SCO Summit: భారత్ 2021లో ఐకరాజ్య సమితిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరుతుంది: ప్రధాని మోదీ

భారత్ 2021లో ఐకరాజ్య సమితిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరుతుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం షాంఘై సహకార సంస్థ(SCO Summit) వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మోదీ పాల్గొన్నారు. 

news18-telugu
Updated: November 10, 2020, 4:54 PM IST
SCO Summit: భారత్ 2021లో ఐకరాజ్య సమితిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరుతుంది: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ(ఫైల్ పొటో)
  • Share this:
భారత్ 2021లో ఐకరాజ్య సమితిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరుతుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం షాంఘై సహకార సంస్థ(SCO Summit) వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మోదీ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా మోదీ మట్లాడుతూ.. ఆత్మనిర్భర భారత్ నేడు ప్రపంచానికి ఓ శక్తి గుణకంగా మారుతుందని చెప్పారు. అన్ని దేశాల సౌర్వభౌమత్వాన్ని, సమగ్రతను మనం గౌరవించాలన్నారు. ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి నిజమైన ముప్పు అని ఆయన అన్నారు. దీనికి భారత్ వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎస్‌సీవో సభ్య దేశాలు ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరోకరు గౌరవించాలని చెప్పారు. పాక్, చైనాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ధీంతో వారికి ఎస్‌సీవో సదస్సు వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చినట్టయింది.

"ఐకరాజ్యసమితి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించినప్పటికీ, ఐకరాజ్య సమితి ప్రాథమిక లక్ష్యం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్ట సమయంలో భారత్‌లోని ఔషధ పరిశ్రమ 150కి పైగా దేశాలకు అవసరమైన మందులను పంపింది. ప్రపంచంలోనే అందరికంటే మెరుగైన టీకా ఉత్పత్తి చేసే దేశంగా, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో మొత్తం మానవాళికి సహాయపడటానికి భారత్ తన టీకా ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది" అని మోదీ తెలిపారు.

ఇక, కొన్ని నెల కిందట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో తాత్కాలిక సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. పోలైన 192 సభ్య దేశాల ఓట్లలో 184 ఓట్లను సొంతం చేసుకుని తాత్కాలిక సభ్య దేశ హోదాను దక్కించుకుంది. రెండేళ్ల కాలానికి భారత్‌ ఈ హోదాలో ఉంటుంది. ఈ కాలపరిమితి 2021 జనవరి ఒకటోతేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

యూఎన్‌ భ‌ద్ర‌తా మండ‌లిలో ఐదు శాశ్వ‌త స‌భ్య దేశాలుంటాయి. వీటితోపాటు ప‌ది తాత్కాలిక స‌భ్య దేశాల‌కూ మండ‌లిలో చోటుంటుంది. అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌ శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశాలు రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికవుతూ ఉంటాయి. ఈస్తోనియా, నైజర్‌, సెయింట్‌ విన్సెంట్‌, గ్రెనడైన్స్‌, ట్యునీషియా, వియత్నాం, బెల్జియం, డొమినికన్‌ రిపబ్లిక్‌, జర్మనీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి. వీటిలో బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికాల రెండేళ్ల కాలపరిమితి ఈ ఏడాదితో ముగియనుంది. భారత్‌తో కొత్తగా ఎన్నికైన దేశాలు ఆ స్థానాలను భర్తీ చేయనున్నాయి. కాగా, ఐకరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ ఎన్నికవ్వడం ఇది ఎనిమిదోసారి.
Published by: Sumanth Kanukula
First published: November 10, 2020, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading