Donald Trump: ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ వైద్యుల కీలక ప్రకటన

Donald Trump: ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ వైద్యుల కీలక ప్రకటన

డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ వైద్యులు కీలక ప్రకటన చేశారు.

  • Share this:
    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ వైద్యులు కీలక ప్రకటన చేశారు. గడిచిన 24 గంటల్లో ట్రంప్ జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నారని.. అయితే ఆయన ఇంకా ప్రమాదం బారి నుంచి బయటపడలేదని తెలిపారు. ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ వైద్యుడు సేన్ కొన్లే మాట్లాడుతూ.. ట్రంప్ చికిత్స అందిస్తున్న వైద్య బృందం చాలా ఆశాజనకంగా ఉందన్నారు. ట్రంప్‌కు 74 ఏళ్లు అయినప్పటికీ ఆయన అంతగా ప్రమాదంలో ఏమి లేరని తెలిపారు. అలాగే రేపు ట్రంప్‌కు తగిన మోతాదులో రెమెడిసివిర్‌ను అందజేసి..క్లినికల్ స్థితిని పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఇక, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ సూట్ నుంచి ట్రంప్ తన అధ్యక్ష విధులను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ మరికొన్ని రోజులపాటు వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్‌లోనే ఉండనున్నారు.

    మరోవైపు తన ఆరోగ్యంపై ట్రంప్ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతానని తెలిపారు. ఆస్పత్రిలో చేరినప్పుడు కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఇప్పుడు బాగానే ఉన్నట్టు చెప్పారు. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నానని.. కానీ రానున్న రెండు మూడు రోజులు అత్యంత కీలకం కానున్నాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే ప్రచారాన్ని ఉధృతం చేస్తానని ట్రంప్‌ చెప్పారు. అలాగే మరో పోస్ట్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆరు నెలలుగా వారు చేస్తున్న సేవలను ఆయన అద్బుతమని కొనియాడారు.

    తనకు, తన భార్యకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే కరోనా నిర్ధారణ అయిన దాదాపు 17 గంటల తర్వాత వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో ఆయ చికిత్స కోసం చేరారు. మెలానియా ప్రస్తుతం వైట్ హౌస్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక, ట్రంప్‌ కరోనా బారిన పడటం అధ్యక్ష ఎన్నికల ప్రచారం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయనకు వైరస్ సోకడంతో కొద్దిరోజుల పాటు ప్రచారసభలకు దూరంగా ఉండాల్సిందే.. మరోవైపు సర్వేలలో ఆయన ప్రత్యర్థి జో బిడెన్ అధ్యక్ష పదవి రేసులో ముందున్నాడని తేల్చుతుండటం ట్రంప్ కు ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: