హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Ukraine War: తమపై రష్యా వాక్యూమ్ బాంబ్ ప్రయోగించిందంటున్న ఉక్రెయిన్‌.. అసలేంటీ వాక్యూమ్ బాంబ్‌..?

Russia Ukraine War: తమపై రష్యా వాక్యూమ్ బాంబ్ ప్రయోగించిందంటున్న ఉక్రెయిన్‌.. అసలేంటీ వాక్యూమ్ బాంబ్‌..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాక్యూమ్ బాంబ్ అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది అధిక-ఉష్ణోగ్రతతో పేలుడును సృష్టించడానికి చుట్టుపక్కల గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. ఆ ప్రాంతమంతా విచ్ఛిన్నం అయిపోతుంది.

రష్యా ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ కొత్తరకం బాంబు పేరు వెలుగులోకి వచ్చింది. రష్యా తమపై వాక్యూమ్‌(Vacuum) బాంబ్‌ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ రాయబారి ఒక్సానా మరకరోవా సోమవారం అమెరికా చట్ట సభలో ప్రకటించారు. అమెరికా చట్ట సభలో మాట్లాడుతూ.. ‘వారు ఈ రోజు వాక్యూమ్ బాంబును(Vacuum Bomb) ఉపయోగించారు. రష్యా ఉక్రెయిన్‌పై(Ukraine) చేయాలనుకుంటున్న విధ్వంసం చాలా పెద్దది’ అని ఒక్సానా ప్రకటించారు. దీంతో వాక్యూమ్ బాంబుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వాక్యూమ్ బాంబ్ అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది అధిక-ఉష్ణోగ్రతతో పేలుడును సృష్టించడానికి చుట్టుపక్కల గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. ఆ ప్రాంతమంతా విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ బాంబులు ‘థర్మోబారిక్’ వర్గానికి చెందినవి. ఇప్పుడున్న సంప్రదాయ బాంబులతో పోలిస్తే ఈ థర్మోబారిక్ బాంబులు చాలా భిన్నమైనవి. శక్తివంతమైనవి.

Mission Ganga: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించడంలో నిమగ్నమైన అధికారులు.. కొనసాగుతున్న ‘మిషన్‌ గంగ’..!

సంప్రదాయ బాంబుల్లో 25 శాతం పేలుడు పదార్థం ఉంటుంది. అది మండి పేలేందుకు వీలుగా 75 శాతం ఆక్సిడైజర్లను వాడుతుంటారు. కానీ, ఈ థర్మోబారిక్ బాంబుల్లో మొత్తంగా పేలుడు పదార్థాలనే వినియోగిస్తారు. బాంబును ప్రయోగించాక టార్గెట్‌ను చేరే క్రమంలో మన చుట్టూ ఉండే గాలిలోని ఆక్సిజన్ ను వాడుకుని టార్గెట్‌కు అతి చేరువలో గాల్లోనే అది పేలుతుంది. ఇది చేసే విధ్వంసం చాలా పెద్దది.

ఈ బాంబు పేలుడు ద్వారా ఊహకందని ఉష్ణోగ్రతలు విడుదలవుతాయి. పేలిన చోట 300 మీటర్ల నుంచి 600 మీటర్ల దాకా దాని ప్రభావం ఏర్పడుతుంది. ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేసి గాలిలో వాక్యూమ్ (ఖాళీ)ను ఏర్పరుస్తుంది. అందుకే వీటిని ‘వాక్యూమ్ బాంబ్స్’ అని, ‘ఏరోసాల్ బాంబ్స్’ అని, ‘ఫ్యూయెల్ ఎయిర్ ఎక్స్ ప్లోజన్ బాంబ్స్’ అనీ పిలుస్తుంటారు. ఈ బాంబు పేలాక ఏర్పడే తరంగాల వల్ల దాని చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలోని జనాలపై ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తులు, మెదడులోని కణజాలాలు, కంటిచూపు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ థర్మోబారిక్ బాంబులను రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే తయారు చేశారు. ఈ బాంబులు కేవలం రష్యా దగ్గర మాత్రమే కాదు అమెరికా, జర్మనీ వంటి దేశాల దగ్గర కూడా ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక థర్మోబారిక్ బాంబ్ ఉంది. అయితే అది అంత శక్తిమంతమైనది కాదు. ఈ థర్మోబారిక్ బాంబుల వల్ల మనుషులపై పెద్దఎత్తున ప్రభావం పడే అవకాశం ఉన్నందున అప్పట్లోనే వీటిని హ్యూమన్ రైట్స్ కమీషన్ నిషేధించింది. కానీ మళ్లీ ఇప్పుడు రష్యా తమపై ప్రయోగిస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తుంది.


Russia-Ukraine War: "అంత‌ర్జాతీయ దళం".. అప్పుడు హిట్ల‌ర్‌.. ఇప్పుడు పుతిన్‌ను ఓడిద్దాం: ఉక్రెయిన్

శనివారం మధ్యాహ్నాం ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలో థర్మోబారిక్ రాకెట్ లాంచర్‌ను గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకటించింది. కానీ రష్యా వాక్యూమ్‌ బాంబ్‌ను ప్రయోగించినట్లు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. పౌరులను చంపే లేదా గాయపరిచే అలాంటి బాంబులను ప్రయోగించడం నిజమైతే.. అది యుద్ధ నేరం అవుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Bomb, Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు