హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Monkeypox : ' కొత్త భాగస్వాములతో శృంగారం తగ్గించుకోవాలి' .. WHO హెచ్చరిక..

Monkeypox : ' కొత్త భాగస్వాములతో శృంగారం తగ్గించుకోవాలి' .. WHO హెచ్చరిక..

Monkeypox

Monkeypox

Monkeypox : ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. ఇండియాలోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. లేటెస్ట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీపాక్స్ వ్యాప్తిపై హెచ్చరికలు జారీ చేసింది.

  కోవిడ్ మహమ్మారి (Covid-19) సృష్టించిన విలయం నుంచి ఇంకా బయట పడలేదు. ఇంతలోనే మరో వైరస్ కలకలం రేపుతోంది. కరోనా తర్వాత అంతగా భయపెడుతున్న వ్యాధి మంకీ పాక్స్ (Monkey Pox). ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. ఇండియాలోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. అంతేకాకుండా మంకీ పాక్స్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది. లేటెస్ట్ గా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో(WHO) హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయసస్.. గే, బైసెక్సువల్స్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వారు మంకీపాక్స్ బారిన పడే రిస్క్‌ను తగ్గించుకోవాలని అన్నారు. పురుషులతో సంగమించే పురుషులు తమ లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని కోరారు. కొత్త భాగస్వాములతో శృంగారం జరపడాన్ని పునరాలోచించుకోవాలని వివరించారు. ఈ జాగ్రత్తలనూ అందరూ పాటించడానికి సమాచారాన్ని పంచుకోవాలని తెలిపారు.

  ఈ ఏడాది మేలో మంకీపాక్స్‌ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసుల్లో 98 శాతం.. స్వలింగ సంపర్క పురుషులు, స్త్రీ-పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారిలోనే వెలుగుచూశాయని ఆయన తెలిపారు.ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు.

  వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వల్లే ప్రధానంగా ఇది వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యక్తి శరీరం, నోరు, ముఖాన్ని తాకడంతోపాటు నోటి తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇది స్వలింగ సంపర్కుల్లోనే తొలుత బయటపడినప్పటికీ.. తల్లి నుంచి పిల్లలకు, కుటుంబ సభ్యుల్లో వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాప్తిచెందే ఆస్కారం ఉందన్నారు. ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. జాతీయ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఈ వివరాలు వెల్లడించారు.

  పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ చాలా కాలంగా మంకీపాక్స్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఏడాది మే తర్వాత మంకీపాక్స్ కేసులు బయటి దేశాల్లోనూ నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల నుంచి 18 వేలకు పైగా కేసులు నమోదు అయినట్టు తమకు రిపోర్టులు వచ్చాయని బుధవారం టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. ఇందులో 70 శాతం కేసులు యూరప్‌లో 25 శాతం కేసులు అమెరికాలో నమోదు అవుతున్నాయి.

  ఇది కూడా చదవండి : మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నయా ? అయితే ఇది మంకీపాక్స్ అయి ఉంటుంది.. ఒకసారి చెక్ చేయడం బెటర్..!

  మే నెల నుంచి ఈ వైరస్ కారణంగా ఐదుగురు మరణించారు. పది శాతం మంది వైరస్ పెయిన్ నుంచి ఉపశమనం పొందడానికి హాస్పిటల్‌లో చేరక తప్పలేదు. ఇందులో 95 శాతం కేసులు లైంగిక కార్యాల ద్వారానే వ్యాపించినట్టు వివరించింది.అయితే, ఈ వైరస్ కేవలం అలాంటి వారికే సోకుతుందనుకుంటే తప్పులో అడుగు వేసినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్ తుంపర్లు, స్కిన్ టు స్కిన్ కంటాక్ట్ ద్వారా, వారు వాడిన దుప్పట్లు, టవల్స్ ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని వివరిస్తున్నారు. మంకీపాక్స్ బారిన ఎవరైనా పడొచ్చని టెడ్రోస్ అధనామ్ స్పష్టం చేశారు.

  మశూచి టీకాలు మంకీపాక్స్‌కూ పనిచేస్తాయి. గతంలో ఆ వ్యాక్సిన్‌ పొందినవారికి మంకీపాక్స్‌ నుంచి 85 శాతం మేర రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మశూచి అంతం కావడం వల్ల 40 ఏళ్లుగా ఈ టీకాను ఎక్కడా వేయడంలేదు. దీనికితోడు నాటి వ్యాక్సిన్‌ ప్రభావం క్రమంగా తగ్గడం వల్ల మంకీపాక్స్‌ విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం ప్రజలందరికీ ఈ టీకా అవసరంలేదని నిపుణులు చెబుతున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Covid-19, Monkeypox, WHO

  ఉత్తమ కథలు