పళ్ల సెట్ కోసం పోలీసుల ముందు పంచాయితీ... ఎలాంటి తీర్పు ఇచ్చారంటే...

పళ్ల సెట్ ఎవరైనా దొంగిలిస్తారా... విదేశాల్లో అలా కూడా జరిగింది. ఆ కేసు పోలీసుల ముందుకు వెళ్లింది. వాళ్లు ఎలా డీల్ చేశారో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 28, 2019, 2:50 PM IST
పళ్ల సెట్ కోసం పోలీసుల ముందు పంచాయితీ... ఎలాంటి తీర్పు ఇచ్చారంటే...
చోరీ చేసిన దంతాల సెట్ (Image : Facebook - Jennings County Sheriffs Office)
  • Share this:
అమెరికాలోని జెన్నింగ్స్ కౌంటీ షెరిఫ్స్ ఆఫీస్‌కి జులై 22న ఓ మహిళ వెళ్లింది. జొయాన్ చిల్డర్ అనే మహిళ తన దంతాల సెట్‌ను దొంగిలించిందని చెప్పింది. పోలీసులు షాక్ అయ్యారు. ఏంటీ... దంతాల సెట్ ఎత్తుకుపోయిందా అని అడిగారు. "అవున్సార్... మీరే ఎలాగైనా నాకు ఆ సెట్ ఇప్పించాలి. అది నాకు బాగా సెట్ అవుతుంది. అది లేకపోతే నేను తినలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను" అని నత్తి నత్తిగా చెప్పింది. "సరే... నిజంగా మీరు చెప్పిన జొయాన్ చిల్డరే ఆ సెట్ పట్టుకుపోయిందా?" అని మరోసారి గుచ్చిగుచ్చి అడిగారు. "హండ్రెడ్ పర్సెంట్ ఆ దొంగ మొహందే పట్టుకుపోయింది" అని ఆమె మండిపడింది. సరే... కేసు రిజిస్టర్ చేశాం. ఎంక్వైరీ చేస్తాం. మీరేం వర్రీ కాకండి. వీలైనంత త్వరగా ఆ సెట్ మీకు చేరేలా చేస్తామని... FIR కాపీని ఆమెకు ఇచ్చారు.

ఆమె వెళ్లిపోయాక... పోలీసులు... జొయాన్ చిల్డర్‌కు కాల్ చేశారు. ఏదో వేరే కారణం చెప్పి... ఓసారి మీరు పోలీస్ స్టేషన్‌కి రండి పనైపోతుంది అన్నారు. ఆఫీసర్ ముందు కాస్త అందంగా కనిపించాలనుకున్న ఆ మహిళ... దొంగిలించిన దంతాల సెట్‌ను నోట్లో పెట్టుకొని వెళ్లింది. ఆమెతో మాట్లాడిన మహిళా పోలీస్... ఆ దంతాల సెట్‌ని జాగ్రత్తగా గమనించింది. అది ఆమెది కాకపోవచ్చన్న డౌట్ వచ్చింది. ఐతే... అప్పటికప్పుడు యాక్షన్ తీసుకోలేదు.

జొయాన్ వెళ్లిపోయాక... పోలీసులంతా కలిసి... సీసీ కెమెరాల్లో ఫుటేజ్ చూశారు. అందరికీ అదే ఫీల్ కలిగింది. ఆ దంతాల సెట్ ఆమెది కాదనే అనిపించింది. రెండ్రోజుల తర్వాత... జొయాన్ ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆమెను అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమె నోట్లో దంతాల లేదు. అది విడిగా ఆ పక్కన టేబుల్‌పై ఉంది. దంతాల సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఊహించింది నిజమే. ఆ సెట్ ఆమెది కాదు. దానిపై దాన్ని పోగొట్టుకున్న మహిళ పేరు రాసి వుంది. ఇదే విషయాన్ని చెబుతూ... ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు పోలీసులు.
ఈ పోస్ట్‌కి విపరీతంగా లైక్స్, షేర్స్, కామెంట్స్ వచ్చాయి. దీనిపై సెటైరికల్‌గా నెటిజన్లు #wheresmyteeth #youcantmakethisup వంటి హ్యాష్ టాగ్స్ పెట్టారు. ఇదో ఫన్నీ కేస్ అని ఓ నెటిజన్ చెప్పగా... ఈ కేసు భలే ఉందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు