ఆస్ట్రేలియాలో అద్భుతం...నదిలో తిమింగలం ప్రత్యక్షం...

ఆస్ట్రేలియాలోని ఒక నదిలో కనిపించిన తిమింగలం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. సముద్రాల్లో నివసించే ఈ భారీ జంతువు చిన్న నదిలోకి ఎలా వచ్చిందని అక్కడివారు ఆశ్చర్యపోయారు. నదిలో తిమింగలం ఈతకొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

news18-telugu
Updated: September 22, 2020, 5:57 PM IST
ఆస్ట్రేలియాలో అద్భుతం...నదిలో తిమింగలం ప్రత్యక్షం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఆస్ట్రేలియాలోని ఒక నదిలో కనిపించిన తిమింగలం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. సముద్రాల్లో నివసించే ఈ భారీ జంతువు చిన్న నదిలోకి ఎలా వచ్చిందని అక్కడివారు ఆశ్చర్యపోయారు. నదిలో తిమింగలం ఈతకొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ నదిలో ఉన్న మొసళ్లకు చిక్కకుండా తప్పించుకున్న తిమింగలం, సురక్షితంగా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియాలో ఈస్ట్ ఎలిగేటర్ నది ప్రవహించే కాకాడు నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వైరల్ వీడియోకు ‘ఫ్రీ విల్లీ’ అనే క్యాప్షన్ ను జోడించారు. నేషనల్ పార్క్ పేరుమీదే ఈ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. దానికి ఓ కామెంట్ను సైతం జతచేశారు. “థ్యాంక్స్.. నా పరిధిలోకి ఒక హంప్ బ్యాక్ తిమింగలం వచ్చింది. దానికి సెలవు. తప్పిపోయి ఇక్కడికి వచ్చిన ఆ జంతువు మళ్లీ సముద్ర జలాల్లోకి వెళ్లింది. అది అంటార్కిటాకు వలస ప్రారంభించింది” అనే కామెంట్ను కాకాడు నేషనల్ పార్క్ వీడియోకు జతచేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. దాని ప్రయాణం సురక్షితంగా సాగాలని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

దారి తప్పి...

హంప్ బ్యాక్ తిమింగలం నదిలోకి రావడం ఇదే మొదటిసారి అని సీఎన్ఎన్ వార్తాసంస్థ తెలిపింది. తిమింగలాలను నిపుణులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంటారు. ఈ నెలలోనే ఇక్కడి నది సమీపంలో మరో రెండు తిమింగలాలు కనిపించాయి. అవి కూడా సురక్షితంగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేటప్పుడు అవి దారితప్పి ఇలా నదుల్లోకి వస్తుంటాయి. తాజాగా ఇక్కడ కనిపించిన తిమింగలం గతవారం నది ఉత్తర భూభాగంలో మొదటిసారి కనిపించింది. ఓడలు ఢీకొన్నా, తీరానికి కొట్టుకొచ్చినా అది చనిపోయి ఉండేది.



ఎలిగేటర్లు వేటాడుతాయా?
సాధారణంగా ఎలిగేటర్లు, తిమింగలాలు ఒకే ప్రదేశంలో ఉండవు. వాటి నివాస స్థావరాలు వేర్వేరుగా ఉండటమే ఇందుకు కారణం. 2018 నుంచి హంప్ బ్యాక్ తిమింగలాలు కొత్త ప్రదేశాల్లో కనిపిస్తున్నాయని సైన్స్ డైలీ తెలిపింది. వేట కారణంగా కొన్నేళ్లుగా వీటి సంఖ్య తగ్గిపోతోంది. ఆహారం కోసం కూడా ఇవి దారితప్పే వచ్చే అవకాశం ఉంది. హంప్బ్యాక్ తిమింగలాలను ఎలిగేటర్లు వేటాడే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎలిగేటర్లు ఉండే సముద్ర, నది తీరాలకు తిమింగలాలు వచ్చే అవకాశం లేదు.

(Trending Desk)
Published by: Krishna Adithya
First published: September 22, 2020, 5:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading