Covid Deaths : ప్రతి రోజు వెయ్యి మరణాలు.. వారం రోజుల పాటు హలీడే..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(ఫైల్ ఫొటో)

Covid Deaths : రష్యాలో ( Russia)కరోనా మరోసారి విజృంభిస్తోంది.. రష్యా ప్రజల అనాలోచిత నిర్ణయాల వల్ల అక్కడ మరణాలు భారీగానే సంభవిస్తున్నాయి.. 24 గంటల్లో వెయ్యిమంది కోవిడ్ ( covid ) భారిన పడి మృత్యువాత పడుతుండడంతో ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అక్టొబరు ముప్పై నుండి వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

 • Share this:
  రష్యాలో ( Russia )కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆ దేశంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు ( covid deaths )నమోదు అయ్యాయి.. కాగా కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడపై ఆందోళన చెలరేగుతోంది... ఈ క్రమంలోనే అయితే రష్యాలో గత వారం రోజులుగా కరోనా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించాడు. అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఏడు వరకు పెయిడ్ లీవులను ప్రకటించారు. మరోవైపు ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. టీకా ద్వారానే కోవిడ్ చెక్ పెట్టవచ్చని చెప్పారు.

  50 శాతం కూడా దాటని రష్యన్ టీకా

  అయితే అక్కడ ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించడానికి అసలు కారణం టీకా వేయించుకోకపోవడమే అని నిర్ధారణకు వచ్చారు. ఎందుకనో.. రష్యాన్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ ( vaccine ) తయారు చేసి ఇతర దేశాలకు పంపిణి చేస్తున్నా.. అక్కడి ప్రజల్లో మాత్రం టీకాపై అనాసక్తి కనబరుస్తున్నారు.. దీంతో అక్కడి మరణల పెరుగుదలకు కారణమవుతుందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కరోనాను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే ప్రధాన అవకాశంగా పలుదేశాలు భావించాయి.

  ఇది చదవండి : ఇంట్లో ఎవరు లేరని ప్రియుడిని పిలిపించుకుంది.. తమ్ముడు చూశాడని .. దారణం చేసింది.
  టీకాపై నమ్మకం లేని రష్యన్లు..

  అయితే, రష్యాలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అక్కడి ప్రజలకు టీకాలపై అపనమ్మకంతో ఉన్నారు. ఈ కారణంగా రష్యా జనాభాలో మూడో వంతు మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. రష్యా 2.22 లక్షల కోవిడ్ మరణాలతో యూరప్‌లో అత్యధిక మరణాలు ( covid deaths ) నమోదు చేసిన దేశంగా ఉంది. ఒక్కరోజులోలోనే మరో 33 వేల మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున కఠిన ఆంక్షలను విధించడం లేదని ప్రభుత్వం తెలిపింది. దీనికి బదులుగా టీకాపై ప్రజలు చూపుతున్న ఉదాసీనతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. “టీకాలు వేసుకోకపోవడం బాధ్యతారాహిత్యం లాంటిది. ఇది ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందని ప్రభుత్వ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు...

  ఇది చదవండి : ఒకే కంపెనీలో పనిచేసే వీళ్లిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. కానీ.. పాపం..


  కోటికి చేరువలో కరోనా కేసులు

  రష్యాలో కోవిడ్ యాక్టివ్‌ కేసుల సంఖ్య దాదాపు 7.5 లక్షలుగా ఉంది. కరోనా ప్రారంభమైనప్పటి నుండి రష్యాలో నమోదైన అత్యధిక యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా ఇదే. మొత్తం మీద ఇప్పటివరకూ దేశంలో 80 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకటి, రెండు డోసుల టీకాలు తీసుకున్న రష్యన్ల సంఖ్య ఆశ్చర్యకరంగా దగ్గర దగ్గరగా ఉంది. రెండూ కలిపితే జనాభాలో దాదాపు మూడొంతుల మంది కంటే కొంచెం తక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీన్ని బట్టి పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకాలు వేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణలో 50 శాతం కంటే ఎక్కువ మంది టీకా వేసుకోవడంపై ఆసక్తి చూపించడం లేదని తేలింది.

  స్పుత్నిక్ వీ తయారు చేసినా.. దక్కని ఫలితం..

  కాగా టీకాలను అభివృద్ధి చేయడంలో రష్యా ముందే ఉంది. స్పుత్నిక్ వీ టీకాని గతేడాది త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు మరో మూడు టీకాలను రష్యా ప్రభుత్వం ఆమోదించింది. కానీ, టీకాలు నమ్మదగినవని ప్రజలను ఒప్పించడంలో రష్యా విఫలమైనట్లు కనిపిస్తోంది. స్పుత్నిక్ వీ టీకాను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడంలో రష్యా మరింత విజయాన్ని సాధించింది. ఈ టీకా ఇతర దేశాలకు త్వరగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, సరఫరా చేయడంలో సమస్యలు తలెత్తాయి. కొన్ని దేశాలకు సకాలంలో టీకా డోసులు అందడం లేదు.
  Published by:yveerash yveerash
  First published: