China Vs USA: చైనా-అమెరికా జల జగడం.. యుద్ధ నౌకను తరిమేశామన్న చైనా.. తిప్పికొట్టిన అమెరికా

అమెరికా Vs చైనా

అమెరికా చైనా మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరింది. తమ అనుమతి లేకుండా అమెరికాకు చెందిన యుద్ధ నౌక ప్రవేశించిందని.. దాన్ని తరిమి కొట్టేశామని చైనా అధికారికంగా ప్రకటించింది. కానీ కాసేపటికే అమెరికా దానికి కౌంటర్ ఇచ్చింది. అసలు ఆ దీవిపై చైనాకు అధికారం లేదని చెప్పుకొచ్చింది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి..

  • Share this:
    అమెరికా -చైనా మధ్య మళ్లీ జల జగడం తీవ్రమైంది. ఎవరూ వెనక్కు తగ్గమంటున్నారు. మీరెంత అంటే మీరెంత అని కౌంటర్లకు ఎన్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సౌత్ చైనా సీ లో ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌకను తాము తరిమేశామని చైనా అధికారులు అధికారికంగా ప్రకటించారు. తమ అనుమతి లేకుండా దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి ప్రవేశించిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టామని చైనా ప్రకటించింది. ఆ జలాలపై చైనాకు ఎలాంటి హక్కు లేదని పర్మెనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ న్యాయస్థానం 2016 జులై 12న తీర్పు వెలువరించగా.. తాజాగా చైనా మిలిటరీ కూడా జులై 12నే ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా యుద్ధ నౌక వివాదాస్పద పరాసెల్ ద్వీప సమీపంలో తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందని చైనా ఆరోపించింది. నిజానికి సౌత్ చైనా సీ పై చైనాకు హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు గత ఏడాది ఇదే రోజున రూలింగ్ ఇచ్చింది. ఆ రూలింగ్ నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌక ఈ జలాల్లోకి ఎంటరైంది. అయితే చైనా దీన్ని తప్పు పడుతూ.. తమ ప్రభుత్వ అనుమతి లేనిదే ఈ నౌక ఇక్కడికి ప్రవేశించిందని, ఇది తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించింది.

    చైనా వ్యాఖ్యలు అమెరికా అధికారులు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలు ఎక్కడ వర్తించినా..అమెరికా నౌకలు ఆయా సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాయి.. మమ్మల్ని మీరు ఆపలేరని అమెరికా నేవీ అధికారులు చైనాకు స్పష్టం చేశారు. కాగా అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ని తాము పాటించవలసిన అవసరం లేదని చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. గత కొన్నేళ్లుగా సౌత్ చైనా సీ పై అమెరికా-..చైనా మధ్య రగడ కొనసాగుతూనే ఉంది.. ఈ సముద్ర జలాల్లో 90 శాతం తమవేనని చైనా చెప్పుకొంటుండగా.. అమెరికా దీన్ని ఖండిస్తోంది. అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ని మీరు అతిక్రమిస్తున్నారని పదేపదే ఆరోపిస్తోంది.

    ఇదీ చదవండి: రియల్​మీ ఫ్యాన్స్​​కు గుడ్​న్యూస్​.. రూ. 10 వేలు లోపే 5జీ స్మార్ట్​ఫోన్​ విడుదల..!

    దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్ ద్వీపాలు కొన్నేళ్లుగా వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. పలు సహజవనరులకు నెలవైన ఈ ద్వీపంపై హక్కులు తమవేనంటూ చైనా పొరుగుదేశాలైన వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రూనై గతంలోనే పలు మార్లు ప్రకటించాయి. అయితే.. దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాలతో సహా అక్కడి మెజారిటీ ప్రాంతం మొత్తం తనదేనని, ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చైనా ఇప్పటికీ వాదిస్తోంది. ఈ వాదనను పర్మెనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తోసిపుచ్చినా కూడా చైనా తన పట్టువీడటం లేదు. తమ అనుమతి తీసుకోకుండానే అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ బెన్‌ఫోల్డ్ దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్ ద్వీపం సమీపంలోకి వచ్చిందని చైనా ఇప్పటికే వాదిస్తోంది.
    Published by:Nagesh Paina
    First published: