WHO LATEST UPDATES CORONA VIRUS ZERO CASES IN MICRONESIA AND VARIOUS STATES PAH
ఇప్పటికి కొన్ని దేశాల్లో ఒక్క కరోనా కేసు నమోదవ్వలేదు.. అవేంటో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
కరోనా మహమ్మారి(Corona Virus) ఇప్పటికి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఉధృతి తగ్గినప్పటికి.. దీని వ్యాప్తి కొనసాగుతునే ఉంది. అనేక దేశాల్లో కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. కొత్త కొత్త వేరింట్లతో ఇప్పటికి వ్యాప్తి చెందుతునే ఉంది. అయితే, రెండేళ్లుగా దీని ఉధృతి కొనసాగుతుంది. అయితే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(World Health Organisation) తాజాగా ఒక జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, గత రెండేళ్లుగా ఆయా దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. అవేంటంటే..
ప్రపంచ దేశాలలో కరోనా (Corona Virus) ఉధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా మారింది. గత రెండేళ్లుగా ఈ వైరస్.. అనేక దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనిపేరు చెబితేనే ఇప్పటికి అనేక దేశాలు భయంతో వణికిపోతున్నాయి.
వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ, దీని కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను మాత్రం ప్రశాంతంగా ఉంచడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. అయితే, ఇప్పటికి కొవిడ్ మహమ్మారి బారిన పడని దేశాలున్నాయి.
తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) కరోనా బారిన పడని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. ఆయా దేశాలలో గత రెండేళ్లుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ దేశాలు .. ఇతర దేశాల నుంచి రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధించాయి. అదే విధంగా, కరోనా రెండు డోసుల టీకాను కూడా తప్పనిసరిగా అమలు చేశాయి. ప్రస్తుతం ఆ దేశాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కరోనా బారిన పడని దేశాలు..
కొవిడ్ మహమ్మారి బారిన పడని దేశాలు ప్రధానంగా పసిఫిక్, అట్లాంటిక్ మహసముద్రంలోని ద్వీపా సముదాయంలో ఉన్నాయి. అవేంటంటే..
మైక్రోనేషియా: ఈ దేశం పశ్చిమ పసిఫిక్ మహసముద్రంలో విస్తరించి ఉంది. దీనిలో దాదాపు 600 ద్వీపాలు విస్తరించి ఉన్నాయి. దీనిలో మరో నాలుగు ద్వీప సముహాలున్నాయి. పోహ్న్పీ, కోస్రే, చుక్ మరియు యాప్.
నౌరు: ఇది ఓషియానియాలో ఉన్న ఒక దేశం. ఈ దేశంలో పగడపు దిబ్బలు, తెల్లని ఇసుక బీచ్ లు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇక్కడ ప్రతి 100 మందిలో దాదాపు 68 ఇక్కడ రెండు డోసుల టీకాలు వేసుకున్నారు.
నియు: ఇది దక్షిణ పసిఫిక్ మహసముద్రంలోని ఒక చిన్న ద్వీప దేశం. ఇక్కడ ప్రతి 100 మందిలో దాదాపు 79 ఇక్కడ రెండు డోసుల టీకాలు వేసుకున్నారు.
పిట్కైర్న్ దీవులు: ఇందులో పిట్ కైర్న్, హెండర్సన్, డ్యూసీ, ఓనో దీవులున్నాయి. ఇది దక్షిణ పసిఫిక్‌లోని ఒక అగ్నిపర్వత ప్రాంతం. ఇక్కడ 100 మందిలో 74 మంది టీకాలు వేసుకున్నారు.
సెయింట్ హెలెనా: ఇది దక్షిణ అట్లాంటిక్ లోని ఒక రిమోట్ అగ్నిపర్వత ప్రాంతం అవుట్ పోస్ట్. దీన్ని నెపోలియన్ బోనపార్టే బహిష్కరణ ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ ప్రతి 100 మందిలో 58.16 మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు.
టోకెలావ్: న్యూజిలాండ్ సమీపంలో ఉంది. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉంది. ఇక్కడ జనాభా కేవలం 1500 మంది మాత్రమే.
తువాలు: ఇది పలు ద్వీపాల సముహం. కరోనా మహమ్మారి కేసులు బయటపడగానే ఇది వెంటనే సరిహద్దులను మూసివేసింది. ఇతర దేశాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. అదే విధంగా.. తుర్కిమెనిస్థాన్, ఉత్తర కొరియాలు అధికారికంగా కరోనా కేసులను నమోదుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలు..
అదే విధంగా ప్రాణాంతకమైన కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల జాబితాను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించింది. దీని ప్రకారం.. ఈ జాబితాలో 77,521,589 కేసులతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉండగా, 42,780,235 కేసులతో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.