ఉక్రెయిన్‌లో యుద్ధం చేయడం వల్ల పాశ్చాత్య దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మొదటి నుండి గుర్రుగానే ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు మరోసారి ఆర్థిక రంగంలో రష్యాను(Russia) దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రష్యా చమురు ధరలను ఇకపై పశ్చిమ దేశాలే నిర్ణయిస్తాయని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. రష్యా చమురు ధరను అమెరికా, పశ్చిమ దేశాలు నిర్ణయిస్తాయి. వాస్తవానికి రష్యా ఆదాయంలో ఎక్కువ భాగం చమురు ఎగుమతి ద్వారా వస్తుంది. అందుకే పాశ్చాత్య దేశాలు(Western Countries) ఆర్థిక రంగంలో రష్యాను బలహీనపరచాలనుకుంటున్నాయి. రష్యా ముడి చమురు (Crude Oil) ధరను బ్యారెల్‌కు 60 డాలర్లుగా అమెరికా అధికారులు నిర్ణయించవచ్చని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి.
అయితే ఫైనల్ ధర ఎంత అనేది రానున్న రోజుల్లో మాత్రమే తెలియనుంది. అందుకున్న సమాచారం ప్రకారం, G7 మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు డిసెంబర్ 5 నుండి రష్యన్ ముడి చమురు యొక్క స్థిర ధరను అమలు చేయగలవు. ఇది జరిగితే ధర పరిమితి కారణంగా రష్యన్ చమురును స్థిర ధరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నిర్ణయాన్ని రష్యా ఎప్పటికీ అంగీకరించదు. పాశ్చాత్య దేశాలు ధరను నిర్ణయించే వ్యూహాన్ని అమలు చేస్తే, చమురు ఉత్పత్తిని తగ్గించవచ్చని రష్యా ఇప్పటికే చెప్పింది. ప్రస్తుతం రష్యా చమురు ధరలు మూడు నెలలు లేదా 6 నెలల పాటు స్థిరపడతాయని నమ్ముతారు. అయితే రానున్న రోజుల్లో చమురు ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఐరోపాలోని చమురు వ్యాపారులు ఇప్పటికే ట్యాంక్‌లో రష్యన్ డీజిల్ నింపడానికి పోటీ పడుతున్నారు.
Earthquake : భూకంపాల నిజాలు.. తెలుసుకోండి.. అప్రమత్తంగా ఉండండి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం..14 మంది దుర్మరణం..మేనేజర్ ను కాల్చి చంపిన పోలీసులు
రష్యా నుంచి చమురు కొనుగోలులో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ఈ నెల ప్రారంభంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. షిప్పింగ్ డేటా ఆధారంగా తయారు చేసిన మార్కెట్ నివేదిక ప్రకారం.. రష్యా నుంచి అక్టోబర్ లో చమురు కొనుగోలులో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. గత నెలలో ఉక్రెయిన్ దాడి తర్వాత ముడి ఎగుమతులను నిర్వహించడానికి మాస్కోకు సహాయం చేసిన మూడు దేశాలు రష్యా బారెల్స్ కోసం తిరిగి మార్కెట్లోకి వచ్చాయి. భారతదేశం మరియు చైనాతో పాటు టర్కీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.