హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఎవరీ మసూద్ అజార్... ఎందుకు ఉగ్రవాది అయ్యాడు? బిన్ లాడెన్‌తో సంబంధమేంటి?

ఎవరీ మసూద్ అజార్... ఎందుకు ఉగ్రవాది అయ్యాడు? బిన్ లాడెన్‌తో సంబంధమేంటి?

మసూద్ అజార్(File)

మసూద్ అజార్(File)

Jaish-e-Mohammad chief Masood Azhar : పుల్వామా ఉగ్ర దాడి సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ చరిత్రలో ఎన్నో మలుపులు. ఎన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు.

జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కిడ్నీ సమస్యలతో రావల్పిండిలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టింది. లేదు... బతికే వున్నాడనీ తమ దేశంలోనే అనారోగ్యంతో ఉన్నాడని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్థాన్ ISI ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇదని కొందరంటున్నారు. అల్లా దయతో మసూద్ అజార్ సురక్షితంగానే ఉన్నాడని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేసింది. మసూద్ కుటుంబ సభ్యులు కూడా అతను బతికేవున్నాడని చెబుతున్నట్లు పాకిస్థాన్‌కి చెందిన జియో న్యూస్ తెలిపింది. అసలు విషయం తెలుసుకునేందుకు భారత నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.


masood azhar, maulana masood azhar, masood azhar dead, masood azhar pakistan, who is masood azhar, masood azhar video, masood azhar speech, jem chief masood azhar, masood azhar ill, masood azhar news, shah mahmood qureshi masood azhar, molana masood azhar, masood azhar illness, masood azhar dead news, jaish chief masood azhar, masood azhar really dead, masood azhar latest news, maulana masood azhar news, మసూద్ అజర్, అభినందన్, బాలాకోట్, పాకిస్తాన్, మసూద్ అజార్, ఉగ్రవాది, జైషే మహ్మద్, అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్, పుల్వామా ఉగ్రదాడి, జమ్మూకాశ్మీర్, పాకిస్థాన్, బతికే ఉన్నాడా, మసూద్ అజార్ ఆరోగ్యం, మసూద్ అజహర్, ఉగ్రవాది, ఉగ్ర వాది
మసూద్ అజార్


ఇదీ మసూద్ అజార్ చరిత్ర : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన మసూద్ అజార్ 2000 సంవత్సరంలో జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) సంస్థను స్థాపించాడు. 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినప్పుడు... దాన్ని విడుదల చేయించే క్రమంలో భారత NDA ప్రభుత్వం అప్పటి ఖైదీగా ఉన్న మసూద్ అజార్‌ను విడిచిపెట్టింది. అలా భారత్ నుంచీ తప్పించుకున్న 50 ఏళ్ల మసూద్ అజార్ నిలువెల్లా ఉగ్రవాదాన్ని నింపుకున్నాడు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి సూత్రధారి అయ్యాడు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడికి కూడా స్కెచ్ వేసింది ఇతనే. పఠాన్‌కోట్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌పై దాడి చేయించాడు. తాజాగా కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి వెనక కూడా ఉన్నది మసూద్ అజారే అన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట.


పాకిస్థాన్ సరిద్దుల్లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడే కుర్రాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను మానవ బాంబులుగా తయారుచేస్తున్నాడు మసూద్ అజార్. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్... జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేసింది.


masood azhar, maulana masood azhar, masood azhar dead, masood azhar pakistan, who is masood azhar, masood azhar video, masood azhar speech, jem chief masood azhar, masood azhar ill, masood azhar news, shah mahmood qureshi masood azhar, molana masood azhar, masood azhar illness, masood azhar dead news, jaish chief masood azhar, masood azhar really dead, masood azhar latest news, maulana masood azhar news, మసూద్ అజర్, అభినందన్, బాలాకోట్, పాకిస్తాన్, మసూద్ అజార్, ఉగ్రవాది, జైషే మహ్మద్, అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్, పుల్వామా ఉగ్రదాడి, జమ్మూకాశ్మీర్, పాకిస్థాన్, బతికే ఉన్నాడా, మసూద్ అజార్ ఆరోగ్యం, మసూద్ అజహర్, ఉగ్రవాది, ఉగ్ర వాది
ఒసామా బిన్ లాడెన్


ఒసామా స్నేహితుడు : అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కి ఫ్రెండే ఈ మసూద్ అజార్. ఒసామా... చాలా ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాద దాడులు చేయించాడు. మతానికీ, ఉగ్రవాదానికీ లింక్ పెట్టి... జీహాద్ అనే పవిత్ర పదాన్ని కాస్తా ఉగ్రవాద చైతన్య పదంగా మార్చేశాడు. అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాల్లో ఒసామా ఉగ్రవాద దాడులు చేయించాడు. అవన్నీ దగ్గరుండి చూసిన మసూద్ ఉడుకురక్తంతో రెచ్చిపోయాడు. తాను కూడా ఒసామాలా ప్రపంచ గుర్తింపు పొందాలని కలలు కన్నాడు. ఇండియా రిలీజ్ చేసిన రోజున మసూద్ వెళ్లింది ఒసామా బిన్ లాడెన్ దగ్గరకే.


1993 నుంచీ లాడెన్, మసూద్ అజార్ కలిసి పనిచేసేవాళ్లు. 1994లో జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద బోధనలు చేస్తున్నాడని మసూద్ అజార్‌ను అరెస్టు చేశారు. అతన్ని విడుదల చేయించేందుకు హర్కతుల్ అన్సార్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఒమర్ షేక్... 1994లో ఇండియాలో నలుగురు విదేశీయులను కిడ్నాప్ చేశాడు. ఐతే... భారత భద్రతా బలగాలు ఒమర్ షేక్‌ని అరెస్టు చేసి, కిడ్నాప్ అయిన బాధితుల్ని రిలీజ్ చేశారు.


1995లో హర్కతుల్ అన్సార్ సంస్థ ఈసారి ఐదుగురు విదేశీ పర్యాటకుల్ని భారత్‌లో కిడ్నాప్ చేసింది. మసూద్‌ని రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేసింది. పని జరగకపోవడంతో ఆ ఐదుగుర్నీ చంపేసింది.


కాందహార్ విమాన హైజాక్ ఎపిసోడ్ తర్వాత బయటికొచ్చిన మసూద్ అజార్... వెంటనే జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు. 2000 సంవత్సరం ఏప్రిల్‌లో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మొదటి ఆత్మాహుతి దాడి చేయించాడు. 24 ఏళ్ల అసిఫ్ సాధిక్ మానవ బాంబుగా మారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు.


1979-1989లో మసూద్ అజార్... సోవియట్ ఆప్ఘాన్ యుద్ధంలో పాల్గొని గాయపడ్డాడు. హర్కతుల్ అన్సార్ సంస్థలో ప్రేరణ విభాగం (department of motivation)కి అధినేత అయ్యాడు.


1990లో హర్కతుల్ అన్సార్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా మసూద్ పనిచేశాడు. తద్వారా ఆ సంస్థ అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో చేపట్టిన రిక్రూట్‌మెంట్లను స్వయంగా వెళ్లి పరిశీలించాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఫండ్స్ సేకరించాడు. ఇస్లాం ప్రపంచ మతం కావాలని ప్రచారం చేశాడు. జాంబియా, అబూ దాబీ, సౌదీ అరేబియా, మంగోలియా, బ్రిటన్, అల్బేనియాల్లో పర్యటించాడు.


1993 జనవరిలో బంగ్లాదేశ్ వెళ్లిన మసూద్... అక్కడ ఉగ్రవాదంపై ప్రసంగాలు చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది సోమాలియా వెళ్లి అల్‌ఖైదా తరపున పనిచేస్తున్న ఉగ్రవాదుల్ని కలిశాడు. అప్పటి నుంచీ జీహాద్ పదాన్ని ఉగ్రవాదం కోసం ప్రచారం చెయ్యడం మొదలుపెట్టాడు. బ్రిటన్‌లో కొందరు మసూద్ అజార్‌కి ఆయుధాలు సప్లై చేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చిన మసూద్... జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద ప్రసంగాలు చేస్తుంటే... 1994లో అరెస్టు చేశారు.


ఇలా మసూద్ అజార్ చరిత్ర మొత్తం ఉగ్రవాదంతో ముడిపడి ఉంది. పౌరులు, సైన్యాన్ని చంపడం, ఇస్లాం మతాన్ని ప్రపంచ మతంగా మార్చడం వంటి అతివాద భావాలతో పెరిగిన మసూద్ అజార్... తన చుట్టూ ఉన్న ప్రపంచం ఏం చెబితే అదే కరెక్ట్ అని భావించాడు. ఒసామా బిన్ లాడెన్‌ కారణంగా మసూద్‌లో ఉగ్రవాద భావాలు మరింత ఎక్కువయ్యాయి. ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు లేకపోవడంతో ప్రపంచం ఓ ప్రమాదకరమైన ఉగ్రవాదిని చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం మసూద్ బతికే ఉన్నాడని తెలుస్తున్నా... అతని ఆరోగ్యం అత్యంత క్షీణ పరిస్థితుల్లో ఉంది.


 


ఇవి కూడా చదవండి :


మరో రికార్డ్ దిశగా కుంభమేళా... ఇవాళ కోటి మంది పుణ్య స్నానాలు


సమ్మర్‌లో సబ్జా గింజలు తాగితే చాలు... ఎంతో ఆరోగ్యం...


కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే


పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...


పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

First published:

Tags: Jammu and Kashmir, National News, Pulwama Terror Attack, Surgical Strike 2

ఉత్తమ కథలు