Home /News /international /

WHAT MAY SURVIVE IF SUN STOPS BURNING WHAT NEW DISCOVERY SAYS SU GH

Solar system: సూర్యుడు శక్తి కోల్పేయే దశకు చేరుకుంటే.. సౌర వ్యవస్థలో మనుగడ సాగించే గ్రహాలు ఏవి?

 (Photo: University of Tasmania)

(Photo: University of Tasmania)

భూమిపై జీవజాతుల మునుగడ సూర్యకాంతి వల్లే సాధ్యమవుతుందనే విషయం తెలిసిందే. అయితే సూర్యుడు ఒక క్షీణిస్తున్న నక్షత్రంగా మారినప్పుడు.. సౌర వ్యవస్థలో ఏయే గ్రహాలు మనుగడ సాగిస్తాయి అనేది ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఆస్ట్రేలియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు.

ఇంకా చదవండి ...
భూమిపై జీవజాతుల మునుగడ సూర్యకాంతి వల్లే సాధ్యమవుతుందనే విషయం తెలిసిందే. అయితే సూర్యుడు ఒక క్షీణిస్తున్న నక్షత్రంగా మారినప్పుడు.. సౌర వ్యవస్థలో ఏయే గ్రహాలు మనుగడ సాగిస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఆస్ట్రేలియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు (Astronomers). దాదాపు ఐదు బిలియన్ సంవత్సరాలలో మన సూర్యుడు శక్తి కోల్పోయే తెల్లని మరుగుజ్జు (white dwarf) దశకు చేరుకుంటే.. ఆ సందర్భంలో బృహస్పతి (Jupiter) మాత్రమే ఉనికిలో ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే భూమి మాత్రం అంతకు ముందు చోటుచేసుకొనే ‘రెడ్ జెయింట్’ దశలోనే విచ్ఛిన్నమవుతుందని గుర్తించారు. భూమి నుంచి 6,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహ వ్యవస్థను పరిశీలించి ఈ కొత్త విషయాలను కనుగొన్నారు. ఈ అధ్యయనాన్ని నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.

"సౌర వ్యవస్థలో (solar system) సూర్యుడికి చాలా దూరంలో తిరుగుతున్న గ్రహాలు మాత్రమే.. సూర్యుడు తెల్లని మరుగుజ్జు దశకు చేరుకున్న తరువాత కూడా మనుగడ సాగించగలవని మా పరిశోధనలో తేలింది. కొన్ని బిలియన్ సంవత్సరాల్లో మన సూర్యుడు ఈ స్థితికి చేరుకుంటాడు" అని తెలిపారు టాస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన పరిశోధకులు డాక్టర్ జాషువా బ్లాక్‌మన్ (Dr Joshua Blackman). తాజా పరిశీలన మన సౌర వ్యవస్థ, గెలాక్సీ పరిణామాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు.

భార్యపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు.. లక్షలు ఖర్చు చేసి ఆమెను ఆస్ట్రేలియాకు పంపించాడు.. కానీ చివరకు..

* బృహస్పతి మనుగడ సాధ్యమే
సూర్యుడు చివరి దశలో తెల్ల మరుగుజ్జుగా మారినప్పటికీ.. బృహస్పతి ఆ ప్రభావాన్ని ఎదుర్కొని సౌర వ్యవస్థలో మనుగడ కోసం పోరాడే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలపుంత మధ్యలో కనుగొన్న ఓ గ్రహంపై ఈ అధ్యయనం చేపట్టారు. టాస్మానియా యూనివర్సిటీ కానోపస్ హిల్‌లో ఏర్పాటు చేసిన ఒక మీటర్ ఆప్టికల్ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ గ్రహ వ్యవస్థను కనుగొన్నారు.

AMOLED Smartphones: రూ.20 వేలలోపు హై క్వాలిటీ డిస్‌ప్లే గల స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నారా?​.. అయితే ఈ 5 ఫోన్లను పరిశీలించండి

ఈ గ్రహం బృహస్పతి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దదిగా ఉంటుంది. భూమి- సూర్యుడి మధ్య దూరం కంటే మూడు రెట్లు.. అంటే దాదాపు 450 మిలియన్ కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో ఉంటుంది. MOA-2010-BLG-477-Lb అనే పేరున్న ఈ అతిపెద్ద గ్రహం.. ఒక తెల్ల మరుగుజ్జు (white dwarf) నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ వ్యవస్థ మన సౌర వ్యవస్థ భవిష్యత్తుకు అద్దం పడుతోంది. "తెల్ల మరుగుజ్జుల చుట్టూ కక్ష్యలో ఉన్న ఇతర గ్రహాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ వ్యవస్థ ఒక ముఖ్యమైన డేటా పాయింట్‌ను అందిస్తుంది. ఇది గ్రహ వ్యవస్థలు అభివృద్ధి చెందే సైద్ధాంతిక నమూనాలను తెలియజేస్తుంది" అని డాక్టర్ జాషువా బ్లాక్‌మన్ చెప్పారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Earth, Solar, Sun

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు