Next Dalai Lama: దలైలామా వారసుడి ఎంపిక కోసం చైనా రహస్య కమిటీ సమావేశం..! తదుపరి ఎవరు..?

తదుపరి దలైలామా ఎవరు..?

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా తదుపరి వారసుడు ఎవరు..? చైనా ఇప్పటికే దీనిపై ప్రత్యేక ఫోకస్ చేసింది. రసహ్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

  • Share this:
    Next Dalai Lama: తదుపరి దలైలామా ఎవరు..? ప్రస్తుతం దలైలామా వారసుడి విషయంలో చైనా - టిబెట్ మధ్య వివాదం దుమారం రేపుతోంది. ప్రస్తుతం తన మరణంపై జరుగుతున్న చర్చలను.. తొందరపాటు విషయంగా పేర్కొన్నారు బౌద్ధ మత గురువు దలైలామా. ఇటీవల 86 ఏళ్లు పూర్తి చేసుకున్న దలైలామా.. తన సొంత విజన్ ప్రకారం తాను 113 ఏళ్లు బ్రతికే అవకాశముందన్నారు. కానీ దలైలామా చనిపోకముందే ఆయన వారసుడిని ఎంపిక చేసే అధికారం ఎవరికుందనే విషయమై ఇప్పుటికే చైనా - టిబెట్ మధ్య వివాదం తీవ్రతరమైంది. తదుపరి దలైలామా ఎంపిక కోసం చైనా ప్రభుత్వం ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ను సిద్ధం చేస్తోంది. దలైలామా ఎంపిక ప్రక్రియ ప్రారంభించడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనవరిలో 25 మంది సీనియర్ ప్రభుత్వ వ్యక్తులతో రహస్యంగా ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

    1995లో జరిగిన గందరగోళ సంఘటనలను పునరావృతం చేయకుండా ఉండేందుకు చైనా ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. 1995లో చైనా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, దలైలామా.. ఆరేళ్ల బాలుడు గెధున్ చోకీ నైమా అనే ఆరేళ్ల బాలుడిని తదుపరి పంచన్ లామా అని ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన వచ్చిన మూడు రోజుల తరువాత ఆరేళ్ల బాలుడు నైమా అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ బాలుడి ఆచూకీ దొరకలేదు. చైనానే ఆ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. అయితే నైమా స్థానంలో చైనా ప్రభుత్వం నియమించిన పంచెన్ లామాను చాలా మంది టిబెటన్లు తిరస్కరించారు.

    తదుపరి దలైలామాను ఎంచుకోవడానికి నియంత్రించడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టిబెట్ పై చైనా నియంత్రణను దెబ్బతీసింది ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా.. అందుకే ఇప్పుడు చైనా వేగంగా పావులు కదుపుతోంది. టిబెట్ లోపల దలైలామా ఫొటోలను, ఆయన కార్యక్రమాలను చైనా నిషేధించినప్పటికీ.. ఇప్పటికీ అనేకమంది టిబెటన్లు దలైలామాని గౌరవిస్తారనే ఉంటారు. దీంతో ఎలాగైనా ఆయన ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని చైనా భావిస్తూనే ఉంది. ఇందులో భాగంగా రహస్య కమిటీ సమావేశమైనట్టు సమాచారం.
    Published by:Nagesh Paina
    First published: