Home /News /international /

WHO SAYS TRAVEL BANS DO NOT PREVENT OMICRON INTERNATIONAL EXPANSION EVK

WHO: ట్రావెల్ బ్యాన్‌లు "ఓమిక్రాన్" అంతర్జాతీయ వ్యాప్తిని నిరోధించవు: డ‌బ్ల్యూహెచ్ఓ

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

WHO: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicran) వేరియెంట్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా దేశాలు విదేశీ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అంతే కాకుండా ప‌లు అంశాల‌పై ఆయా దేశాల‌కు వ‌చ్చే టూరిస్ట్‌ (Tourists)లు, ప‌ని కోసం వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆక్ష‌లు విధించాయి. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్ఓ (WHO) ప‌లు సూచ‌న‌లు చేసింది.

ఇంకా చదవండి ...
    కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicran) వేరియెంట్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా దేశాలు విదేశీ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అంతే కాకుండా ప‌లు అంశాల‌పై ఆయా దేశాల‌కు వ‌చ్చే టూరిస్ట్‌లు, ప‌ని కోసం వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆక్ష‌లు విధించాయి. ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసు డిసెంబ‌ర్ 1, 2021న‌ మాట్లాడుతూ "ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో ప్ర‌పంచం మ‌ళ్లీ ఉలిక్కిప‌డింద‌న్నారు. అయితే ఈ వేరియంట్ మ‌న‌ల్పి ఇబ్బంది పెట్ట‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని అన్నారు. డ‌బ్ల్యూహెచ్ఓకు సంబంధించిన ఆరు రీజియ‌న్‌ల‌లో 5 రీజియన్ ఒమిక్రాన్ కేసుల‌పై నివేదిక‌ను ఇచ్చాయ‌ని అన్నారు. ప్ర‌స్తుతం 23 దేశాలు కొత్త వేరియంట్ కేసులు వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

    జాగ్ర‌త్త‌ల‌తో కూడిన ప్ర‌యాణాలు, బ్యాన్‌లు ఓమిక్రాన్ యొక్క అంతర్జాతీయ వ్యాప్తిని నిరోధించలేవ‌ని, ఈ ప‌ద్ధ‌తులు జీవ‌నోపాధిపై ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని ఆయ‌న అన్నారు. డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌జల ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్రద్ధ చూపుతుంద‌ని ఆయ‌న అన్నారు.

    Winter Olympics 2022: క్రీడ‌ల‌పై కొత్త వేరియంట్ ప్ర‌భావం.. వింట‌ర్ ఒలంపిక్స్ నిర్వ‌హ‌ణ సాధ్య‌మేనా?


    ప్ర‌పంచ దేశాల కొత్త వేరియంట్ నియంత్న‌ఖు న‌డుంబిగించాల‌ని సూచించారు. అంతే కాకుండా అంద‌రూ టీకాలు వేయించుకొనేలా ప్ర‌భుత్వాలు శ్ర‌ద్ధ చూపాల‌ని సూచించారు.

    వ్యాప్తిని అరికట్టడానికి దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా హేతుబద్ధమైన విధానాల‌ను పాటించాల‌ని WHO చీఫ్ పేర్కొన్నారు. WHO ఓమిక్రాన్‌ను 'ఆందోళనకు సంబంధించిన వేరియంట్'గా ప్రకటించింద‌ని తెలిపారు. ఇప్పుడు కొత్త వేరియంట్‌ను ప్రస్తావిస్తున్నప్పుడు ప్రపంచం అత్యధికంగా ప్రసారమయ్యే డెల్టా వేరియంట్ గురించి మరచిపోకూడదని కూడా గుర్తు చేశారు.

    అంత‌ర్జాతీయంగా కోవిడ్ 19 ప్ర‌భావం నెమ్మ‌దిగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో ప‌లు దేశాలు విదేశీ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌ల‌ను (Restrictions) స‌డ‌లిస్తున్నాయి. న‌వంబ‌ర్ 8, 2021 నుంచి అమెరికా వెళ్లేందుకు భార‌తీయుల‌కు అనుమ‌తి ఇస్తోంది. అంతే కాకుండా న్యూజిలాండ్ (New Zealand) నుంచి ఆస్ట్రేలియా (Australia) కు నిర్బంధ రహిత ప్రయాణం సోమవారం నుంచి పునఃప్రారంభించబడుతుందని ఆస్ట్రేలియా పర్యాటక మంత్రి ఆదివారం తెలిపారు. మార్చి 2020 నుంచి మొదటిసారిగా అంతర్జాతీయ (International) సరిహద్దులను పాక్షికంగా తిరిగి తెరవడానికి దేశం సిద్ధంగా ఉంది. అయితే అమెరికా (America) ఆంక్ష‌ల తొల‌గింపు ఎక్కువ‌గా భార‌తీయుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది.

    చాలా కాలంగా వీసా (Visa)ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభ‌వార్త‌గా చెప్పుకోవ‌చ్చు. అమెరికా ఆంక్ష‌ల స‌డ‌లింపుతో భార‌తీయులు (Indians) హ‌ర్షంగానే ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అమెరికా వీసా కోసం ఎదురుచూడాల్సి రావొచ్చు. ముఖ్యం గా నాన్‌ ఇమ్మి గ్రెంట్‌ వీసా కేటగిరీ వారి అపాయింట్‌ కోసం వేచిచూసే సమయం ఎక్కువగా ఉం డే అవకాశం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యా లయం వెల్లడించింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Covid -19 pandemic, Covid 19 restrictions, Omicron corona variant, World Health Organisation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు