చిన్నారి కోసం రూ.2.18 కోట్లు విరాళం... మానవత్వం ఇంకా ఉందని నిరూపించుకున్నారుగా...

America News : ఎలాంటి సంబంధమూ లేని పాత నేరస్థుడు... ఆ చిన్నారిపై అంత దారుణానికి ఒడిగట్టడం ప్రతి ఒక్కరి హృదయాన్నీ కలచివేసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 4:59 PM IST
చిన్నారి కోసం రూ.2.18 కోట్లు విరాళం... మానవత్వం ఇంకా ఉందని నిరూపించుకున్నారుగా...
మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి లాండెన్, పక్కన దుండగుడు అరాండా (Image : Instagram)
  • Share this:
అమెరికా... మిన్నెసొటాలోని వుడ్‌బరీలో ఐదేళ్ల చిన్నారి లాండెన్ హాఫ్‌మాన్ మృత్యువుతో పోరాడుతున్నాడు. శుక్రవారం ఓ దుండగుడు ఆ పిల్లాణ్ని... మూడో అంతస్థు బాల్కనీ నుంచీ కిందకు విసిరేశాడు. తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న లాండెన్‌ను చూసి స్థానికుల హృదయాలు కరిగిపోయాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రేయోభిలాషులు... ఆ చిన్నారిని కాపాడేందుకు ఏకంగా $3,15,000 (రూ.2.18 కోట్లు) విరాళాలు ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలున్నాయి. లాండెన్ కజిన్ ఏప్రిల్ హాఫ్‌మాన్... చిన్నారి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఆ చిట్టితండ్రి కోలుకోవాలని ప్రార్థించమని అందర్నీ కోరింది.

crime patrol,crime,crime patrol satark,true crime,real crime,crime alert,crime stories,indian crime show,indian crime rate,crime documentary,crime patrol dial 100,indian crime investigation,crime tak,crime show,aath crime,crime india,nagpur crime,crime riddles,perfect crime,'crime videos,crime alert 2019,true crime daily,crimes in india,crime patrol 2019,crime video india,crime watch daily,crime stories new,క్రైమ్ కేసు,క్రైమ్ స్టోరీ,అమెరికా క్రైమ్,
చిన్నారిపై ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ (Image : Instagram)


ఆపరేషన్‌కి రెండున్నర కోట్ల రూపాయలు అవసరమని డాక్టర్లు చెప్పారు. శనివారం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టగా... రెండు రోజుల్లో $3,10,000 విరాళాలొచ్చాయి. డొనేషన్లు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆ ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలిపింది.

ఎప్పుడూ చురుగ్గా కదిలే లాండెన్‌కి సాకర్ ఆడటమంటే ఇష్టం. తన అన్నయ్య, అక్కతో కలిసి హాకీ కూడా ఆడతాడట. అలాంటిది మిన్నెపొలీస్ మెట్రో ఏరియాకి చెందిన 24 ఏళ్ల ఇమాన్యూయెల్ దీషాన్ అరాండా చేసిన దుశ్చర్యతో... ఆ చిన్నారి ఆస్పత్రి పాలయ్యాడు. అరాండాపై నరహత్యకు యత్నించిన కేసు నమోదైంది. అరాండా అలా ఎందుకు చేశాడన్నది అర్థం కాలేదు. అతనికీ, తమ కుటుంబానికీ ఎలాంటి సంబంధమూ లేదని చిన్నారి ఫ్యామిలీ తెలిపింది.

అరాండాకు కౌన్సెలింగ్ ఇవ్వాలని భావిస్తున్న పోలీసులు... అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతను ఇంతకు ముందు 2015లో ఓ అధికారితో గొడవపడ్డాడు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన మరో కేసు కూడా ఉంది. ఓ మాల్‌లోకి వెళ్లి... అక్కడి గ్లాస్‌ డోర్‌ని పగలగొట్టి, దాని ఓనరైన మహిళ కాలుపై దాడి చేసిన కేసు కూడా అతనిపై ఉందని పోలీసులు తెలిపారు.ఇవి కూడా చదవండి :

వాళ్ల సంతోషం కోసం నేను... బాడీ షేమింగ్‌పై విద్యా బాలన్ ఏం చెప్పిందంటే...110-140 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది... ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తాజా విశ్లేషణ...

ఎన్నికల ఫలితాలపై... టీడీపీ వ్యూహం ఏంటి... వైసీపీ ఏం చేయబోతోంది...

కిస్ ఇస్తే కొంపముంచాడు... ఆ యువతికి ఏం జరిగిందంటే...
Published by: Krishna Kumar N
First published: April 15, 2019, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading