హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Indonesia: ఫుట్ బాల్ స్టేడియంలో హింసాకాండకు కారణమేంటి? పోలీసుల వల్లే ఇంత ఘోరం జరిగిందా?

Indonesia: ఫుట్ బాల్ స్టేడియంలో హింసాకాండకు కారణమేంటి? పోలీసుల వల్లే ఇంత ఘోరం జరిగిందా?

Indonesia: ఈ విషాద ఘటనకు పోలీసులే కారణమని, టియర్ గ్యాస్ ప్రయోగం వల్లే ఇంతమంది చనిపోయారని ఇండోనేషియాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలో పోలీసుల వాహనాలు తగలబెడుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి కారణం అయింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మైదానం అభిమానుల ఘర్షణతో ఒక్కసారిగా యుద్ధవాతావరణాన్ని తలపించింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 174 మంది చనిపోగా..180 మందికి పైగా ఫ్యాన్స్ గాయపడ్డారు. తూర్పు జావాలో మలాన్ నగరంలో జరిగిన అరేమా- పెర్సెబయా ఫుట్ బాల్ మ్యాచ్ లో జరిగిన ఈ ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

  కంజురూహన్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో పెర్సెబయా చేతిలో అరేమా జట్టు ఓడిపోయింది. దీనిని జీర్ణించుకోలేని అభిమానులు ఒక్కసారిగా గ్రౌండ్ లోకి దూసుకెళ్లారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయిన ఫలితం లేకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ కారణంగా ఆక్సీజన్ అందక కొందరు, తొక్కిసలాట జరిగి మరికొందరు.. మొత్తంగా 174 మంది మరణించారు.

  ఇక ఈ విషాద ఘటనకు పోలీసులే కారణమని, టియర్ గ్యాస్ ప్రయోగం వల్లే ఇంతమంది చనిపోయారని ఇండోనేషియాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలో పోలీసుల వాహనాలు తగలబెడుతున్నారు. ఒకవేళ టియర్ గ్యాస్ ప్రయోగించకుంటే ఇంతలా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఈ ఘటనపై ఇండోనేషియా ఫుట్ బాల్ అసోసియేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Foot ball, Indonesia

  ఉత్తమ కథలు