కాళ్లతో నడిచే పాములు... కనిపెట్టిన శాస్త్రవేత్తలు

కాళ్లతో నడిచే పాములు... కనిపెట్టిన శాస్త్రవేత్తలు

కాళ్లతో నడిచే పాములు... కనిపెట్టిన శాస్త్రవేత్తలు (credit - twitter - Live Science )

10 కోట్ల సంవత్సరాల కిందట పాములకు కాళ్లు ఉండేవని కొత్తగా తెలిసింది. ఇప్పుడు పాకుతూ వెళ్తున్న పాములు... అప్పట్లే తొండలు, బల్లుల లాగా కాళ్లతో నడుస్తూ వెళ్లేవని తేలింది.

 • Share this:
  కొన్ని రకాల పరిశోధనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది అలాంటిదే. 10 కోట్ల సంవత్సరాల కిందట పాములకు కాళ్లు, దవడ ఎముక ఉండేవని తెలిసింది. ఎలా కనిపెట్టారంటే... ఓ శిలాజం ద్వారా. దక్షిణ అమెరికాలోని పెటగోనియా ఎడారిలో ఈ మధ్య ఓ శిలాజం దొరికింది. అది 10 కోట్ల ఏళ్ల నాటి పాము శిలాజం అని కార్బన్ డేటింగ్ పరీక్ష ద్వారా తెలుసుకున్నారు. ఆ శిలాజాన్ని చూస్తే... పాములా ఉంది. కానీ... దానికి కాళ్ల ఎముకలు ఉన్నాయి. అందువల్ల అది బల్లి శిలాజంలా కూడా అనిపించింది. అది బల్లా, పామా అన్నదానిపై మరిన్ని పరిశోధనలు చేసి... చివరకు అది పాము అని తేల్చారు. మరైతే... పాముకు కాళ్లెలా వచ్చాయి అని ఆరా తీసుకొని... లెక్కలు వెయ్యగా... అప్పట్లో పాములకు కాళ్లు ఉండేవని స్పష్టమైంది.


  అర్జెంటినాలో కనిపించిన ఈ శిలాజం ద్వారా తెలిసిన కొత్త విషయం ఏంటంటే... మొదట్లో పాములు... కాళ్లతో నడుస్తూ వెళ్లిపోయేవి. ఐతే... అలా నడుస్తూ వేగంగా వెళ్లలేకపోతున్నామని భావించిన పాములు... కాళ్లను వాడటం తగ్గించాయి. పాకుతూ వెళ్లడం ప్రాక్టీస్ చేశాయి. పాకుతూ అయితే... వేగంగా వెళ్లగలుగుతున్న ఫీల్ వాటికి కలిగింది. ఇలా వాడటం మానేసిన కాళ్లు... ఏళ్లు గడుస్తున్న కొద్దీ చిన్నగా అయిపోసాగాయి. కొన్ని కోట్ల సంవత్సరాలు తిరిగేసరికి... కాళ్లు పూర్తిగా మాయమై... పాములకు కాళ్లన్నవే లేకుండా పోయినట్లైంది.


  ఇప్పటివరకూ పాములకు సంబంధించి దొరికిన శిలాజాలు చాలా తక్కువ. అందువల్ల వాటి గురించి ఎక్కువ సమాచారం తెలియదు. తాజాగా దొరికిన శిలాజం వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయని శాస్త్రవేత్తలు ఒకింత సంతృప్తి చెందుతున్నారు.

   

  Pics : అందాల అప్సరస ఊర్వశి రౌతేలా
  ఇవి కూడా చదవండి :

  సియాచిన్‌పై టూరిజమా? కుదరదు... పాకిస్తాన్ ఏడుపు

  భార్యను చంపిన భర్త... రాత్రంతా శవంతోనే నిద్ర

  ఆర్టీసీ బస్సు బోల్తా... 25 మందికి గాయాలు

  నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సాయంత్రంలోపు కీలక ప్రకటన

  IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్... ఇవీ ప్రత్యేకతలు
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు