అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయన అలవాటు, వ్యవహారశైలి అన్నీ వివాదాస్పదమే. తన వ్యాఖ్యలు, అలవాట్లతో వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ట్రంప్.. అధ్యక్షుడిగా మరోసారి గెలవడంలో విఫలమయ్యారు. తాజాగా ఆయన గురించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల రిగ్గింగ్‌కు సంబంధించిన తన వాదనలను అప్పటి అటార్నీ జనరల్ బహిరంగంగా ఖండించారని తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) .. ఉన్నట్టుండి ఆగ్రహంతో ఊగిపోయారట. తన డిన్నర్ ప్లేట్‌ను బలంగా విసిరి కొట్టారట. అంతేకాదు జనవరి 6, 2021న వాషింగ్టన్‌లో ప్రసంగం కోసం గుమిగూడిన నిరసనకారులకు ఇబ్బంది కలగకుండా మెటల్ డిటెక్టర్‌లను(Metal Detectors) తొలగించాలని ఆయన తన ఉద్యోగులను ఆదేశించాడు.
కొందరి వద్ద ఆయుధాలున్నప్పటికీ, ఎవరికీ హాని తలపెట్టాలనే ఉద్దేశంతో వారు రాలేదని ట్రంప్ అన్నారు. అదే రోజు క్యాపిటల్‌కి బదులు వైట్‌హౌస్‌కి (White House) తీసుకెళ్తుండగా.. తాను ప్రెసిడెంట్‌నని.. తనను ఇప్పుడే రాజధానికి తీసుకెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వాహనం స్టీరింగ్‌ని ట్రంప్ చేతిలోకి తీసుకున్నారు. వ్యాపారవేత్తగా ట్రంప్ ఆగ్రహంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎవరూ ప్రస్తావించలేదు.
ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో వైట్ హౌస్ ఉద్యోగిగా ఉన్న కాసిడీ హచిన్సన్.. మంగళవారం విచారణ సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. హచిన్సన్ కొన్ని వాస్తవాలను వెల్లడించారు. ట్రంప్ తన పదవీకాలం చివరి రోజుల్లో తన నిగ్రహాన్ని ఎలా కోల్పోయాడో తెలిపారు. తన మద్దతుదారుల వద్ద ఆయుధాలు ఉన్నాయని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు బాగా తెలుసని.. వారు క్యాపిటల్ వద్ద అల్లర్లు చేశారని వైట్ హౌస్ మాజీ సిబ్బంది చెప్పారు.
Putin: షర్ట్ తీసేద్దామా ? పుతిన్ ఇమేజ్‌ను ఎగతాళి చేసిన G7 నేతలు.. అసలేం జరిగిందంటే..
Russia Ukraine war: మిలిటరీ సిబ్బంది కొరతతో పోరాడుతున్న రష్యా
కాపిటల్ అల్లర్లపై న్యాయ మంత్రిత్వ శాఖ తన దర్యాప్తును విస్తరిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. అయితే ట్రంప్ నేరారోపణలను ఎదుర్కొంటారో లేదో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ విభాగం ట్రంప్‌పై క్రిమినల్ కేసును కొనసాగిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా లేదు. అయితే కొంతమంది న్యాయ నిపుణులు హచిన్‌సన్ ప్రకటన ప్రాసిక్యూటర్‌లకు ఈ అంశంపై ముందుకు సాగడానికి మరింత వాస్తవ సమాచారాన్ని ఇస్తుందని నమ్ముతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, USA