తిమింగలాలే తమ సైన్యం... నార్వేకి షాకిస్తున్న రష్యా

Beluga Whales Russia : త్రివిధ దళాలు మనకు తెలుసు. సముద్రాల్లో నిఘా కోసం సబ్‌మెరైన్లను వాడటమూ తెలుసు. అదే సముద్రంలో నీలి తిమింగలాల్ని సైన్యంగా మార్చుకుంటే, వాటితో ప్రత్యర్థులపై దాడులు చేస్తే... రష్యా అలా ఎలా చేయగలుగుతోంది?

Krishna Kumar N | news18-telugu
Updated: April 30, 2019, 2:44 PM IST
తిమింగలాలే తమ సైన్యం... నార్వేకి షాకిస్తున్న రష్యా
బెలుగా తిమింగలాలు దాడి చేస్తాయా
  • Share this:
నార్వేలోని ఇంగ్రా గ్రామంలో అదో నీటి ప్రవాహం. ఆ నీటిలో కొందరు జాలర్లు పడవల్లో వెళ్తుండగా... బెలుగా జాతికి చెందిన తెల్లటి తిమింగలం ఒకటి సముద్రం నుంచీ పైకి వచ్చి కనిపించింది. దాన్ని చూడగానే పడవల్లో వాళ్లంతా ముచ్చట పడ్డారు. వావ్ వేల్ అంటూ కేకలు వేశారు. కొన్ని క్షణాలకే సీన్ రివర్సైంది. ఆ తిమింగలం అత్యంత వేగంగా వచ్చి... పడవల్ని ఇష్టమొచ్చినట్లు కుదిపేసింది. వాటిలో వాళ్లంతా సముద్రంలో పడ్డారు. కొన్ని పడవలు బోల్తా పడ్డాయి. ఆ తిమింగలం అంతు చిద్దామని వాళ్లు అనుకున్నారు. తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో... అది చటుక్కున మాయమైంది. మళ్లీ కనిపిస్తే ఒట్టు. అందరి మొహాల్లో షాక్. ఓ తిమింగలం ఇలాంటి పని చేస్తుందా అని. నిజమే తిమింగలాలు ఎప్పుడూ మనుషులకు హాని చెయ్యవు. ఎందుకంటే అవి మనుషుల్ని తమ స్నేహితుల్లా భావిస్తాయి. మరి ఈ బెలుగా తిమింగలం ఎందుకలా చేసింది. ఆలోచించిన జాలర్లకు ఓ భయంకరమైన విషయం తెలిసింది.

రష్యా నౌకాదళం... బెలుగా తిమింగలాలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తోందనీ, వాటిని తమ ప్రత్యర్థులపై దాడులు చేసేందుకు, ప్రత్యేక ఆపరేషన్లు చేసేందుకు పంపిస్తోందనీ నార్వే మెరైన్ ఎక్స్‌పర్ట్స్ ఆరోపిస్తున్నారు. ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్న ఆ తిమింగలాల మెడకు... ఓ తాడు (Harness) కట్టి ఉంటోందనీ, వాటిని ప్రత్యేకంగా గుర్తించడానికే ఆ తాడు కడుతున్నారని అంటున్నారు.

whale, russia, harness, beluga whales, soviet russia, norway, military training, whales danger, arctic region, రష్యా, తిమింగలం, తిమింగలాలు, తిమింగలాల సైన్యం, ఆర్మీ తిమింగలాలు, వేల్స్, నార్వే, ఆర్కిటిక్, సోవియట్ రష్యా,
బెలుగా తిమింగలాలు దాడి చేస్తాయా


ప్రస్తుతం నార్వేలో పడవల్లో వెళ్తున్న వారంతా ఎప్పుడు ఏ తిమింగలం దాడిచేస్తుందోనంటూ భయపడే పరిస్థితి. సాధారణంగా బెలుగా తిమింగలాలు ఎక్కువగా రష్యాలో కనిపిస్తుంటాయి. అక్కడి కొందరు సముద్ర రక్షణ నిపుణులు... వాటిని సంరక్షిస్తుంటారు. ఐతే... 1980లో సోవియట్ రష్యా... డాల్ఫిన్లకు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. ఎందుకంటే డాల్ఫిన్లు చాలా బాగా చూడగలవు. పోరాడటంలో ముందుంటాయి. బలంగా ఉంటాయి. పైగా వాటికి మెమరీ పవర్ ఎక్కువ. అందుకే రష్యా వాటిని సముద్రంలో మునిగిపోయిన ఆయుధాల్ని కనిపెట్టేందుకు రష్యా ఉపయోగించేదని తెలిసింది. ఐతే... 1990లో ఆ కార్యక్రమం ముగిసింది.2017 నుంచీ రష్యా మళ్లీ అదే కార్యక్రమం ప్రారంభించిందనే వాదనలొస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్... ఆర్కిటిక్ ఉత్తర ధృవ తీర ప్రాంతంలోని సోవియట్ మిలిటరీ బేస్‌ను తిరిగి తెరిచారనీ, అక్కడ డాల్ఫిన్లకు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది.

 

ఇవి కూడా చదవండి :ఏసీ మెకానిక్ అయిన శ్రీనివాసరెడ్డి... సైకో కిల్లర్ ఎందుకయ్యాడు... అమ్మాయిలను రేప్ చేసి ఎందుకు చంపుతున్నాడు...

హిమాలయాల్లో యతి... 32 అంగుళాల పాదముద్రల్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ...

కుక్కను అరెస్టు చేసిన పోలీసులు... బీజేపీకి ప్రచారం చేస్తోందని...

అతి తీవ్ర తుఫానుగా ఫణి... షిప్పులు, హెలికాప్టర్లు సిద్ధం చేసిన నౌకాదళం... ఏపీపై కొంతవరకూ ప్రభావం...
First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు