ఆపదలో ఏనుగు... ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు... వైరల్ వీడియో

Sri Lanka : మానవత్వం ఇంకా బతికే ఉంది అనేందుకు అప్పుడప్పుడూ కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటనను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 15, 2019, 11:55 AM IST
ఆపదలో ఏనుగు... ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు... వైరల్ వీడియో
ఆపదలో ఏనుగు... కాపాడేందుకు శ్రమించిన స్థానికులు... వైరల్ వీడియో (credit - twitter - Daily Mail Online)
  • Share this:
Elephant rescue operation : అది శ్రీలంకలోని ఓ మారుమూల ప్రదేశం. అక్కడ దాహం వేసిన ఓ ఏనుగు... కాలువలో దిగింది. చక్కగా నీరు తాగింది. ఆ తర్వాత అది కాలువ లోంచీ బయటకు రాలేకపోయింది. కొన్ని గంటల తరబడి రకరకాలుగా ప్రయత్నించినా పైకి రావడం దాని వల్ల కాలేదు. దాంతో ఆ ఏనుగు చనిపోతానేమోనని బాగా బయపడిపోయింది. గట్టిగా కేకలుపెట్టింది. దాంతో... కాస్త దూరంలో ఉన్న స్థానికులకు ఆ ఏనుగు అరుపులు వినిపించాయి. ఏం జరిగిందా అని అటుగా వెళ్లారు. ఏనుగు పడుతున్న తిప్పల్ని చూశాక వాళ్లకు విషయం అర్థమైంది. బట్... అదేమీ పెంచుకునే ఏనుగు కాదు. దాన్ని రక్షించేందుకు దగ్గరకు వెళ్తే, అది ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. అందువల్ల వాళ్లు కాలువలో దిగలేదు. అందుకు బదులుగా... అటవీ శాఖ అధికారులకు కాల్ చేశారు. వాళ్లు వచ్చి పరిస్థితి చూశాక... వాళ్లకూ దాన్ని ఎలా కాపాడాలో అర్థం కాలేదు.

చివరకు స్థానికులతో కలిసి పాత టైర్లకు తాళ్లు కట్టి.... నిచ్చెనలా కాలువలోకి వదిలారు. ఆ తాళ్లు, టైర్ల ఆధారంగా పైకి ఎక్కేందుకు ప్రయత్నించి పెయిలైంది ఏనుగు. ఆ తర్వాత స్థానికులు మరో రెండు టైర్లను తెచ్చి... మరో నిచ్చెనలా ఏర్పాటు చేశారు. ఈసారి ఏనుగులో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎలాగైనా ఎక్కాల్సిందే అనుకుంది. లక్కీగా ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. కాలువలోంచీ బయటకు వచ్చిన ఏనుగు... భయంతో పరుగులు తీసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానికుల ప్రయత్నాల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.


మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏనుగుల్ని వాటి దంతాల కోసం చంపేస్తున్నారు. కొన్నైతే ఇలాగే ఆపదల్లో చిక్కుకొని చనిపోతున్నాయి. ఈ ఘటనలో ఏనుగు ప్రాణాలతో బయటపడటం ఆనందదాయకం. ఐతే... ఇదే ప్రదేశంలో కొన్నేళ్ల కిందట 70 ఏళ్ల వయసున్న ఓ సర్కస్ ఏనుగు ఆకలితో చనిపోయిందని స్థానికులు తెలిపారు. అందువల్ల మరోసారి అలా జరగకూడదని భావించామని వారు తెలిపారు. వారి దయాగుణాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంటోంది.

 

Pics : మేకప్ ఆర్టిస్ట్ కాజోల్ ములాని క్యూట్ స్టైల్స్


ఇవి కూడా చదవండి :

12 ఏళ్ల పాకెట్ మనీతో అమ్మకు ఫ్రిజ్ కొన్న కొడుకు... 35 కేజీల కాయిన్లు మోసుకెళ్లి...

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


Health Tips : బ్రెజిల్ నట్స్ తింటే... 20 రకాల ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : పన్నీర్‌‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Published by: Krishna Kumar N
First published: October 15, 2019, 11:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading