WHO: కరోనా వైరస్‌పై కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆందోళనలో ప్రజలు..

డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. రానున్న కొన్ని నెలల్లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచం మరో వేవ్‌ను ఎదుర్కోబోతోందని.. ఈ వేవ్‌లో కూడా ఇన్‌ఫెక్షన్ బారిన పడేవారి సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండబోతోందని టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ చెప్పారు.

  • Share this:
    జెనీవా: కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. రానున్న కొన్ని నెలల్లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచం మరో వేవ్‌ను ఎదుర్కోబోతోందని.. ఈ వేవ్‌లో కూడా ఇన్‌ఫెక్షన్ బారిన పడేవారి సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండబోతోందని టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ చెప్పారు. ఈ ప్రపంచం ఎప్పుడు ఈ వైరస్ అంతమయ్యే అవకాశాన్ని ఎంచుకుంటుందో అప్పుడే ఈ ఉపద్రవం ప్రపంచాన్ని వీడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటర్నేషన్ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపద్రవం ప్రపంచానికి పరీక్ష పెట్టిందని.. ప్రపంచం ఈ పరీక్షలో ఫెయిలయిందని టెడ్రోస్ చెప్పారు. ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే రానున్న నెలల్లో డెల్టా వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. 3.4 మిలియన్ల కొత్త కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయని.. గత వారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య 12 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. రానున్న మూడు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నమోదు కానున్న కరోనా కేసుల సంఖ్య 200 మిలియన్లకు పైగానే ఉండబోతోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యే అవకాశం ఉండటానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

    వేరియంట్లు మరింతగా మ్యుటేషన్ చెందే అవకాశం ఉండటం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఆంక్షలను సులభతరం చేయడం, భౌతిక దూరం పాటించకుండా ప్రజలంతా కలియతిరగడం, ఇంకా చాలామంది వ్యాక్సిన్ తీసుకోని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉండటం... ఈ నాలుగు కారణాల వల్ల రానున్న రోజుల్లో వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

    ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండోనేషియా(3,50,273 కొత్త కేసులు, కేసుల సంఖ్య 44 శాతం పెరుగుదల), బ్రిటన్ (2,96,447 కొత్త కేసులు, కేసుల సంఖ్య 41 శాతం పెరుగుదల), బ్రెజిల్‌లో(2,87,610, గతంతో పోల్చుకుంటే బ్రెజిల్‌లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 14 శాతం తగ్గుముఖం) కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే.. మరణాల సంఖ్య గడచిన రెండు నెలలతో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టినట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
    Published by:Sambasiva Reddy
    First published: