Death Penalty: అమెరికాలో మహిళకు మరణశిక్ష... 67 ఏళ్లలో ఇదే తొలిసారి... ఎందుకు? ఏం చేసింది?

Death Penalty in USA: ఉరిశిక్షలు, మరణ శిక్షల విషయంలో ఇండియా లాగే ప్రపంచ దేశాలు కూడా వెంటనే వాటిని అమలు చెయ్యట్లేదు. మరి ఇప్పుడు అమెరికా మరణ శిక్షను ఎందుకు అమలు చెయ్యాలనుకుంటోంది.

news18-telugu
Updated: October 19, 2020, 9:27 AM IST
Death Penalty: అమెరికాలో మహిళకు మరణశిక్ష... 67 ఏళ్లలో ఇదే తొలిసారి... ఎందుకు? ఏం చేసింది?
అమెరికాలో మహిళకు మరణశిక్ష... 67 ఏళ్లలో ఇదే తొలిసారి... ఎందుకు? ఏం చేసింది?
  • Share this:
Death Penalty in USA: సాధారణంగా మరణశిక్షలు పురుషులకు అమలవుతుంటాయి. అలాంటిది... అమెరికాలో 67 ఏళ్ల తర్వాత ఓ మహిళకు అమలవుతోంది. ఆమె పేరు లిసా మోంట్‌గో మొరీ. డిసెంబర్ 8న ఆమెకు శిక్ష అమలు కానుంది. ఇందుకోసం ఆమెను ఉరి తియ్యరు. సింపుల్‌గా విషపూరితమైన ఇంజెక్షన్ ఇస్తారు. అంతే... అది బాడీలోకి వెళ్లగానే... నెమ్మదిగా బ్రెయిన్ మొద్దుబారేలా చేస్తుంది. తర్వాత నాడీ వ్యవస్థ పనిచేయడం మానేస్తుంది. దాంతో ఆమె చనిపోతుంది. ఈ వివరాల్ని అమెరికా న్యాయ విభాగం శుక్రవారం తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత ఇది జరగనుండటంతో... ప్రపంచ దేశాలు దీనిపై చర్చించుకుంటున్నాయి. ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతుంటే... అంత హోరులో కూడా... అక్కడ ఈ మరణ శిక్ష అంశం హాట్ టాపిక్ అయ్యింది.

అమెరికాలో 1953 డిసెంబర్ 18న బోనీ బ్రౌన్ హెడీ అనే మహిళకు మరణ శిక్ష అమలైంది ఆమె ఏం చేసిందంటే... కిడ్నాప్, హత్య చేసింది. ఇవి రెండూ పెద్ద నేరాలే కావడంతో... మరణశిక్ష వేశారు. మరి ఇప్పుడు లిసా ఏం చేసిందంటే... 2004లో ఓ 8 నెలల గర్భిణీని గొంతు పిసికి చంపింది. ఆ తర్వాత ఆమె కడుపును కోసేసి... గర్భంలోని శిశువును ఎత్తుకెళ్లింది. సినిమాల్లో కూడా ఉండనంత ఘోరమైన దారుణం ఇది. అందుకే లిసాకి 2008లో కోర్టు మరణశిక్ష విధించింది. ఐతే... 2003 నుంచి అమెరికాలో మరణశిక్షలను ఆపేశారు. అందువల్ల బతికిపోయాను అనుకుంది లిసా. కానీ... జులైలో నిర్ణయం మారింది. మరణ శిక్షలు అమలవ్వాల్సిందే అని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఫలితంగా... అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 2న ముగిశాక... డిసెంబర్ 18న మరణశిక్ష అమలు చేయబోతున్నారు.

జులైలో 45 ఏళ్ల డేనియల్ లెవిస్ లీకి అమెరికాలో మరణ శిక్ష విధించారు. 17 ఏళ్లలో ఓ పురుషుడికి విధించడం అదే తొలిసారి. ఆమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మరణ శిక్షల అమలును తిరిగి ప్రారంభించినా... కింది స్థాయిలో 22 రాష్ట్రాలు మాత్రం... దీన్ని అమలు చెయ్యట్లేదు. వాటిలో న్యూయార్క్, హవాయ్, మిన్నెసొటో కూడా ఉన్నాయి. ఐతే... పై స్థాయిలో అంటే ఫెడరల్ లెవెల్ స్థాయిలో 50 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మరణశిక్షలు అమల్లో ఉన్నాయి. అంటే రాష్ట్రాల పాలకులు అమలు చేయకపోయినా... ట్రంప్ ప్రభుత్వం అమలు చేయగలదన్నమాట. అక్కడ అలా రెండు రకాల వ్యవస్థలున్నాయి. ప్రస్తుతం 62 మంది దోషులకు మరణ శిక్షలను కోర్టులు విధించాయి. వాళ్లంతా క్యూలో ఉన్నారు. ఎవరికి ఎప్పుడు విధిస్తారో తెలియదు.
Published by: Krishna Kumar N
First published: October 19, 2020, 9:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading