మొదలైన హ్యాపీ వింటర్... గూగుల్ స్పెషల్ డూడుల్

Happy Winter 2019 : ఉత్తరార్థ గోళంలో ఈ సంవత్సరం హ్యాపీ వింటర్ మొదలైంది. ఇదేంటో, ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 22, 2019, 2:41 PM IST
మొదలైన హ్యాపీ వింటర్... గూగుల్ స్పెషల్ డూడుల్
మొదలైన హ్యాపీ వింటర్... గూగుల్ స్పెషల్ డూడుల్
  • Share this:
Happy Winter 2019 : ఇండియాలో నవంబర్ నుంచీ ఫిబ్రవరి వరకూ చలికాలం ఉంటుంది. మార్చి నుంచీ ఎండల వేడి మొదలవుతుంది కదా. ఈ భూమిపై మాత్రం ఉత్తరార్థ గోళంలో... ఇవాళ్టి (డిసెంబర్ 22) నుంచీ చలికాలం మొదలవుతుంది. ఇది 2020 మార్చి 20 వరకూ కొనసాగుతుంది. అందువల్ల ఇవాళ్టి నుంచీ ఉత్తరార్ధ గోళంలో ఉండే దేశాల్లో పగటి కాలం తగ్గుతూ... రాత్రి కాలం పెరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరార్ధ గోళంలోని ధ్రువ ప్రాంతంలో అంటే... ఆర్కిటిక్ ప్రాంతంలో ఇవాళ్టి నుంచీ 6 నెలలపాటూ చీకటే ఉంటుంది. అందువల్ల దీన్ని హ్యాపీ వింటర్ అని పిలుస్తున్నారు. దక్షిణార్థ గోళంలో ఉండే దేశాల్లో ప్రజలు చాలా మంది ఎండ వేడిని తట్టుకోగలరు. అదే ఉత్తరార్థ గోళంలో ఉండే దేశాల్లో ప్రజలకు చర్మ కణాల్లో మెలనిన్ అనే పదార్థం తక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ల చర్మం పాలిపోయి ఎండ వేడిని ఏమాత్రం తట్టుకోలేదు. అందువల్ల వాళ్లు చలికాలం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. ఇప్పుడు అది మొదలవ్వడంతో... పండగ చేసుకుంటున్నారు.

డిసెంబర్ 21 వరకూ... ఈ భూమి ఉత్తరార్థ గోళం... సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. డిసెంబర్ 22 నుంచీ అది దూరంగా జరుగుతూ... దక్షిణార్థ గోళం సూర్యుడి వైపు తిరుగుతూ ఉంటుంది. అందుకే పైన చలి పెరుగుతూ...... కింద వేడి పెరుగుతూ ఉంటుంది.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు