హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan : WHO హెచ్చరిక..పాక్ నెత్తిన మరో పిడుగు

Pakistan : WHO హెచ్చరిక..పాక్ నెత్తిన మరో పిడుగు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WHO Warning To Pakistan : దాయాది దేశం పాకిస్తాన్‌(Pakistan)లో ఎన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు బీభత్సం(Pakistan Floods) సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఇటీవల వచ్చిన వరదలపై ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

WHO Warning To Pakistan : దాయాది దేశం పాకిస్తాన్‌(Pakistan)లో ఎన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు బీభత్సం(Pakistan Floods) సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఇటీవల వచ్చిన వరదలపై ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. అయితే పాక్ లో విధ్వంసకర రీతిలో వరదల నేపథ్యంలో పాకిస్తాన్‌లో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఆందోళన వ్యక్తం చేసింది. WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ... పాకిస్తాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, దీనివల్ల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభించడం లేదని,ఇది కలరా మరియు ఇతర వ్యాధులకు దారితీస్తుందని అన్నారు. పాకిస్తాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలు,ముఖ్యంగా అత్యంత దారుణంగా ప్రభావితమైన సింధ్ ప్రావిన్స్ ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని WHO సూచించింది. నిలిచిన నీరు దోమల వృద్ధికి కారణమవుతుందని, ఇది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తుందని టెడ్రోస్ శనివారం ప్రకటనలో తెలిపారు.

పాకిస్థాన్‌లో వరదల కారణంగా ఆ దేశ ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ కోఆర్డినేటర్ జూలియన్ హర్నిస్ గత బుధవారం మాట్లాడుతూ..పాకిస్తాన్ దేశం అందుకున్న 150 మిలియన్ డాలర్లలో విదేశీ సహాయంగా 38.35 మిలియన్ డాలర్లు మాత్రమే సహాయంగా మార్చబడ్డాయన్నారు. వరదలతో దెబ్బతిన్న దేశంలో మానవతా సహాయం కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, అయితే అవినీతి కారణంగా దేశానికి సరైన నిధులు చేరడం లేదు.

ఇదేందయ్యా ఇది : పోర్చుగల్ వెళ్లడానికి విమానమెక్కారు..దిగింది మాత్రం స్పెయిన్ లో

మరోవైపు,తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇటీవల న్యాయశాస్త్ర విద్యార్థుల స్నాతకోత్సవంలో అన్నారు. తమ కంటే చిన్న దేశాలు ఆర్థికంగా తమను దాటిపోతే తాము మాత్రం 75 ఏళ్లుగా చిప్పపట్టుకుని అడుక్కుంటున్నామన్నారు. మిత్ర దేశాల్లో పర్యటిస్తే కూడా డబ్బుల కోసమే వచ్చారని అనుకుంటున్నారని, వారికి ఫోన్ చేసినా అలానే భావిస్తున్నారని అన్నారు.

రూ.32 వేల కోట్ల అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వర్షాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందని షాబాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికే దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. ఇటీవల సంభవించిన వరదలతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. వరదల్లో దేశవ్యాప్తంగా 1400 మంది చనిపోయారని, దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు దీని ప్రభావానికి గురయ్యారన్నారు. వరదల వల్ల మొత్తంగా రూ.95 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని పాక్ ప్రధాని తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Pakistan, WHO

ఉత్తమ కథలు