Home /News /international /

WANT TO BE YOUNG FOREVER ALTOS LAB IS STUDYING THIS AND AMAZONS JEFF BEZOS AND BILLIONAIRE INVESTS ON THIS BA GH

ఎప్పటికీ ముసలివాళ్లు కాకుండా యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా?.. మీకోసమే ఈ స్టోరీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెజోస్ దీర్ఘాయువు పరిశోధనపై చాలాకాలంగా ఆసక్తిగా ఉన్నాడని, గతంలోనూ యునిటీ బయోటెక్నాలజీ అనే యాంటీ ఏజింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాడని సమాచారం. ఆల్టోస్ సంస్థలో ఆయన వాటా పరిధిని నిర్ధారించలేకపోయినప్పటికీ వయస్సు మీద పడటంతో కొత్త పరిశోధనలతో వయసు తగ్గించుకోవడం అనే అంశం ఆయన మనసులో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
వయసు అనేది స్థిరమైన నదీ ప్రవాహం లాంటిది. దానికి అడ్డుకట్టలు ఉండవు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. అయితే ఎప్పుడూ యువకుల్లా ఉండాలనేది చాలా మంది కల. ముఖ్యంగా ధనవంతుల్లో ఈ ఆశ మరీ అధికంగా ఉంటుంది. అందుకే చాలా మంది ధనవంతులు ఈ అంశంపై దృష్టి సారించి పరిశోధనలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి ఓ కంపెనీయే ఆల్టోస్ ల్యాబ్స్. అమెరికాకు చెందిన ఈ యాంటీ ఏజింగ్ సంస్థ.. మానవులు ఎప్పుడూ యువకుల్లానే ఉండేలా, వారి ఆయుర్దాయాన్ని పెంచే అంశంపై పరిశోధనలు చేయనుంది. దీన్ని యూరీ మిల్నర్ అనే రష్యన్ బిలియనీర్ స్థాపించారు.

గత అక్టోబరులో పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తల బృందం అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ హిల్స్‌లో సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు సాగిన కాన్ఫరెన్స్‌లో ప్రజలను యంగ్‌గా ఎలా ఉంచాలనే అంశంపై చర్చించారు. ఈ భేటీ ఆల్టోస్ ల్యాబ్స్ అనే ప్రతిష్ఠాత్మక యాంటీ ఏజింగ్ కంపెనీ ఏర్పాటుకు దారితీసింది.

 నక్షత్ర శక్తి మనకు మరింత చేరువవుతుందా..? భారీ ప్రయోగానికి సిద్ధమైన అమెరికా శాస్త్రవేత్తలు..


ఆల్టోస్ ల్యాబ్స్‌లో బయొలాజికల్ రీప్రోగ్రామింగ్ టెక్నాలజీ సహాయంతో కణాలను పునరుద్ధరించి ప్రజలను యుక్త వయస్కులుగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ముందుగా జంతువుల శరీరాలపై పరిశోధించి అనంతరం మానవులపై ట్రయల్స్ నిర్వహిస్తారు.

ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, ఇంగ్లాండ్‌లో ప్రారంభించిన ఈ కంపెనీని.. శాండియాగో, కేంబ్రిడ్జ్, జపాన్ లాంటి ప్రదేశాలకు విస్తరించనున్నారు. పలు విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలను పెద్ద సంఖ్యలో ఈ పరిశోధన కోసం నియమించుకుంటున్నారు. కణాల వయస్సు, వయస్సు పెరిగే ప్రక్రియను తిప్పికొట్టేందుకు బ్లూ-స్కై రీసెర్చ్‌పై వీరు పనిచేయనున్నారు.

ధనవంతుల పెట్టుబడులు..
ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులు భాగం కానున్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మిల్నర్‌తో పాటు ఆయన భార్య జూలియా ఓ ఫౌండేషన్ ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరితో పాటు ప్రపంచంలో పేరు మోసిన శాస్త్రవేత్తలు, ధనవంతులు, వర్సిటీల అధ్యాపకులు ఈ రీసెర్చ్‌లో భాగం కానున్నారు.

మిడ్ లైఫ్ సంక్షోభం..
యువకులకు ధనం కావాలి, ధనవంతులకు వయస్సు కావాలి. పరస్ఫర విరుద్ధమైన ఈ విధానాన్ని అధిగమించాలని మిల్నర్(59), బెజోస్(57) లాంటి ప్రముఖులు అనుకుంటున్నారు. వయస్సును స్థిరంగా ఉంచే ఈ పరిశోధనను ఇప్పటికే లైఫ్ బయోసైన్సెస్, టర్న్ బయోటెక్నాలజీస్, ఏజ్ ఎక్స్ థెరపిటిక్స్, స్విఫ్ట్ బయోసైన్స్ లాంటి స్టార్టప్స్ కొనసాగిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు ఇంత వరకు ఎలాంటి క్లినికల్ ట్రయల్స్, చికిత్సలు ప్రజలపై నిర్వహించలేదు.

ఈ రీప్రోగ్రామింగ్ టెక్నాలజీ కోసం బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నారని, ముఖ్యంగా మానవ శరీరమంతా కణాలను పునరుద్ధరించే ప్రక్రియపై పరిశోధన చేస్తున్నారని హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్ అన్నారు. వయస్సును తిరోగమింపజేయవచ్చా అనే ప్రశ్నకు సమాధానంగా శరీరంలో కండరాలు, మేజర్ అవయవాలు అయిన మెదడు వంటి వాటిని పునరుద్ధరించవచ్చని చెప్పారు. ఈయన ఆల్టోస్ ల్యాబ్స్‌లో పనిచేయనప్పటికీ 2020లో జరిగిన భేటీకి హాజరయ్యారు.

సైన్స్‌తో వ్యాపారం..
ఆల్టోస్ ఈ పరిశోధనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 270 మిలియన్ డాలర్ల నిధులను ఈ సంస్థ జూన్‌లో సమీకరించింది. జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజ ధనవంతులు ఈ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల పరిశోధకులకు అధిక మొత్తంలో వేతనాలతో ఆకర్షిస్తున్నారు.

ఆల్టోస్ ఏడాదికి ఓ మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ జీతాలను ఇందుకు వెచ్చిస్తోంది. ప్రస్తుతం తను సంపాదిస్తున్నదాని కంటే 10 రెట్లు అధికంగా చెల్లిస్తున్నారని స్పెయిన్ బార్సిలోనాకు చెందిన ఓ పరిశోధకుడు తెలిపారు.

ఎన్నో సందేహాలకు తావు..
రీప్రోగ్రామింగ్ టెక్నాలజీలో పెట్టుబడులు ప్రయోజనం చేకూరుస్తాయా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది పరిశోధకులు. ఈ సాంకేతికత ఎప్పటికైనా మెడిసిన్‌గా మారుతుందా? అని స్విట్జర్లాండ్ లోని లౌసానో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉన్న అలెజాండ్రో ఒకాంపో ప్రశ్నించారు. ఇది చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి అని, చాలా కంపెనీలు ఇందులో భాగమయ్యాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా 80 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయస్సును తిరోగమింపజేయవచ్చని, అంతకుమించి కుదరదని అన్నారు. అయితే ఇలాంటి పరిశోధనలు మెడిసిన్‌కు ప్రత్యామ్యాయంగా మారలేవని మరికొందరు పరిశోధకులు పెదవి విరుస్తున్నారు.

యంగ్ అండ్ రిచ్..
బెజోస్ దీర్ఘాయువు పరిశోధనపై చాలాకాలంగా ఆసక్తిగా ఉన్నాడని, గతంలోనూ యునిటీ బయోటెక్నాలజీ అనే యాంటీ ఏజింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాడని సమాచారం. ఆల్టోస్ సంస్థలో ఆయన వాటా పరిధిని నిర్ధారించలేకపోయినప్పటికీ వయస్సు మీద పడటంతో కొత్త పరిశోధనలతో వయసు తగ్గించుకోవడం అనే అంశం ఆయన మనసులో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగిన తరువాత.. బెఫ్ బెజోస్ తన అభిరుచికి తగ్గట్లు కొత్త స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఆల్టోస్ ల్యాబ్స్‌లో ఆయన పెట్టుబడుల విషయం అధికారికంగా బయటకు వస్తే.. ఇతర ప్రపంచ కుబేరులు సైతం అధికారికంగా లేదంటే అనధికారికంగా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Jeff Bezos, Life Style, United states

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు