• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • WHALE VOMITS WORTH OVER 250000 NEAR BEACH HOUSE THAI WOMAN BECOME RICH AK GH

Whale vomits: తిమింగలం వాంతి చేసుకుంది.. ఆమెను కోటీశ్వరురాలు అయిపోయింది

Whale vomits: తిమింగలం వాంతి చేసుకుంది.. ఆమెను కోటీశ్వరురాలు అయిపోయింది

ప్రతీకాత్మక చిత్రం

అది తిమింగళం వాంతి అని ఆమెకు తెలియదు. చూడ్డానికి వింతగా ఉందని ఇంటికి తీసుకువెళ్లి ఇరుగు పొరుగు వారిని ఆరా తీసిన తరువాత ఆమెకు దాని విలువ తెలిసింది.

  • Share this:
బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఒక థాయ్‌లాండ్ మహిళను అనుకోని అదృష్టం వరించింది. తిమింగళాలు వాంతి చేసుకునే విలువైన పదార్థాన్ని ఆమె సముద్రం ఒడ్డున గుర్తించింది. మన కరెన్సీలో దీని విలువ రూ.1.9 కోట్ల వరకు ఉంటుందట. దీంతో దీన్ని కనుగొన్న సిరిపోర్న్ నిమ్రిన్ అనే 49 ఏళ్ల మహిళ చూస్తుండగానే కోటీశ్వరురాలు అయ్యింది. ఫిబ్రవరి 23న దక్షిణ థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి తమ్మరత్ ప్రావిన్స్ తీరంలో ఆమెకు ఒక వింత పదార్థం కనిపించింది. అది కోడిగుడ్డు ఆకారంలో.. 12 అంగుళాల వెడల్పు, 24 అంగుళాల పొడవు ఉంది. పెద్ద సైజులో ఉన్న ఆ పదార్థం చేపల వాసన వస్తున్నట్లు సిరిపోర్న్ గుర్తించింది. అయితే అది తిమింగళం వాంతి అని ఆమెకు తెలియదు. చూడ్డానికి వింతగా ఉందని ఇంటికి తీసుకువెళ్లి ఇరుగు పొరుగు వారిని ఆరా తీసిన తరువాత ఆమెకు దాని విలువ తెలిసింది.

తిమిగలం వాంతిని అంబెర్ గ్రిస్ అని పిలుస్తారు. ఇది ఒక విలువైన పదార్థం. దీన్ని బ్యూటీ ఉత్పత్తులు, పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారు. మేలైన అంబెర్ గ్రిస్ కు వేడి తగిలితే వెంటనే కరిగిపోతుంది. చల్లార్చిన తరువాత మళ్లీ గట్టిపడుతుంది. ప్రస్తుతం గుర్తించిన అంబెర్ గ్రిస్ బరువు సుమారు ఏడు కిలోల వరకు ఉంది. దాని అసలు విలువను తెలుసుకునేందుకు సిరిపోర్న్ నిపుణుల సహాయం కోరుతోంది. అది నిజమైన అంబెర్ గ్రిస్ అయితే.. దాని విలువ రూ.1.9కోట్ల వరకు ఉంటుంది. ఆ డబ్బుతో చుట్టుపక్కల వారికి చేతనైన సాయం చేస్తామని సిరిపోర్న్ చెబుతోంది. ఇంత పెద్ద విలువైన వస్తువు దొరకడం తన అదృష్టమని ఆమె తెలిపింది.

తేలియాడే బంగారం
అంబెర్ గ్రిస్ ను తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి అంటారు. స్పర్మ్ వేల్ జాతి తిమింగళాల జీర్ణ వ్యవస్థ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది తిమింగళాల జీర్ణాశయంలోకి పదునైన వస్తువులు సులభంగా వెళ్లేలా, అవి జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ స్రావాలు బయటకు వచ్చిన తరువాత గడ్డకట్టుకుపోతాయి. మొదట్లో ఇవి దుర్వాసనను కలిగి ఉంటాయి. కానీ పూర్తిగా ఎండిపోయిన తరువాత సువాసనలు వెదజల్లుతుంది. అందుకే దీనికి సౌందర్య ఉత్పత్తుల్లో, పెర్ఫ్యూమ్ పరిశ్రమలో దీనికి మంచి విలువ ఉంటుంది.

ఇదే మొదటిసారి కాదు
గతంలో అంబెర్ గ్రిస్ లు బయట పడిన సందర్భాలు ఎన్నో వెలుగు చూశాయి. గత ఏడాది డిసెంబర్లో కూడా ఒక జాలరికి సుమారు 100 కేజీల అంబెర్ గ్రిస్ దొరికింది. దక్షిణ థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి తమ్మారత్ బీచ్‌లో నడుస్తున్నప్పుడు అతడు దాన్ని గుర్తించాడు. ఇప్పటి వరకు వెలుగు చూసిన అతిపెద్ద అంబెర్ గ్రిస్ లలో ఇది ఒకటి కావడం విశేషం.
First published:

అగ్ర కథనాలు