news18-telugu
Updated: October 17, 2020, 10:27 AM IST
Vulture Video: గాల్లో వచ్చి వాలిన రాబందు (credit - reddit)
Vulture Super Video: మీరు గాల్లో పారాగ్లైడింగ్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీ దగ్గరకు గాల్లో ఎగురుతున్న పక్షి వచ్చి ఆగితే, మీకు ఎలా అనిపిస్తుంది... వావ్ అనిపించదూ... అలాంటి అరుదైన సందర్భం ఇది. స్పెయిన్ దక్షిణాన పర్వతాలపై... ఇద్దరు పారాగ్లైడింగ్ చేస్తుండగా... దాన్ని తన సెల్ఫీ స్టిక్ ద్వారా వీడియో తీసుకోసాగాడు ఓ రైడర్. ఇంతలో... గాల్లో ఎగురుతూ... ఓ రాబందు... ఆ సెల్ఫీ స్టిక్ పై వాలింది. ఐతే... ఓవైపు మనుషుల్ని చూస్తూ... ఆ రాబందు బయపడుతూనే... మరోవైపు వాళ్లు ఏమైనా అంటే... వెంటనే ఎగిరిపోయేలా... రెక్కల్ని తెరచి ఉంచింది. వాళ్లు మాత్రం రాబందును ఏమీ అనకుండా అలా చూస్తూ ఉండిపోయారు. ఎంతో ఆనందపడసాగారు. ఓ క్షణం సెల్ఫీ స్టిక్ పై వాలిన రాబందు... మళ్లీ తన దారిన తాను ఎగురుచూ వెళ్లిపోయింది.
రాబందు అలా వాలడానికి ఓ కారణం ఉంది... పక్షులు కంటిన్యూగా ఎగురుతున్నప్పుడు వాటికీ అలసట వస్తుంది. అలాంటప్పుడు ఎక్కడైనా ఓ క్షణం వాలితే... తిరిగి ఎగిరేందుకు శక్తిని కూడగట్టుకోగలవు. సముద్రాల్లో ఓడలు వెళ్లేటప్పుడు పక్షులు వాటిపై వాలడానికి ఇదే కారణం. ఈ వీడియోలో రాబందు కూడా... ఓ క్షణం సెల్ఫీ స్టిక్ పై వాలడం ద్వారా... అది తిరిగి శక్తిని కూడగట్టుకుందన్నమాట.
ఈ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. రెడ్డిట్ లో దీన్ని 26 లక్షల మందికిపైగా చూశారు. చాలా మంది దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే... రాబందు అలా ఎలా వచ్చింది... మామూలుగా అయితే మనుషుల్ని చూడగానే పారిపోతాయే అనుకుంటున్నారు నెటిజన్లు. కొంతమంది దీనిపై సరదా కామెంట్లు పెడుతున్నారు. ఆ రాబందును జురాసిక్ పార్కుకు తీసుకెళ్లాలని ఓ నెటిజన్ రాయగా... ఆ రాబందు సరిగా ల్యాండింగ్ అవ్వలేకపోయిందని మరో నెటిజన్ రాశారు. ఇదేమీ వింత కాదనీ... ఆల్రెడీ దానికి ట్రైనింగ్ ఇచ్చారనీ... అందులో భాగంగానే అది అలా వచ్చి వాలి ఉంటుందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
Vulture hitches ride on selfie stick from r/nextfuckinglevel
బ్రిటన్ ఇన్ స్ట్రక్టర్ స్కాట్ మాసన్... రెగ్యులర్ గా ఇలా టూరిస్టులతో పారాగ్లైడింగ్ చేయిస్తుంటారు. కొత్తవారికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ... పారాగ్లైడింగ్ థ్రిల్ పొందేలా చేస్తారు. స్కాట్ మాసన్ కి పారాహాకింగ్ విధానం తెలుసు. ఈ విధానంలో... పక్షిలా ఎగురుతూ... ఎక్కువ దూరం పారాగ్లైడింగ్ చేయడం వీలవుతుంది. మొత్తానికి ఈ అరుదైన వీడియో... అందరికీ నచ్చేస్తోంది.
Published by:
Krishna Kumar N
First published:
October 17, 2020, 10:27 AM IST