని, అందుకే విదేశాల నుంచి తీసుకు వస్తున్న ఈ కుక్కలపై నిషేధం విధించినట్లు తెలిపింది.
జులై 14 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని సెంట్రల్ఫర్ డిసీజ్ కంట్రోల్అండ్ప్రివెన్షన్(CDC) ఈ ప్రకటన జారీ చేసింది. కాగా, అమెరికాకు ఏటా సుమారు 10 లక్షల కుక్కలు దిగుమతి అవుతుంటాయని సీడీసీ అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 4 శాతం నుంచి 7.5 శాతం కుక్కలపై ఈ నిషేధం ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, కొన్ని పరిస్థితుల్లో ఈ ఆంక్షలను సడలిస్తామన్నారు. అంధులకు దారి చూపే గైడ్ కుక్కలకు, అమెరికాకు తమ కుక్కలతో పాటు మారుతున్న విదేశీలకు ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇటీవల తిరస్కరణ అయిన కుక్కల్లో ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్, కొలంబియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయంపై అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డగ్లస్ క్రాట్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఆరోగ్యకరమైన కుక్కలను మాత్రమే దేశంలోకి ప్రవేశించేలా చూడాలి. తద్వారా, దేశ ప్రజల భద్రత, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది దోహదం చేస్తుంది” అని అన్నారు.
ఇదే విషయంపై సెంటర్స్ఫర్ డిసీజ్కంట్రోల్ అండ్ప్రివెన్షన్డాక్టర్ఎమిలీ పియరాసి మాట్లాడుతూ ‘‘మేము యునైటెడ్స్టేట్స్లోకి దిగుమతి చేసుకుంటున్న కుక్కల ఆరోగ్యంతో పాటు భద్రతను కాపాడటానికి, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే రేబిస్ సోకే ప్రమాదం ఉన్న కుక్కలపై ఏడాది పాటు నిషేధం విధిస్తున్నాం. ఈ మధ్య కాలంలో మోసపూరిత రేబిస్ సర్టిఫికెట్లతో దేశంలోకి తీసుకొస్తున్న కుక్కల సంఖ్య బాగా పెరిగింది. 2020లో 450కు పైగా కుక్కలను తప్పుడు సర్టిఫికెట్లతో దిగుమతి చేసుకున్నారని గుర్తించాం. ఇది గత రెండేళ్లతో పోలిస్తే 52 శాతం పెరిగింది” అని చెప్పారు.
కుక్క వయసు 4 నెలల కన్నా ఎక్కువ ఉన్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారని, అలాంటి కుక్కలను అమెరికాలో ప్రవేశించడానికి అనుమతించడం లేదని డాక్టర్ ఎమిలీ పియరాసి తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభణతో అనేక దేశాలు కుక్కలకు రేబిస్ టీకా కార్యక్రమాలను నిలిపి వేశాయి. దీంతో, ఆయా దేశాలకు చెందిన కుక్కలను తమ దేశంలోకి తీసుకురాకుండా అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.