Home /News /international /

WE WILL WORK WITH TALIBAN IF NECESSARY UK PM JOHNSON NS

Taliban: తాలిబన్లతో కలిసి పని చేస్తాం.. బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ తాలిబన్ల విషయంలో సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే వారితో కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే.. అదే సమయంలో వారికి కొన్ని దేశాల నుంచి అనుకూల ప్రకటనలు వస్తున్నాయి. కొన్ని దేశాలు తాలిబన్లతో దోస్తికి కూడా సిద్ధమన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, రష్యా తాలిబన్లకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాలిబన్లతో కలిసి పని చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే చైనా వెల్లడించింది. తాజాగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ తాలిబన్ల విషయంలో కీలక ప్రకటన చేశారు. అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అఫ్గాన్‌ సంక్షోభం పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
    Taliban: తాలిబన్లకు మరో షాక్ ఇచ్చిన అమెరికా.. కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్.. వివరాలివే
    Shabnam Dawran: తాలిబన్ల అరాచకం.. మహిళా న్యూస్ యాంకర్‌కు చేదు అనుభవం.. వీడియో‌లో ఆవేదన

    దేశం దాటేందుకు వస్తున్న ఆఫ్ఘన్‌ పౌరులతో కిక్కిరిసిన కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులు నిదానంగా అదుపులోకి వస్తున్నాయని బోరిస్ తెలిపారు. ఇప్పటి వరకు 1,615 మందిని ఆఫ్ఘన్‌ నుంచి బ్రిటన్‌కు తరలించినట్లు వివరించారు. వీరిలో 399 మంది బ్రిటన్‌కు చెందినవారని తెలిపారు. మరో 320 మంది రాయబార కార్యాలయ సిబ్బంది కాగా.. మరో 402 మంది ఆఫ్ఘన్‌ వాసులు ఉన్నారని వివరించారు.

    ఇదిలా ఉంటే.. ఆప్ఘనిస్థాన్ విషయంలోనూ కొన్ని అకౌంట్లలో అసత్య ప్రచారాలు ఎక్కువచ్చాయి. ప్రధానంగా... ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేశారనీ.... వేర్వేరు దేశాలకు చెందిన వారిని బంధించగా... వారిలో భారతీయులు కూడా ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఐతే... కేంద్ర ప్రభుత్వ దగ్గర అత్యంత నమ్మదగిన వ్యక్తుల సమాచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అసలు ఆఫ్ఘనిస్థాన్‌లో భారతీయులకు ఎలాంటి సమస్యా లేదు. అక్కడి తాలిబన్లు భారతీయుల జోలికి రాలేదు. భారతీయులకు సంబంధించి కిడ్నాప్ అనే మాటే లేదు. భారతీయులంతా క్షేమంగా ఉన్నారు.

    ఆప్ఘనిస్థాన్‌లోని కొందరు అధికారులు భారతీయులకు అండగా ఉన్నారు. ఇండియన్స్‌ని సేఫ్‌గా ఇండియా పంపించేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... తాలిబన్లు భారతీయుల్ని ఏమీ అనట్లేదు. వాళ్లను ఆప్ఘనిస్థాన్‌లోనే ఉండమని కోరుతున్నారు. తమ దేశాన్ని అభివృద్ధి చెయ్యమని భారతీయుల్ని కోరుతున్నారు. కానీ తాలిబన్లను నమ్మే పరిస్థితి లేకపోవడంతో... భారతీయులు అక్కడి నుంచి వీలైనంత త్వరగా ఇండియా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా... ఎయిర్ కంట్రోల్ అమెరికా చేతిలో ఉండటంతో... అమెరికాతో సంప్రదింపులు జరుపుతూ... గగనతల మార్గంలో వారిని ఇండియా తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Britain, Taliban

    తదుపరి వార్తలు