Home /News /international /

WEDDING PHOTOGRAPHER HAS BEEN TO PAY FINE EVK

పెళ్లి ఫొటో గ్రాఫ‌ర్‌కు 22,000 డాల‌ర్ల జ‌రిమానా..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

పెళ్లి ఫోటోలు ఆరేళ్ల‌యినా ఇవ్వ‌నందుకు ఫొటో గ్రాఫ‌ర్‌కి బ్రిటిష్ కొలంబియా కెన‌డా జ‌డ్డి 22,000 డాల‌ర్లు జ‌రిమానా విధించారు. ఉద్దేశ పూరిత‌మైన ఆల‌స్యం, ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డంతో పాటు దంప‌తుల‌ను మాన‌సికంగా ఇబ్బందికి గురిచేసిన‌ట్టు గుర్తించిన కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది.

ఇంకా చదవండి ...
  2015లో క‌మ‌న్, రమ‌ణ‌దీప్ రాయ్ దంప‌తులు ఆమ‌న్‌బాల్ ఫొటో గ్రాఫ‌ర్‌తో పెళ్లి ఫొటోలు తీసేందుకు 8,500 డాల‌ర్ల‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంత‌రం వాటిని దంప‌తుల‌కు అప్ప‌గించ‌డంలో ఆల‌స్యం చేశాడు. దీంతో దంప‌తులు కోర్టును ఆశ్ర‌యించారు. ఒప్పందం ప్ర‌కారం నాలుగు సెట్ల బ్లూరే డీవీడీలు, డ‌ఫొటోలు, డిజిట‌ల్ ఆల్బ‌మ్‌, ప్రింట్ ఆల్బ‌మ్ దంప‌తుల‌కు అందించాలి. ఎంత‌కు వాటిని ఇవ్వ‌క పోవ‌డంతో విసుగు చెందిన దంప‌తులు కోర్టును ఆశ్ర‌యించారు.
  ఆమ‌న్ బాల్ ఫొటోలు అందించ‌డంలో బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రించి ఆల‌స్యం చేస్తున్నాడ‌ని, ఫొటోలు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల మాన‌సికంగా క్షోభ‌కు గుర‌వుతున్నామ‌ని వారి ఆవేద‌న‌ను కోర్టుకు తెలియ‌జేశారు. దీనిపై కోర్టు ఫొటో గ్రాఫ‌ర్‌ను వివ‌ర‌ణ కోరింది. 2018లో ఫొటోలు ఎందుకు ఇవ్వ‌లేద‌ని కోర్టు ప్ర‌శ్నించ‌గా వేరే కంపెనీకి మీ ఫొటోలు త‌యారు చేయ‌డానికి పంపాన‌ని చెప్పాడు. ఆ కంపెనీ పేరు కూడా చెప్ప‌లేదు. త‌రువాత ఆల‌స్యానికి కార‌ణం అడ‌గ్గా.. దంప‌తులు త‌న‌కు చెల్లించాల్సిన మొత్తం ఇంకా చెల్లించ‌లేద‌ని పేర్కొన్నాడు. చ‌ట్ట‌ప్ర‌కారం అలాంటిది ఏమీ లేద‌ని విచార‌ణ‌లో కోర్టు నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. కుంటిసాకులు చెబుతూ ఉద్దేశ పూర్వ‌కంగా ఫొటోలు ఇచ్చేందుకు నిరాక‌రిస్తున్న‌ట్టు గుర్తించింది. ఇందుకుగాను స‌రైన స‌మయానికి ఇవ్వ‌నందుకు ఫొటోల‌కు చేసిన న‌ష్టానికి 7,000 డాల‌ర్లు, దంప‌తుల‌ను మాన‌సికంగా క్ష‌భ‌కు గురి చేసినందుకు 10,000 డాల‌ర్లు, 5,000 డాల‌ర్లు న‌ష్ట‌ప‌రిహారం, 236 డాల‌ర్లు కోర్టు ఫీజు విధిస్తూ తీర్పునిచ్చింది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Fine, Photographer, Wedding

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు